AP 10th Results Updates : ఏపీ టెన్త్ విద్యార్థులకు అలర్ట్...
మే మొదటి వారంలో ఫలితాలు!
ఏపీలో మార్చి 18న ప్రారంభమైన పదోతరగతి పరీక్షలు నేటితో ముగిశాయి. ఏప్రిల్ 1 నుంచి స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా.. మే మొదటి వారంలో ఫలితాలు వెలువడనున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో AP SSC 2024 పరీక్షలు ఈరోజు (మార్చి 30) ముగిశాయి. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో 10వ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనాన్ని వేగవంతం చేయాలని ఎస్‌ఎస్‌సీ బోర్డు (ఏపీ ఎస్‌ఎస్‌సీ బోర్డు) అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు మూల్యాంకనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది పది పరీక్షలకు 6,23,092 మంది రెగ్యులర్ అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకోగా... ఇందులో బాలురు 3,17,939 మంది, బాలికలు 3,05,153 మంది ఉన్నారు.
ఏప్రిల్ 1 నుంచి స్పాట్ వాల్యుయేషన్
పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్‌కు అధికారులు ఇప్పటికే కార్యాచరణ సిద్ధం చేశారు. ఏప్రిల్ 8 నాటికి స్పాట్ వాల్యుయేషన్ పూర్తి కానుంది.పదో స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభం కానుంది. కేవలం 8-9 రోజుల్లో వాల్యుయేషన్ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు షెడ్యూల్ కూడా సిద్ధమైంది. రాష్ట్రంలోని పలు జిల్లా కేంద్రాల్లో స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియను నిర్వహిస్తున్నారు. సిబ్బంది కొరత లేకుండా సీనియర్ ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇస్తూ మూల్యాంకనం చేపట్టాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
మే మొదటి వారంలో ఫలితాలు
ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ఏపీ ఎస్‌ఎస్‌సీ ఫలితాలు మరికొంత ముందుగానే విడుదలయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గతేడాది ఏప్రిల్ 18న పరీక్షలు ముగియగా... ఈసారి పరీక్షలు (ఏపీ 10వ తరగతి పరీక్షలు) మార్చి 18న ప్రారంభమై మార్చి 30న ముగియగా.. దీంతో గతంలో కంటే కాస్త ముందుగానే ఫలితాలు రానున్నాయి. గతేడాది మే 6న 10వ తరగతి ఫలితాలు విడుదల చేయగా, ఈసారి 10వ తరగతి ఫలితాలు మే మొదటి వారంలోనే విడుదల చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ దేవానందరెడ్డి ప్రకటించారు. అయితే ఫలితాలు ప్రకటించాలంటే ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాలని అన్నారు. ఈ ఏడాది 6.23 లక్షల మంది పదో తరగతి విద్యార్థులు రెగ్యులర్ గా పరీక్షలకు హాజరయ్యారని, 1.02 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ పరీక్షలకు హాజరయ్యారని పేర్కొన్నారు. దాదాపు 50 లక్షల జవాబు పత్రాలకు స్పాట్ వాల్యుయేషన్ ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 8వ తేదీన మూల్యాంకనం (ఎస్‌ఎస్‌సి స్పాట్ వాల్యుయేషన్) పూర్తి చేయాలని ఆదేశించారు. స్పాట్ వాల్యుయేషన్ ప్రక్రియ కోసం 25 వేల మంది సిబ్బందికి విధులు కేటాయించామని స్పష్టం చేశారు.
AP SSC ఫలితాలు 2024 ఇలా తనిఖీ చేయవచ్చు
విద్యార్థులు AP SSC బోర్డ్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి https://www.bse.ap.gov.in/
హోమ్ పేజీలో AP SSC ఫలితాలు 2024 లింక్‌పై క్లిక్ చేయండి
మీ హాల్ టికెట్ నంబర్ మరియు ఇతర వివరాలను నమోదు చేయండి
ఆ తర్వాత, విద్యార్థి పరీక్ష ఫలితాలు స్క్రీన్‌పై ప్రదర్శించబడతాయి
పదవ ఫలితాలను డౌన్‌లోడ్ చేయండి మరియు భవిష్యత్తు అవసరాల కోసం సేవ్ చేయండి
Post Comment