నకిలీ కరెన్సీ అంతర్జాతీయ ముఠా గుట్టు రట్టు!
పోలీసుల అదుపులో ఆరుగురు ?
గుంటూరు జిల్లా తాడేపల్లి ,సీతానగరం కి చెందిన ముఠా నకిలీ కరెన్సీ చెలామణి చేస్తుంది... ఈ ముఠా రూ. లక్ష అసలు నోట్లు ఇస్తే రూ. మూడు లక్షల విలువైన నకిలీ నోట్లు ఇస్తామని తెలంగాణలోని మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన వారితో ఒప్పందం చేసుకుంది... ఈ మేరకు శనివారం మిర్యాలగూడలో అసలు నోట్లు తీసుకుని కారులో విజయవాడ బయలుదేరిన వారిని తాడేపల్లి ముఠా వెంబడించింది...
విజయవాడ క్రైం:
నకలీ కరెన్సీ చెలామణి చేస్తున్న ముఠా వ్యవహారం రట్టయింది. ఈ ముఠాలోని ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది... విశ్వసనీయ సమాచారం మేరకు... గుంటూరు జిల్లా తాడేపల్లి ,సీతానగరం కి చెందిన ముఠా నకిలీ కరెన్సీ చెలామణి చేస్తుంది... ఈ ముఠా రూ. లక్ష అసలు నోట్లు ఇస్తే రూ. మూడు లక్షల విలువైన నకిలీ నోట్లు ఇస్తామని తెలంగాణలోని మిర్యాలగూడ ప్రాంతానికి చెందిన వారితో ఒప్పందం చేసుకుంది... ఈ మేరకు శనివారం మిర్యాలగూడలో అసలు నోట్లు తీసుకుని కారులో విజయవాడ బయలుదేరిన వారిని తాడేపల్లి ముఠా వెంబడించింది...
స్థానికుల నుంచి సమాచారం అందుకున్న భవానీపురం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించి నకిలీ పోలీసులు వదిలి వెళ్లిన కారును స్టేషన్ కు తరలించారు... ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేసిన పోలీసులు నకలీ కరెన్సీ వ్యవహారం గురించి తెలుసుకున్నారు. మిర్యాలగూడ వారు తప్పుడు సమాచారం ఇచ్చారని గుర్తించారు. మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది... వీరిలో గతంలో నకిలీ కరెన్సీ కేసులో అరెస్టు అయిన ఓ నిందితుడు కూడా ఉన్నట్లు సమాచారం... మరోవైపు ఈ కేసును నీరుగార్చేందుకు గతంలో విజయవాడ సీసీఎస్ లో పని చేసిన ఓ ఏఎస్ఐగా విశ్వప్రయత్నాలు చేసినట్లు సమాచారం... పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Post Comment