EC : ఎన్నికల ముందు జగన్‌కు వరుస షాక్‌లు.. ఈసీ కీలక ఆదేశాలు..

  • ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు వెంటనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సజ్జల భార్గవరెడ్డి కుట్రతో తప్పుడు ప్రచారం చేశారని, హింసను ప్రేరేపించారని టీడీపీ నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు.

EC : ఎన్నికల ముందు జగన్‌కు వరుస షాక్‌లు.. ఈసీ కీలక ఆదేశాలు..

జయభేరి, అమరావతి, మే 05:
సజ్జల రామకృష్ణా రెడ్డి తనయుడు సజ్జల భార్గవ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం గట్టి షాక్ ఇచ్చింది. అతనిపై సీఐడీ విచారణకు ఆదేశించింది. సోషల్ మీడియాలో చంద్రబాబు నాయుడుపై వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని తెలుగుదేశం పార్టీ నాయకులు భారత ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన ఎన్నికల సంఘం సజ్జల భార్గవరెడ్డిపై సీఐడీ విచారణకు ఆదేశించింది.

ఎన్నికల కోడ్ పేరు. అయితే ఈ పింఛన్ల పంపిణీ ఆగిపోవడానికి చంద్రబాబు నాయుడే కారణమంటూ ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోంది. వైసీపీ సోషల్ మీడియా ఇన్‌చార్జి సజ్జల భార్గవ రెడ్డి ఐవీఆర్‌ఎస్ కాల్స్ ద్వారా ఓటర్లను, పింఛన్ లబ్ధిదారులను తప్పుదోవ పట్టించేందుకు ప్రచారం చేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు వెంటనే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సజ్జల భార్గవరెడ్డి కుట్రతో తప్పుడు ప్రచారం చేశారని, హింసను ప్రేరేపించారని టీడీపీ నేత వర్ల రామయ్య ఫిర్యాదు చేశారు. వర్ల రామయ్య ఫిర్యాదు మేరకు వైసీపీ ఐవీఆర్‌ఎస్‌ కాల్స్‌పై సీఐడీ విచారణ జరిపించాలని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. దీనిపై విచారణ జరిపి వెంటనే నివేదిక సమర్పించాలని సీఐడీ డీజీని ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈసీ ఆదేశాలపై టీడీపీ నేతలు హర్షం వ్యక్తం చేశారు.

Read More Jagan : జగన్ బేల మాటలు!

Views: 0

Related Posts