Sharmila : ప్రాజెక్ట్ ల పట్టింపులేదు… ఒక్క పరిశ్రమ రాలేదు.. షర్మిల

  •  2019 ఎన్నికలో బాబు కట్టలేదని జగన్ ఎద్దేవా చేశాడు.  అధికారంలో వస్తె ప్రాజెక్ట్ పూర్తి చేసి 127 చెరువులకు నీళ్ళు ఇస్తా అన్నారు.  లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామన్నారు.  అధికారంలో వచ్చాక ప్రాజెక్ట్ పట్టింపు లేదు.  ఇండస్ట్రియల్ కారిడార్ అన్నాడు.  ఒక్క పరిశ్రమ రాలేదు.

Sharmila : ప్రాజెక్ట్ ల పట్టింపులేదు… ఒక్క పరిశ్రమ రాలేదు.. షర్మిల

మడకశిర నియోజక వర్గంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా సభలో ఏపీసీసీ  చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి మాట్లాడారు. హంద్రీనీవా ప్రాజెక్టు  వైఎస్ఆర్ హయంలో 90 శాతం పూర్తి.  2019 ఎన్నికలో బాబు కట్టలేదని జగన్ ఎద్దేవా చేశాడు.  అధికారంలో వస్తె ప్రాజెక్ట్ పూర్తి చేసి 127 చెరువులకు నీళ్ళు ఇస్తా అన్నారు.  లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామన్నారు.  అధికారంలో వచ్చాక ప్రాజెక్ట్ పట్టింపు లేదు.  ఇండస్ట్రియల్ కారిడార్ అన్నాడు.  ఒక్క పరిశ్రమ రాలేదు.  రఘువీరా హయాంలో భూ సేకరణ జరిగింది.  భూములు ఉన్నా పరిశ్రమలు రాలేదని అన్నారు.  లేదర్ పార్క్ అన్నాడు.. మరిచారు.  మడక శిర నియోజక వర్గం చుట్టూ రింగ్ రోడ్ అన్నారు... మరిచారు.

గత 10 ఏళ్లుగా ఈ నియోజక వర్గాన్ని టీడీపీ, వైకాపా  మోసం చేసింది.  ప్రత్యేక హోదా మన రాష్ట్రానికి సంజీవని. వేల సంఖ్యలో పరిశ్రమలు వచ్చేవి హోదా వచ్చి ఉంటే... హోదా విషయంలో బీజేపీ మోసం చేసింది.  అయినా బీజేపీ తో బాబు, జగన్ పోటీలు పడి పొత్తులు పెట్టుకుంటున్నారని అన్నారు. బాబు పొత్తు.. జగన్ తొత్తు.  పొత్తులు, తొత్తులకు ఓట్ వేయడం అవసరమా ? బీజేపీ కి గులాం గిరీ చేస్తున్నారు.  బీజేపీ కి బానిసలు గా మారారు.  రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టారు. ఒక్క సీటు లేని బీజేపీ రాష్ట్రంలో రాజ్యం యేలుతుంది. బాబు కి ఓటు వేసినా బీజేపీ కి వేసినట్లే. జగన్ కి ఓటు వేసినా బీజేపీ ఓటు వేసినట్లే. ఈ రాష్ట్రాని.. రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టిన బీజేపీ, బాబు, జగన్ లు అవసరమా అని ప్రశ్నించారు.

Read More కడప జిల్లా ఎర్ర చందనం స్మగ్లర్ల అడ్డా...

హోదా ఇవ్వని, మోసం చేసిన ఈ పార్టీలు మనకు అవసరమా ? హోదా ఇచ్చేది కాంగ్రెస్ మాత్రమే. హోదా 10 ఇస్తామని ఏఐసిసి మ్యానిఫెస్టోలో పెట్టింది. రాష్ట్రంలో అధికారంలో వస్తె మొదటి సంతకం భారీగా ఉద్యోగాల కల్పన మీదే.  2.25 లక్షల ఉద్యోగాల భర్తీ మీదనే తొలి సంతకం. ప్రతి మహిళ పేరు మీద 5 లక్షలతో పక్కా ఇండ్లు కట్టిస్తం.  ఏడాదికి పెద్ద మహిళకు లక్ష రూపాయల ఆర్థిక సహాయం. వృద్దులకు 4 వేలు... వికలాంగులకు 6 వేలు పెన్షన్.  గత 10 ఏళ్లు బాబు, జగన్ పాలన చూశారు. కాంగ్రెస్ కి అవకాశం ఇవ్వండి. వైఎస్సార్ పాలన మళ్ళీ తీసుకు వద్దాం. మీరు పిలిస్తే పలికే వాళ్లకు ఓటు వేయాలి. ఎన్నికలు ఉన్నాయని జగన్ సిద్ధం అంటూ బయటకు వస్తున్నారు. పెద్ద పెద్ద కోటలు కట్టుకొని ఉంటున్నారు . ప్రజల సమస్యలు ఏనాడైనా విన్నారా ? వైఎస్ఆర్ హయాంలో ప్రజా దర్బార్ ఉండేది.  వారసుడు పాలనలో ఎక్కడ పోయింది దర్బార్ ? మడకశిర ఎంఎల్ఏ గా సుధాకర్ ను గెలిపించాలని,ఎంపీ గా సమద్ షాహిన్ ను గెలిపించాలని కోరుతున్నానని అన్నారు.

Read More ప్లాస్టిక్ వాడకాన్ని నిషేదించండి పర్యావరణాన్ని కాపాడండి 

Social Links

Related Posts

Post Comment