ముస్లిం లందరికీ ఇఫ్తార్ విందు

ముస్లిం లందరికీ ఇఫ్తార్ విందు

జయభేరి, కోదాడ : భారతదేశం సర్వ మతాల సమ్మేళనం, మతసామరస్యానికి ప్రతీక ఇఫ్తార్ విందు అని ఉత్తమ్ పద్మావతి రెడ్డి నియోజకవర్గ యువసేన వ్యవస్థాపక అధ్యక్షులు తోగటి యాదాద్రి అన్నారు.  

అనంతగిరి మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయం ఆవరణలో ముస్లిం సోదరులకు ఆదివారం ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రపంచంలో భారతదేశానికి ఒక విశిష్టత ఉందని, అన్ని మతాల సమ్మేళనము సర్వ మతాలను సమానంగా చూసేది ఒక భారతదేశంలోనే అన్నారు.

Read More మృతురాలు కుటుంబానికి ఆర్థిక సహాయం 

రంజాన్ పండుగకు ప్రధాన కారణం ముస్లింల పవిత్ర గ్రంథం దివ్య ఖురాన్ ఈ నెలలోనే ఆవిర్భవించిందన్నారు. ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉన్న రంజాన్ మాసం ప్రత్యేక ప్రార్థనలు, కఠిన ఉపవాస దీక్షలు, దానధర్మాలు, ఆధ్యాత్మిక సందేశాలతో సాగుతుంది అన్నారు. ఈ మాసంలో ముస్లింలు పవిత్రంగా నిష్టగా ఓపికతో ఉండి ఉపవాస దీక్షలు చేస్తారని చెప్పారు.

Read More మున్సిపాలిటీ పరిధిలోని 18 వార్డులో అభినందన సభ

ఈ రంజాన్ మాసంలో నియోజకవర్గ పరిధిలో ముస్లిం  లందరికీ ఇఫ్తార్ విందును అందించడం ద్వారా అది మత సా సామరస్యానికి ప్రతీకగా సమాజానికి చాటి చెప్పడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు బుర్ర పుల్లారెడ్డి, డేగ కొండయ్య, బాబు నాయక్, గుర్రం వెంకటరెడ్డి, ముత్తినేని కోటేశ్వరరావు, ఉపవాస దీక్షకులు  పాల్గొన్నారు.

Read More వివాహ వేడుకల్లో పాల్గొన్న ఉద్యమ నాయకులు మహ్మద్ అప్జల్ ఖాన్