పట్టభద్రుల MLC BRS అభ్యర్థిగా రాకేష్ రెడ్డి
జయభేరి, రాంనగర్, మే 3:
నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేష్ రెడ్డికి అవకాశం దక్కింది. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ శుక్రవారం ఆయన పేరును అధికారికంగా ప్రకటించారు. ఈ స్థానానికి వరంగల్ నుంచి రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కె.వాసుదేవారెడ్డి, కుడా మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్‌రాజ్ కూడా పోటీ చేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరిన రాకేష్‌రెడ్డికి బీఆర్‌ఎస్ నాయకత్వం అవకాశం కల్పించింది. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం వంగపహాడ్ గ్రామానికి చెందిన రాకేష్ రెడ్డి బిట్స్ పిలానీలో ఎంటెక్ పూర్తి చేశాడు. తర్వాత అమెరికాలో పనిచేశాడు. రాజకీయాలపై ఆసక్తితో 2013లో బీజేపీలో చేరారు. బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిగా, రాష్ట్ర ప్రతినిధిగా పనిచేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆ తర్వాత బీజేపీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు.
Post Comment