Jagan - Chandrababu : ఆ.. చేతులన్నీ సీఎం జగన్ వైపే చూపిస్తున్నాయి..!
ముప్పేట దాడి చేసిన జగన్ బెదురుతాడా!? సొంత చెల్లెలే వ్యక్తిగత దూషణలకు దిగుతున్న రాజకీయంలో మార్పు తేగలద!?
ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత ధైర్యవంతుడిగా వైయస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ జీవితాన్ని ప్రస్తావించవచ్చు. ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో జనసేన, బిజెపి టిడిపి పార్టీలు కలిసి వైయస్సార్ సీపీ ని ఎలాగైనా ఓడించాలి అన్న పట్టుదలతో ముప్పేట దాడి చేస్తున్న నేపథ్యంలో ఇంకోవైపు కాంగ్రెస్ పార్టీ తన సొంత చెల్లెలే ఎదురు దాడికి దిగింది. ఆ వేళ్ళన్ని జగన్ వైపే చూపిస్తున్నయి.. ఈ నేపథ్యంలో జయభేరి అందిస్తున్న సమగ్ర రాజకీయ విశ్లేషణ కౌంటర్ కడారి శ్రీనివాస్.....
అనే నేను... అన్న ఆ మాట దగ్గర నుంచి అవిశ్రాంత పోరాట యోధుడిగా అనేక సంక్షేమ పథకాలు ఆంధ్ర రాష్ట్రానికి అందిస్తూ బడుల రూపురేఖలను మార్చి ప్రజల వద్దకే అధికారులను పంపి వాలంటరీ వ్యవస్థకు పురుడు పోసి విద్యా వ్యవస్థను పరుగులు పెట్టించిన యువ నేతగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నాటి నుండి నేటి వరకు అలుపెరుగని పోరాట యోధుడిగానే తన పరిపాలన కొనసాగిస్తున్నాడు. ఇక ఆయన ప్రత్యర్ధులు టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగన్ ల మధ్య వాగ్వి వివాదంతో పాటు రాజకీయ దుమారాన్ని రేపింది. నిన్న జైలుకు పంపిస్తా అంటే కాదు కాదు నిన్నే జైలుకు పంపిస్తా అన్న మాదిరిగా ఇరువురు జైలు ఊసలు లెక్కపెట్టి ప్రజాప్రస్థానంలో కొనసాగుతూనే ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాగైనా ఈసారి అధికారంలోకి రావాలని రాజకీయ ఎత్తుగడలు ఎన్నో వేస్తూ వస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలోనే రాజకీయంగా బలమైన ప్రత్యర్థిగా సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి నిలవడం మనం చూస్తున్నాం. ఒక సీఎం గానే కాదు రాజకీయాల్లో తనదైన ముద్రను వేసుకొని విభిన్న రంగాల్లో ఆయన మార్కును చూపిస్తూ వైఎస్ వారసుడి గానే ఆయన ప్రస్థానాన్ని కొనసాగించి ప్రజాసంకల్ప యాత్ర ద్వారా ప్రజలకు భరోసా అందించి పరిపాలనను కొనసాగిస్తున్న నేతగా ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రస్థానం మనం చూస్తున్నాం..
సార్వత్రిక ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఒకవైపు పార్లమెంటరీ ఎన్నికలు ఇంకోవైపు ఆంధ్ర రాష్ట్రంలో శాసనసభ్యుల ఎంపిక ఈ రెండు ఎన్నికలు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రసవత్తరమైన రాజకీయ పోరును రగిలిస్తున్నాయి. ఆ పార్టీలన్నీ జగన్మోహన్ రెడ్డి వైపే చూపిస్తున్నాయి. నోరులన్నీ సీఎం జగన్మోహన్ రెడ్డి పైనే అరుస్తున్నాయి. ఆరోపణలన్నీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పనుల మీదనే వస్తున్నాయి. తన సొంత చెల్లెలు వైయస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికైన దగ్గర నుంచి వ్యక్తిగత విషయాలను కూడా ప్రస్తావిస్తూ సొంత చెల్లిని నైనా నన్ను కూడా అనే పదాలను వాడుతూ ఆయన ఇమేజ్ ని డామేజ్ చేయడానికి కూడా వెనుకాడడం లేదు. అంటే రాజకీయం అనేది అన్నాచెల్లెల మధ్య కూడా చిచ్చు పెడుతుంది. అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా రాకమునుపు ఆయన ఎన్నో పాదయాత్రలు చేసి ప్రజలకు భరోసా అందించి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేసి, సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పరుచుకున్న సత్తా గల నేతగా చరిత్రపుటల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకమైన చోటును సంపాదించుకున్నాడు.
వైయస్ రాజశేఖర్ రెడ్డి దివంగత నేత వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఆయన పాదయాత్రని ఊపిరిగా మలుచుకుని పాదయాత్రల ద్వారా వైయస్సార్ మార్కును ఆయన లేకున్నా ఉన్న పరిపాలనను అందించే క్రమంలో ఎవ్వరికీ భయపడక బెదరక వెనకక తొనకక పాలన పగ్గాలు చేత పట్టుకుని ఆంధ్రప్రదేశ్ ను అన్ని రంగాల్లో అభివృద్ధి సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్నాడు. ఈ దశలోనే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి శక్తి చాలదనే జనసేన టిడిపి ఈ రెండు పార్టీలు వేరువేరుగా జగన్మోహన్ రెడ్డి పై అక్కసును వెళ్లబోసుకున్నయి.
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పై వచ్చిన ఆరోపణల దృశ్య జైలుకు వెళ్లి రావడం మనమందరం చూస్తున్నాం. అదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడుకి వెన్నుదన్నుగా నిలుస్తూ తన పార్టీని టిడిపి తో పొత్తు పెట్టుకుంటున్నాను అని వాగ్దానం కూడా చేసి ఇరు పార్టీలు కలిసి జగన్ వైపు గొంతెత్తి ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఒకప్పుడు ఇదే పవన్ కళ్యాణ్ నేనే ఆంధ్రప్రదేశ్ సీఎం గా అంటూ చేసిన వాగ్దానాన్ని తుంగలో తొక్కినట్టుగా ఇక్కడ కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితాన్ని చూసుకుంటే ఒక్కసారి కూడా ప్రజల మద్దతును కూడగొట్టుకున్న దాఖలాలు కనిపించడం లేదు. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసిన ఒక్క చోట కూడా కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో టిడిపిని అంటూ పెట్టుకుని జనసేన రాజకీయ భవిష్యత్తును బంగారు బాటగా మలుచుకోవాలని చూస్తున్న ఈ నేపథ్యంలోనే వీరిద్దరికి తోడు బిజెపి కూడా పొత్తు పెట్టుకుని మూడు పార్టీలు ఏకతాటిపై కి వచ్చి జగన్ వైపే వేళ్లు చూపిస్తున్నాయి..
విశాఖపట్నం జల అంతర్గామీలో దొరికిన డ్రగ్స్ కు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉంది అన్నట్టుగా రాజకీయాలు చేస్తున్న ప్రతిదీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే ఆపాదిస్తున్న వనక తొనకని గుండె ధైర్యంతో అన్నిటికి మించి మనోబలంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తన పూర్తి కాలాన్ని సద్వినియోగం చేసుకున్నాడు అని చెప్పక తప్పదు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడిగా కొనసాగుతూ టిడిపికి వంత పాడుతున్న అటు బిజెపితో ఒక్కోసారి పొత్తు పెట్టుకోవడం ఒక్కోసారి బయటికి రావడం ఇలా రాజకీయ అనుభవం లేని వారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సెలబ్రిటీ గానే మిగిలిపోయాడు తప్ప పవన్ కళ్యాణ్ రాజకీయ నాయకుడిగా గెలిచి నిరూపించలేదు. ఆయనను ఓ ఎమ్మెల్యే గాను ఓ ఎంపీగాను ఓ ముఖ్యమంత్రి గారు చూడాలనుకున్న ప్రజలు మరి పవన్ కళ్యాణ్ కు ఎందుకు ఓటు వేయలేదు ఆయన అభిమానులే సమాధానం చెప్పాలి.
ఇక టిడిపి అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పదెండ్లుగా ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రంలో అధికారం చెలాయించిన రాజధానిపై ఓ క్లారిటీ ఇచ్చిన ప్రజలు నమ్మక వైయస్ జగన్మోహన్ రెడ్డికి అధికార పీఠం కట్టబెట్టిన దగ్గర నుంచి మూడు రాష్ట్రాలను ఏర్పరిచిన సంగతి మనందరికీ తెలిసిందే.అలాంటి మూడు రాజధానుల సమస్యను రైతులకు ఆపాదించి రైతులను ఉసిగొలిపిన కార్పొరేట్ వ్యవస్థ కనుసనలు రైతు ధర్నాలు ఉద్యమాలు జరిగిన అది ఏమాత్రం జగన్ గెలుపును ఆపలేవని ఆయన అభిమానులు గంటపదంగా చెబుతున్నారు. ఇక సంక్షేమం అభివృద్ధి ఈ రెండు విషయాల ప్రస్తావిస్తే ఆంధ్ర రాష్ట్రంలో గత మూడు ప్రభుత్వాలు చేయని అభివృద్ధి సంక్షేమ ఉచిత పథకాలు ప్రజలకు అందడమే కాకుండా వారి జీవితాల్లో కొత్త వెలుగును ఆస్వాదిస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల విద్యా బోధనను ప్రవేశపెట్టి ఎన్ని ఆరోపణలు వచ్చినా ఎన్ని సవాళ్లు ప్రతి సవాళ్లు ఎదురైనా తాను అనుకున్నది అనుకున్నట్టుగా చేసే గుండె ధైర్యం ఉన్న మగధీరుడుగానే ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు బడుల రూపురేఖలను మార్చి దళిత బహుజన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల పిల్లలు ఆంగ్లంలో మాట్లాడడం చూసి ఈ ప్రపంచమే అవురా అనే విధంగా తన పరిపాలనలో ప్రభుత్వ బడులరూపురేఖలను మార్చేసి ఆంగ్ల బోధనా విద్యకు పునాది వేసింది వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తాను సాధించిన విజయం అని గర్వంగా చెప్పుకోవచ్చు.
ఇక బిజెపి పార్టీ ఎటు అణువైతే అటు పయనించే జాతీయ పార్టీగా పేరు సంపాదించుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒకప్పుడు జనసేన అని బిజెపితో పొత్తు పెట్టుకోవడం మళ్లీ ఆ పొత్తును విడదీసుకోవడం అదే పనిగా జరిగింది. అంతేకాదు టిడిపితో పొత్తు పెట్టుకున్న తర్వాత కూడా బిజెపితో మళ్ళీ అంట కాగి ఈ మూడు పార్టీలు కలిసి ఒక్క జగన్ ఓడించడానికి విష్ణు ప్రయత్నాలు చేస్తున్న రాజకీయ సమీకరణాలు జగన్ వైపే మోగ్గు చూపుతున్నాయి. ఇక తన చెల్లెలు వైయస్ షర్మిల తెలంగాణలో నేను ఆడ బిడ్డను నేను ఈ ఇంటి కోడలను అంటూ ముద్దు ముద్దుగా మాట్లాడిన మాటలు ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాష్ట్ర ఇన్చార్జిగా పదవి చేపట్టిన తర్వాత ఆ మాటలన్నీ ఏమైపోయాయో ఎవరికీ అర్థం కావడం లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా అధికారంలోకి తీసుకురావాలని ఆమె చేస్తున్న ఆరోపణలు వ్యక్తిగతంగా పరోక్షంగా రాజకీయంగా ఎన్ని అన్ని కావు... బాబాయ్ వివేకానంద రెడ్డి హత్యను కూడా జగన్ వైపు మళ్లిస్తూ వాళ్ళ పిల్లల్ని కూడా రాజకీయంగా జగన్ కి ఓటు వేయొద్దు అనే వాగ్దానాన్ని కూడా చేపిస్తూ ఆడపిల్లగా నన్ను సరిగ్గా జగనన్న చూసుకోలేదు అంటూ ఆరోపణలు చేసిన అక్కడి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆమెను ఒక పార్టీ అధినేత గానే చూస్తున్నారు తప్ప జగన్ చెల్లెలిగా ఎప్పుడూ అసహ్యించుకోవడం జరగడం లేదు. ఏది ఏమైనా ఒకవైపు మూడు పార్టీలు ఇంకోవైపు సొంత చెల్లెలు ఇలా నలుగురికి నాలుగు చేతులు జగన్ వైపు చూపిస్తున్న సింహం సింగిల్గానే వస్తుంది అన్న చందాన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమర శంకరాన్ని ఊదుతూ రాజకీయ సమరానికి సిద్ధం అంటూ సమర శంఖారాన్ని పూరిస్తున్నాడు.
ఇక మూడు పార్టీల కూటమి ఏకంగా యుద్ధానికి నాంది పలుకుతూ జగన్ పై విజయం సాధించడానికి మూడు పార్టీలు కలిసి వస్తున్న నేపథ్యంలో యుద్ధం అంటూ భీకర శబ్దాన్ని చేస్తూ రాజకీయంగా మార్పు తీసుకురావాలని ఒకవైపు పవన్ కళ్యాణ్ ఇంకోవైపు చంద్రబాబు నాయుడు తమ జీవిత రాజకీయ చతురతను చూపిస్తూ పవన్ కళ్యాణ్ ను నడిపిస్తున్నాడు. ఇంకోవైపు బిజెపి పొత్తు పెట్టుకున్న దగ్గరనుంచి మాకు ఎన్ని సీట్లు ఇస్తారు ఆంధ్రాలో అంటూ పేజీ పెట్టి మరి లాక్కున్న దాఖలాలను మనం గమనించొచ్చు. ఏది ఏమైనా నాలుగు పార్టీలు జగన్ ఓటమి వైపే చూపిస్తూ ఎన్ని ఆరోపణలు చేస్తున్న సింహం సింగిల్ గానే వస్తుంది అంటూ జగన్ సింగిల్గానే ఒక ముఖ్యమంత్రిగా తన రాజకీయ జీవితాన్ని కొనసాగించి మరొక్కసారి ప్రజల మద్దతును కోరుతూ సింగల్గానే వస్తున్నాడు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మళ్లీ ముఖ్యమంత్రిగా జగన్ ని కోరుకుంటారా లేదంటే బిజెపి టిడిపి టిడిపి జనసేన ఈ మూడు పార్టీలు కలిసి వస్తున్న నేపథ్యంలో వీరికి మద్దతును కల్పిస్తే దీంట్లో ముఖ్యమంత్రి ఎవరు మళ్లీ పోటీ తత్వం ఏర్పడే అవకాశం ఉంటుంది నేపథ్యంలో అటు కాంగ్రెస్కు అధికారాన్ని కట్టబెడతారా ఆంధ్రప్రదేశ్ ప్రజలే ఆలోచించి నిర్ణయించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కానీ ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలు సజావుగా సాగాలి అని అంటే ప్రభుత్వం స్తంభించిపోకుండా మరొకసారి మళ్ళీ సీఎం జగన్ కి అధికారాన్ని కట్టబెడతాం అనే సర్వేలు కోకోల్లలుగా సీఎం జగన్ వైపు విజయ సంకేతాన్ని చూపిస్తున్నాయి.
- కడారి శ్రీనివాస్
కాలమిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, కవి, గాయకులు
Post Comment