TDP BJP I టిడిపి.. బిజెపి.. జనసేన పొత్తు..? గెలుపు దక్కేన!?

ఆంధ్ర రాజకీయాల్లో తాజాగా బిజెపి టిడిపి జనసేన ఆలయన్స్ మొత్తానికి జత కలిసింది. ఈ నేపథ్యంలో సర్వేలు వేయించుకుతున్నాయి!? తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలకు కాంగ్రెస్ కు ఎన్ని!? బీఆర్ఎస్ కు ఎన్ని? బిజెపికి ఎన్ని!?

TDP BJP I టిడిపి.. బిజెపి.. జనసేన పొత్తు..? గెలుపు దక్కేన!?

జయభేరి, హైదరాబాద్ :
ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పొత్తులు రసవత్తరంగా జతకడుతున్న యి. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు శాశ్వత మిత్రులు ఉండరనే ఉదాహరణకి సాక్షిభూతంగా నిలుస్తోంది. ఆంధ్ర రాజకీయాల్లో తాజాగా బిజెపి టిడిపి జనసేన ఆలయన్స్ మొత్తానికి జత కలిసింది. ఈ నేపథ్యంలో సర్వేలు వేయించుకుతున్నాయి!? తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలకు కాంగ్రెస్ కు ఎన్ని!? బీఆర్ఎస్ కు ఎన్ని? బిజెపికి ఎన్ని!? అనే ఊహగానాలకు తాజాగా ది టైమ్స్ ఈ. టి. జి అనే సంస్థ చేసిన రాజకీయ సర్వేలో ఏ విషయాలు వెళ్లడయ్యాయి అనే విషయంపై సమగ్రంగా రాజకీయ విశ్లేషణను అందిస్తుంది 'జయభేరి' కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్ సమగ్ర రాజకీయ విశ్లేషణ...

తెలంగాణ రాష్ట్రంలో 17 పార్లమెంటు స్థానాలకు గాని ఆయా పార్టీల అధినేతలు అభ్యర్థులను ఎంపిక చేసే విషయంలో జాగ్రత్త పడుతూ పార్లమెంట్ స్థానాలను ఎక్కువగా దక్కించుకోవాలని తహతహలాడుతోంది. నేపథ్యంలో 10 సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ త్రిముఖ వ్యూహంతో పోటీపడుతుంది. ఇక బిజెపి గెలుపు ను అందుకునే లోపే గోర్ల బొక్కల పడి శాసనసభ ఎన్నికల్లో కనీసం గౌరవాన్ని కాపాడుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో 17 పార్లమెంటు స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 15 నుంచి ఎక్కువ స్థానాలను గెలుచుకుంటుంది అని టైమ్స్ ఈటిజి అనే పొలిటికల్ సర్వే తేల్చేసింది.

Read More గాయత్రీ మహా క్షేత్రంలో ఘనంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు

ఇక బీఅర్ఎస్ పార్టీ పార్లమెంటు స్థానాలను అందుకునే తుది అంకంలో మూడు స్థానాలకు మించి పార్లమెంటు సీట్లను దక్కించుకునే వీలులేదని కుండ బద్దలు కొట్టింది. ఇక బిజెపి ఒకటి రెండు స్థానాలకే పరిమితం అయింది. వాస్తవానికి ది టైమ్స్ ఈ టీజీ అనే రాజకీయ సర్వే నిర్వహించిన పద్ధతిని చూస్తే ఓటర్ల నాటిని పసిగట్టి ప్రభుత్వ విధి విధానాలను తెలుసుకొని ప్రజల ఆలోచన అక్షర రూపం దాల్చి వాటి నుండి ఎక్కువ ప్రజలు ఏ పార్టీకి అధికారాన్ని పార్లమెంట్ లో తమ అభ్యర్థిగా ఎన్నుకుంటారనే విషయంపై చాలా పరిశోధనలు చేసి ఈ సర్వే వివరాలను బట్ట బయలు చేసింది.

Read More విద్యార్థులు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దు

నిజానికి 10 సంవత్సరాల కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పూర్తిగా అన్ని శాఖలు విధ్వంసం జరిగి ప్రజల నుంచి పూర్తిగా విముఖత చూపబడి చీదరించుకునేలా ఆ పార్టీ తన బొందను తానే తీసుకుంది. ఈ నేపథ్యంలో శాసనసభకు పంపాలా వద్ద అనే విషయంపై ఇప్పటికే తెలంగాణ ప్రజలు కేసీఆర్ ప్రభుత్వానికి అర్థమయ్యే రీతిగా ప్రతిపక్షంలో కూర్చోబెట్టింది. కానీ ప్రతిపక్షంలో ఉన్న కేసీఆర్ తన అనుచర సభ్యులు శాసనసభలో బీఆర్ఎస్ నుంచి ఎన్నికైన శాసనసభ్యులు వచ్చి ప్రమాణ స్వీకారం చేశారే కానీ కెసిఆర్ కాలుకు దెబ్బ తాకిందని నెపంతో శాసనసభలో ప్రమాణ స్వీకారానికి వాయిదాలు వేస్తూ చివరగా ప్రమాణ స్వీకారం చేశాడు కానీ విచారణ జరిగే దశలో శాసనసభకు కేసిఆర్ హాజరు కాలేదు. ప్రాజెక్టుల అవినీతి విషయంలో పలు ప్రశ్నలు లేవనెత్తిన కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన ప్రశ్నలకు గత ప్రభుత్వంలోని పెద్దలు సమాధానాలు ఇవ్వలేక పాత పెంటను తవ్వే ప్రయత్నాన్ని చేశారు. దీన్ని తెలంగాణ ప్రజలు గమనిస్తూ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో కేసీఆర్కు మరింత గట్టిగా బుద్ధి చెప్పాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం.

Read More రేవంత్ రెడ్డి కి ఓటు వేసి తప్పు చేశాం అంటున్న ప్రజలు....

ఇక బిజెపి పార్టీ ప్రమాణ స్వీకారానికి నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు కొట్టడంతో వారి ప్రమాణస్వీకారం కూడా వాయిదా పడుతూ వచ్చింది. ఎందుకంటే శాసన సభాపతిగా మైనారిటీ ముస్లిం అభ్యర్థిని కాంగ్రెస్ ప్రభుత్వం నియమించడం వలన బిజెపి పార్టీ తనతో ప్రమాణ స్వీకారం చేయించుకునే ఇష్టం లేక శాసనసభకు రాకుండా ప్రమాణస్వీకారం చేయకుండా శాసనసభ నియమావళిని దాటవేశారు. బిజెపి ఏకపక్షం నిర్ణయాలు తెలంగాణ ప్రజల్లో కొత్త ఆలోచనను ఆలోచింపజేసింది. ఎందుకంటే ఇప్పటికే బీజేపీ మత తత్వ పార్టీ అని ప్రజలు నమ్ముతున్న ఆ నమ్మకాన్ని నిజం చేసే తీరుగా శాసనసభలో ముస్లిం సభాపతి ఉండడంతో ప్రమాణ స్వీకారానికి రాలేకపోయినా ఆ నేతలను చూసి ప్రజాస్వామ్యాన్ని లెక్కచేయకుండా బీజేపీ నేతల తీరును తప్పు పట్టింది తెలంగాణ  ప్రజానీకం. ఇక్కడే ఏ పార్టీకి ఎక్కువ ఎంపీ స్థానాలను అందివ్వాలని ఆలోచనలతో చదువుకున్న యువత నిరుద్యోగ యువత ఆయా కుటుంబాల్లోని చదువు రాని వారు సైతం ఇప్పటికే ఒక అంచనాకు వచ్చి తిరిగి కాంగ్రెస్ పార్టీకే పార్లమెంటు స్థానాలు 15 కంటే ఎక్కువ ఎంపి స్థానాలను కట్టబెట్టాలని నిర్ణయించుకున్నట్టు పలు సర్వేలు చెబుతున్నాయి.

Read More అంబరాని అంటిన బతుకమ్మ సంబరాలు

తెలంగాణ రాజకీయాలు ఇలా ఉంటే ఆంధ్ర రాజకీయాలు ఒక్క జగన్ ఓడించడానికి మూడు పార్టీలు అలయన్స్ గా ఏర్పడి అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. ఒకవైపు జగన్ అనేక సంక్షేమ పథకాలతో ముందుకు పోతూ ప్రజలకు దగ్గరగా అవుతూ ఒంటరిగానే యుద్ధానికి సిద్ధం అంటూ కథన రంగంలో కాలు దువ్వుతుంటే.. ఇంకోవైపు మొన్నటి వరకు టిడిపి జనసేన పొత్తు కుదిరి సీట్ల కోసం తర్జనభజన అవుతున్న సమయంలోనే బిజెపి కూడా నేను ఉన్న అంటూ సంకలో పిల్లి మాదిరిగా బిజెపి టిడిపి జనసేన మూడు పార్టీలు జగన్ ఓడించడానికి కంకణం కట్టుకున్నాయి. మూడు పార్టీలు ఏకమైన సరే జగన్ ఓడించలేవు అని ది సిటీ టైమ్స్ ఈ టి సి అనే పొలిటికల్ సర్వే తేల్చి పడేసింది. 25 ఆంధ్ర ఎంపీ స్థానాలకు గాను 20 నుంచి 23 స్థానాల వరకు వైఎస్సార్ సీపీకే దక్కుతాయని పటా పంచలు చేసింది. నిజానికి ఒక్కరిని ఓడించడానికి మూడు పార్టీలు కలిసి పోరాటం చేస్తున్నాయంటే అధికారం కోసం శత్రువునైనా మిత్రునిగా చేసుకునే టిడిపి పార్టీ ఈ ఎన్నికల్లో వెనక ఓడిపోతే ఇక రాజకీయ చదరంగంలో పుట్టగతులు ఉండవని బలంగా నమ్ముతుంది. మొత్తానికి ది సిటీ టైమ్స్ ఈటిజి అనే పొలిటికల్ సర్వే ప్రకారం గా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకే తిరిగి పార్లమెంటు ఎన్నికల్లో పట్టం కడతారని అదే ఆంధ్రాలో జగన్ కి మళ్ళీ ప్రజలు అధికారం అప్పజెప్పుతారని అంచనాలు మెండుగా ఉన్నాయని ఈ సర్వే పూర్తి వివరాలను సమగ్రంగా అందించింది.

Read More చింతపల్లి మండల కేంద్రంలో ఏసీబీ దాడులు

మొత్తానికి పార్లమెంటు ఎన్నికల పుణ్యమా అని ఒక్కొక్క పార్టీ అసలు స్వరూపం బయటపడుతూ అలయన్స్ లా బేరసారాలు కుదరడంతో మొత్తానికి జగన్ ప్రభుత్వాన్ని కులదయడానికి కౌరవుల సేన కదిలి వచ్చే తరుణం ఏర్పడింది. బిజెపి పార్టీ అందితే జుట్టు అందకపోతే కాళ్లు అన్నట్టుగానే పొత్తులకు సంధి ఏర్పరచుకొని తన రాజకీయ చతురతను చూపిస్తుంది. మతతత్వ పార్టీగా బిజెపి ముద్రపడ్డ దాన్ని నిజం చేసుకునే విధంగా దాని రాజకీయ పోకడ రోజురోజుకు యువతలో విముఖత చూపించే విధంగా ప్రజాభిప్రాయాన్ని సేకరించిన సర్వే ఆయా పార్టీల అంచనాలను తారుమారు చేస్తూ వివరాలను వెల్లడించడంతో భవిష్యత్తులో వీరు రాష్ట్రాల్లో జరగబోయే ఎన్నికలు ఒకసారిరాత్మకమైన తీర్పును అందిపిచ్చుకునే అవకాశం లేకపోలేదు. ఏది ఏమైనా ప్రజాభిప్రాయం నేరకే జరుగుతోంది. సర్వేలు ఎన్ని చెప్పినా అది అంచనాలు మాత్రమే. కానీ ఆ అంచనాలను పసిగట్టి చెప్పిన సర్వేలు కొన్ని కొన్ని నిజమవుతాయి కూడా.. అలాంటి సర్వేలో ది సిటీ టైమ్స్ ఈటిజి అనే పొలిటికల్ సర్వే నిర్వహించిన సర్వే నిజమవుతుందా లేదంటే అంచనాలు తారుమారవుతాయా వేచి చూడాల్సిందే...

Read More ఏపీలో స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ఒక రోజు ముందుగానే...

...కడారి శ్రీనివాస్ 
కాలమిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, కవి, రచయిత

Read More మహిళలని గౌరవించే సంస్కృతి బీఅరెస్ పార్టి నాయకులకు లేదు...