MGM : ఎంజీఎంలో పనిచేయని ఫ్రీజర్లు...

  • ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు పొరుగు జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన వారికి ఇక్కడి మార్చురీలోనే శవపరీక్షలు చేస్తారు. ప్రతిరోజూ ఎంజీఎం ఆసు పత్రికి 6 నుంచి 10 వరకు మృతదేహాలు శవపరీక్ష కోసం తీసువస్తుంటారు. ఇలా రాత్రివేళ చనిపోయిన వారి మృతదేహాలను మరుసటిరోజు శవపరీక్ష చేసే వరకు మార్చురీ ఫ్రీజర్లలో నిల్వ చేస్తారు.

MGM : ఎంజీఎంలో పనిచేయని ఫ్రీజర్లు...

జయభేరి, వరంగల్, మే1 :
వరంగల్ ఎంజీఎం హాస్పిటల్ లోని మార్చురీలో ఫ్రీజర్లు పనిచేయడం లేదు. చల్లదనం కరవై.. ఎండల తీవ్రతకు అందులో ఉంచిన మృతదేహాలు కుళ్లిపోతున్నాయి. మార్చురీలో పనిచేసే వారి అవస్థ చెప్పనవసరం లేదు. దుర్వాసనకు మార్చురీ బయట ఉన్నవారు సైతం ముక్కుమూసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు పొరుగు జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన వారికి ఇక్కడి మార్చురీలోనే శవపరీక్షలు చేస్తారు. ప్రతిరోజూ ఎంజీఎం ఆసు పత్రికి 6 నుంచి 10 వరకు మృతదేహాలు శవపరీక్ష కోసం తీసువస్తుంటారు. ఇలా రాత్రివేళ చనిపోయిన వారి మృతదేహాలను మరుసటిరోజు శవపరీక్ష చేసే వరకు మార్చురీ ఫ్రీజర్లలో నిల్వ చేస్తారు. మార్చురీలో శవాలు నిల్వచేసిన ఫ్రీజర్లు, ఇవి పని చేయకపోవడంతో వాటి తలుపులు తెరిచి ఉంచుతున్నారు సిబ్బంది.

ప్రస్తుతం మార్చురీలో నాలుగు ఫ్రీజర్లు ఉండగా, అందులో మూడు శవాలు నిల్వ చేయగలిగినది ఒకటి. నాలుగు శవాలు పట్టేది ఒకటి. రెండు చొప్పున శవాలను నిల్వచేసే రెండు ఫ్రీజర్లు ఉన్నాయి. ప్రస్తుతం 45 డిగ్రీల పైన వేసవి ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా.. ఫ్రీజర్లు పనిచేయక పోవడంతో రాత్రివేళ అందులో ఉంచిన మృతదేహాలు ఉదయం వరకు కుళ్లిపోయి దుర్గంధం వస్తోంది. దీంతో పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రైల్వే ప్రమాదాల్లో గుర్తుతెలియని మృతదేహాల పరిస్థితి మరీ దారుణం.. పోలీసులు మూడురోజుల లుక్ అవుట్ నోటీసులు ఇచ్చినా ఎవరూ రానప్పుడు.. గుర్తుతెలియని శవాలను స్థానిక గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్‌ సిబ్బందికి అప్పగించి ఖననం చేయిస్తారు. అప్పటి వరకు మార్చూరిలో ఉండాల్సిందే. ఈ కష్టాలన్ని తీరాంటే ప్రభుత్వం మంజూరు చేసిన రూ.85 లక్షలతో మార్చురిని పునరుద్దారించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Read More 7న మద్యం షాపుల బంద్

Social Links

Related Posts

Post Comment