మహిళలు ఆర్ధికంగా స్వయం సమృద్ధి సాధించాలి
జయభేరి, అనకాపల్లి:
మహిళలు వారి కాళ్ల మీద వారు నిలబడే విధంగా స్వయం సమృద్ధి సాధించాలని అనకాపల్లి ఎంపీ డాక్టర్ సీ.ఎం రమేశ్ అన్నారు.శిక్షణ పొందిన 54 మంది మహిళలకు శనివారం అనకాపల్లిలో ఓఎన్జీసీ వారు సి ఎస్ ఆర్ నిధులతో కుట్టుమిషన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.

షేక్ నూర్ భాషా షరీఫ్ అబ్దుల్ కలాం ఎడ్యుకేషన్ సొసైటీ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఓఎన్జిసి ప్రతినిధులు చీఫ్ జనరల్ మేనేజర్ ఆర్ఎస్ రామారావు, డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్యాంనాథ్, కార్పొరేషన్ చైర్మన్లు పీల గోవింద సత్యనారాయణ, మల్ల సురేంద్ర, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్, టీడీపీ సీనియర్ నాయకులు దాడి రత్నాకర్, బిజెపి జిల్లా అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వర రావు, శ్రీరామ్ మూర్తి, పీవీఎస్ఎన్ రాజు, స్థానిక కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Views: 0


