BJP : బీజేపీ పెద్దన్న పాత్ర పోషించాలి
పశ్చిమ విజయం కోసం అందరూ కలిసి పని చేయాలి
- బూత్ కమిటీ కార్యకర్తలకు సుజనా దిశా నిర్దేశం
బీజేపీ కార్యర్తలు పెద్దన్న ప్రాత పోషించాల్సిన అవసరం ఉందని పార్టీ కార్యకర్తలకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థి సుజనా చౌదరి దిశా నిర్దేశం చేశారు. భవానీపురం బీజేపీ కార్యాలయంలో జరిగిన బూత్ కమిటీ కార్యకర్తలను ఉద్దేశించి సుజనా మాట్లాడారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూ జనసేన, టీడీపీ కార్యర్తలను కలుపుకుపోతూ... పనిచేయాలని సూచించారు. పార్టీ పరంగా ఎవరికి ఏం చేయాలో తాను చూసుకుంటానని భరోసా ఇచ్చారు. కమలం-సైకిల్ కాంబినేషన్ ను నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేయాలని, అందరూ కలిసిమెలిసి పనిచేయాలని హితబోధ చేశారు. మహిళల సంక్షేమం మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల గురించి ప్రతి ఒక్కరికీ తెలియజేయాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి శివప్రకాష్ సింగ్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు శ్రీరామ్, బీజేపీ సీనియర్ నేత శేఖర్ జీ, బీజేపీ నేతలు సోమినాయుడు, యామిని, టీడీపీ నేతలు ఎమ్మెస్ బేగ్, జనసేన నాయకురాలు రజనీ తదితరులు పాల్గొన్నారు.
Post Comment