Telangana : బై బై హైదరాబాద్!

‘ఉమ్మడి రాజధాని’కి సంపూర్ణ సెలవు... హైదరాబాద్‌లోని భవనాలన్నీ అప్పగింత

హైదరాబాద్‌ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుందని, ఈలోపు ఏపీ కొత్త రాజధాని ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నారు. అయితే... సొంత గడ్డపైనే పాలన సాగించాలనే ఉద్దేశంతో చంద్రబాబు సర్కారు 2017లోనే ప్రభుత్వ కార్యాలయాలను నవ్యాంధ్రకు తరలించింది. ఆ తర్వాత ‘అమరావతి’ని నవ్యాంధ్ర రాజధానిగా ప్రకటించింది.

Telangana : బై బై హైదరాబాద్!

జయభేరి, అమరావతి :
రాష్ట్ర విభజన చట్టంలో విషయమిది! ఆదివారంతో పదేళ్ల కాలం పూర్తవుతోంది. హైదరాబాద్‌తోపాటు తెలంగాణతో నవ్యాంధ్రప్రదేశ్‌కు ఉన్న రుణానుబంధం ‘సాంకేతికంగా, చట్టపరంగా’ పూర్తిగా తెగిపోతోంది.

హైదరాబాద్‌ పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుందని, ఈలోపు ఏపీ కొత్త రాజధాని ఏర్పాటు చేయాలని రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్నారు. అయితే... సొంత గడ్డపైనే పాలన సాగించాలనే ఉద్దేశంతో చంద్రబాబు సర్కారు 2017లోనే ప్రభుత్వ కార్యాలయాలను నవ్యాంధ్రకు తరలించింది. ఆ తర్వాత ‘అమరావతి’ని నవ్యాంధ్ర రాజధానిగా ప్రకటించింది.

Read More పేరుకే ప్రభుత్వ అస్పత్రి.. పైన పటారం లోన లొటారం

సమాచారం వెలువడింది. అయితే... హైదరాబాద్‌తో సంబంధం మాత్రం తెంచుకోలేదు. విభజన చట్టంలోని 8, 9వ షెడ్యూల్‌లో పొందుపరిచిన సంస్థలకు సంబంధించిన స్థిర, చరాస్తుల్లో వాటాల పంపకం పూర్తిచేయడంపై దృష్టిసారించారు. సంస్థ కేంద్రం నియమించిన షీలాబిడే కమిటీ నివేదిక కూడా ఇచ్చింది. కానీ... అప్పటి కేసీఆర్ ప్రభుత్వం ఈ కమిటీనే గుర్తించలేదు. ఉమ్మడి సంస్థల విభజనకు ఆయన సహకరించలేదు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సచివాలయంతోపాటు ఇతర కార్యాలయాల్లో ఏపీకి కేటాయించిన భవనాలు తెలంగాణకు అప్పగించే విషయం కూడా పెండింగ్‌లో పడింది.

Read More ఘనంగా మదర్ తెరిసా 114 జయంతి వేడుకలు

మీకు అక్కర్లేని భవనాలను తెలంగాణకు అప్పగించవచ్చు కదా’ అని అప్పటి గవర్నర్ నరసింహన్ సూచించినా... విభజన అంశాలన్నీ పరిష్కారమయ్యే వరకు వాటిని అప్పగించలేమని అప్పటి టీడీపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక అమరావతిని అటకెక్కించారు. మూడు రాజధానుల లెక్క తెచ్చారు. పోనీ... విభజన సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టారా... అంటే అదీ లేదు. కేసీఆర్‌తో సహితం, ఆయనతో ఉన్న అవసరాలకే పెద్దపీట వేశారు. హైదరాబాద్‌లో ఏపీ ఆధీనంలో ఉన్న భవనాలను తెలంగాణకు అప్పగించారు. లేక్‌ వ్యూ గెస్ట్‌ హౌస్‌, అసెంబ్లీ ఎదురుగా ఉండే హెర్మిటేజ్‌ బిల్డింగ్‌ మాత్రమే ఉంచుకున్నారు. ఈ ఐదేళ్లలోఒక్కసారి కూడా తెలంగాణ ప్రభుత్వంతో విభజనకు సంబంధించిన విషయాలను చర్చించలేదు.

Read More పండగ వేళ దుర్గమ్మే ఇంటికి వచ్చిందని...

ఆదివారంతో రాష్ట్ర విభజనకు పదేళ్లు పూర్తవుతున్నాయి. చట్టం ప్రకారం హైదరాబాద్‌తో, తెలంగాణతో బంధం పూర్తిగా తెగిపోతుంది. కానీ, విభజన చట్టంలోని షెడ్యూల్‌ 9, షెడ్యూల్‌ 10లో ఉన్న రూ.వేల కోట్ల విలువైన ఆస్తుల పంపకాలు ఇంకా జరగలేదు. ఐదేళ్లు ఈ విషయాలను విస్మరించిన జగన్‌ సర్కారు చివరాఖరులో తూతూమంత్రం సమీక్ష నిర్వహించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి ఇటీవల విభజన సమావేశం జరిగింది. అందులో ఏం తేల్చారంటే..

Read More ఏపీలో ఎన్నికలను తలపిస్తున్న మద్యం లాటరీ కేంద్రాలు

హైదరాబాద్‌లో ఏపీ ప్రభుత్వానికి చెందిన ఆయా శాఖల పరిధిలో ఉన్న భవనాలను తెలంగాణ ప్రభుత్వానికి అప్పజెప్పేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. వీటిలో 5 మంత్రుల క్వార్టర్లు, 14 ఎమ్మెల్యే క్వార్టర్లు ఉన్నాయి. లేక్‌వ్యూ అతిథి గృహం, సీఐడీ హెడ్‌క్వార్టర్స్‌, హెర్మిటేజ్ భవనాలు ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. వీటిని జూన్ 2 తర్వాత కూడా తమ అధీనంలోనే ఉంచుకుంటామని ఏపీ ప్రభుత్వం.. తెలంగాణ ప్రభుత్వానికి విడుదల చేసింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఇంకా స్పందన రాలేదు.

Read More పరవాడలో ఘనంగా కార్తీకమాస అన్న సమారాధన కార్యక్రమం

రాష్ట్రంలో వ్యవసాయ యూనివర్సిటీ ఏర్పాటు గురించి రాష్ట్ర వ్యవసాయ శాఖ కేంద్రంతో సంప్రదింపులు చేయాలి. అలాగే, షెడ్యూల్‌-8లో ఉన్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల అమలు దిశగా సంబంధిత శాఖలు కేంద్రంతో నిత్యం సంప్రదింపులు జరుపుతున్నాయని జవహర్‌రెడ్డి చెప్పారు. ఈ జాబితాలో వైజాగ్‌-చెన్నై పారిశ్రామిక కారిడార్‌, విశాఖ, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల ప్రమాణాలను అంతర్జాతీయ స్థాయికి పెంచడం, అమరావతి ర్యాపిడ్‌ రైలు, రోడ్డు కనెక్టివిటీ విస్తరణ, కొత్త రైల్వేజోన్‌ ఏర్పాటు ఉన్నాయి. వీటికి సంబంధించిన శాఖలు తరచూ కేంద్రంతో సంప్రదింపులు జరపాలని సీఎస్‌ సూచించారు.

Read More చంద్రబాబుకు "సొంత" కుంపటి

విభజన చట్టంలోని సెక్షన్‌ 95 ప్రకారం.. తెలంగాణలోని ప్రముఖ ఉన్నత విద్యాసంస్థల్లో విద్యార్థులకు దక్కాల్సిన కోటాను కల్పించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. గతంలో అవకాశం కోల్పోయిన వారికి న్యాయం చేసేలా సంబంధిత శాఖలు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ పదేళ్లలో తెలంగాణ నుంచి ఏపీకి వలస వచ్చిన వారికి సంబంధించి ఎన్ని దరఖాస్తులు ఉన్నాయి, వాటిలో ఎన్ని ఆమోదించారు, ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయన్న విషయాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి తెలియజేయాలని, దీనికి అనుగుణంగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్‌ను సవరించాలి.

Read More 7న మద్యం షాపుల బంద్

ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లేందుకు దరఖాస్తు చేసుకున్న 1,942 మంది ఉద్యోగులు, తెలంగాణ నుంచి ఏపీకి వచ్చేందుకు దరఖాస్తు చేసుకున్న 1,44 మంది ఉద్యోగుల బదిలీ ప్రక్రియను పూర్తిచేయాలని నిర్ణయించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని సంప్రదించగా, ఎన్నికల కోడ్ ముగిశాఖ నిర్ణయం తీసుకుంటామని అధికారులు.

Read More అంతుచిక్కని రోజా వ్యూహం....

విశాఖలో గ్రేహౌండ్స్ ట్రైనింగ్ సెంటర్‌కు సంబంధించిన ప్రతిపాదనను కేంద్రానికి పంపామని, నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. ఈ నిర్మాణ ప్రాజెక్టు అంచనా రూ.294 కోట్లని అంచనా. భూమి విలువ రూ.358 కోట్లుగా ఉంది. మార్చి 31, 2023 నాటికి తెలంగాణ డిస్కమ్స్‌ నుంచి ఏపీ జెన్‌కోకి రూ.7,101 కోట్లు రావాలి. తెలంగాణ డిస్కమ్స్‌లో సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ దాఖలు చేశాయి. తక్షణమే ఈ ఎస్‌ఎల్‌పీని విత్‌డ్రా చేయించి, బకాయిలు వసూలు చేయాలని ఎస్‌ఎస్‌ నిర్ణయించారు.

Read More ఫార్మా సిటీ ప్రమాదం

షెడ్యూల్‌ 9లో ఉన్న 89 సంస్థలు, షెడ్యూల్‌ 10లో ఉన్న 142 సంస్థల విభజన ఇంకా పూర్తికాలేదు. షెడ్యూల్‌ 9లోని సంస్థల విభజన గురించి షీలాబిడే కమిటీ నివేదిక ఇచ్చింది. దీనిప్రకారం ముందుకెళ్లాలని ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చినా తెలంగాణ ప్రభుత్వం స్పందించలేదు. దీనిపై సమావేశంలో అఽధికారులు చర్చించలేదు.

Read More ఏపీలో విచిత్రమైన ఘటన జరిగింది. రైలు పేరొకటి.. కానీ వెళ్లే రూటు మరొకటి.

‘జువెనల్‌’ భవనం తెలంగాణకు అప్పగింత
రాష్ట్ర విభజనలో భాగంగా హైదరాబాద్‌లోని సైదాబాద్‌లో ఉన్న జువెనల్‌ వెల్ఫేర్‌, కరెక్షనల్‌ సర్వీసెస్‌ కార్యాలయంలో ఏపీకి కేటాయించిన భవనాన్ని తెలంగాణకు అప్పగించారు. ఏపీ జువెనల్‌ శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ మధుసూదన్‌రావుతో కూడిన బృందం శుక్రవారం సైదాబాద్‌లోని ప్రధాన కార్యాలయానికి చేరుకుని భవనం తాళాలను తెలంగాణ అధికారులకు అందజేశారు. ఏపీ అధికారుల బృందాన్ని తెలంగాణ జువెనల్‌ శాఖ డీడీ డాక్టర్‌ బేగ్‌ సత్కరించారు.

Social Links

Related Posts

Post Comment