అంతర్రాష్ట్ర గంజాయి విక్రెతల ముఠా అరెస్ట్... భారీగా గంజాయి స్వాధీనం
పక్కా సమాచారంతో మాటువేసిన అబ్దుల్లాపూర్ మెట్టు, మహేశ్వరం ఎస్ఓటి పోలీసులు
వివరాలు వెల్లడించిన రాచకొండ సి పి సుధీర్ బాబు... దీని విలువ సుమారు కోటి రూపాయల పై మాటే
జయభేరి, అబ్దుల్లాపూర్ మెట్టు, ఫిబ్రవరి 20: హైదరాబాదు శివారు అబ్దుల్లాపూర్ మెట్టు రామోజీ ఫిలిం సిటీ దగ్గర భారీ ఎత్తున గంజాయి రవాణా చేస్తున్న ముఠాను గురువారం తెల్లవారుజామున టాస్క్ఫోర్స్ పోలీసులు పక్కా సమాచారంతో మాటువేసి పట్టుకున్నారు.
అనంతరం గురువారం సాయంత్రం ఎల్బీనగర్ లోని రాచకొండ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రాచకొండ సిపి సుదీర్ బాబు వివరాలు వెల్లడించారు. వివరాల ప్రకారం మహారాష్ట్ర కు చెందిన అబ్దుల్ గులాబ్ షేక్ (56) వృత్తిరీత్యా డ్రైవర్, ఆయన తనకి డ్రగ్స్ అక్రమ రవాణా దారులైన మహారాష్ట్ర కి చెందిన వైభవ్, దేవా ల తో పరిచయం ఏర్పడింది. వారు గతంలో కూడా గంజాయి అక్రమ రవాణా దారులు కావడంతో డబ్బుకు ఆశపడి వారితో ఒప్పందం కుదుర్చుకున్నాడు.
వైభవ్, దేవా చెప్పినట్లుగా అహ్మద్ గులాబ్ షేక్ సుమారు 300 కేజీల గంజాయి విశాఖ పట్టణం కు చెందిన బుజ్జిబాబు నుండి తీసుకొని హైదరాబాదుకి తరలిస్తుండగా అబ్దుల్లాపూర్ మెట్టు రామోజీ ఫిలిం సిటీ దగ్గర అప్పటికే పక్కా సమాచారంతో మాటు వేసిన మహేశ్వరం ఎస్ఓటి టీం, అబ్దుల్లాపూర్ మెట్టు పోలీసుల ఉమ్మడి తనిఖీలలో భాగంగా టాటా కంటైనర్ లో గంజాయిని కనుగొన్న పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి సంబంధిత వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.
అదుపులోనికి తీసుకున్న వ్యక్తులను ఎల్బీనగర్ మహేశ్వరం అడిషనల్ ఎస్ఓటి డీసీపీ మహమ్మద్ షేక్ హుస్సేన్ మరియు రాచకొండ కమిషనర్ జి.సుధీర్ బాబు నేతృత్వంలో అబ్దుల్లాపూర్ మెట్టు పోలీసులు నిందితులను రిమాండ్ కు తరలించారు.
Post Comment