YCP Puttaparthi : పుట్టపర్తి నియోజకవర్గంలో వైసిపికి భారీదెబ్బ

ఈ ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించాలంటే సైకిల్ గుర్తుకు ఓటు వేసి పుట్టపర్తి నియోజకవర్గ టిడిపి ఉమ్మడి అభ్యర్థి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలు కోరారు.

YCP Puttaparthi : పుట్టపర్తి నియోజకవర్గంలో వైసిపికి భారీదెబ్బ

ఆమడ గూరు మండలంలో టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర, పల్లే కృష్ణ కిషోర్ రెడ్డి సమక్షంలో  టీడీపీలో చేరిన 100 వైసీపీ కుటుంబాలు
193 చెరువులు నింపేది వైసీపీ ఎమ్మెల్యే బూటకమే

జయభేరి, పుట్టపర్తి : పుట్టపర్తి నియోజకవర్గంలో 193 చెరువులు నింపాలనే వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ప్రజలకు చెబుతున్న మాటలు ఒట్టి భూటకమని పుట్టపర్తి టీడీపీ అభ్యర్థి పల్లె సింధూర రెడ్డి, యువ నేత పల్లె క్రిష్ణ కిషోర్ రెడ్డి లు పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సర్వ నాశనం చేసిన దుర్మార్గుడు వైసీపీ అధినేత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని కోరారు. ఆమడగూరు మండల కేంద్రంలోనీ చొడేశ్వరి కళ్యాణ మండపం లో నిర్వహించిన జయహో బిసి సమావేశంలో వారు ఈ సందర్భంగా మాట్లాడారు. అంతకు ముందు మండల కేంద్రంలో రోడ్ షో నిర్వహించారు. అక్కడ నుంచి ర్యాలీలో గా పుర వీధుల్లో తిరుగుతూ టీడీపీ సింబల్ విక్టరీ చూపిస్తూ ప్రజలకు అభివాదం చేశారు.పుట్టపర్తి టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డికి ప్రజలు పూల వర్షం కురిపించి అపూర్వ స్వాగతం పలికారు. డప్పు వాయిద్యాల వారికి స్వాగతం పలికి యువతీ యువకులు కేరింతలు కొడుతూ నృత్యాలు చేస్తూ ఆనందోత్సవాల మధ్య పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చారు. పుర వీధుల్లో  పూల వర్షం కురవడంతో పసుపు మయంగా మారింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నుంచి 100 కుటుంబాలు వైసీపీని వీడి టిడిపిలోకి చేరారు. వారికి టీడీపీ ఉమ్మడి అభ్యర్థి పల్లె సింధూర,పల్లే కృష్ణ కిషోర్ రెడ్డి, జనసేన నియోజకవర్గ ఇన్చార్జి పత్తి చంద్రశేఖర్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకొని పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.వారిని పార్టీలోకి ఆహ్వానించారు.

Read More TDP Chandrababu I ఎన్డీయేలో అందుకే చేరాం...

పేదల సంక్షేమం కోసం మంజూరైన పించన్లు డబ్బులు కూడా జగన్ రెడ్డి స్వంతానికి వాడేసి ఖజానా ఖాళీ చెసారని ఇలాంటి ఘనుడు ముఖ్యమంత్రి ఏపీ కి అవసరమా అని ప్రశ్నించారు. ప్రజలకు మేలు చేసే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే బాగుంటుందని అన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి పుట్టపర్తి నియోజకవర్గ టిడిపి ఉమ్మడిఅభ్యర్థి పల్లె సింధూర రెడ్డిని ,హిందూపురం పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి పార్థసారథినీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు.

Read More TDP : డబ్బుకు అమ్ముడుపోతారు.. ఓటర్లు వెధవలు.. వాళ్లను కొనేద్దాం...

2019 ఎన్నికల్లో పుట్టపర్తి నియోజకవర్గంలో ఉన్న 193 చెరువులకు నీళ్లు ఇచ్చిన తర్వాతనే మళ్ళీ ఓట్లు అడుగుతామని చెప్పిన వైసీపీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి కి చెరువులు నింపాలని ఆలోచన ఇప్పుడు వచ్చిందని ,ఓట్లు కోసం డ్రామా అడే వైసీపీ ఎమ్మెల్యే ఈ ప్రజలకు అవసరమా అని ప్రశ్నించారు. వైసీపీ ఎమ్మెల్యే చేతకానితనంతోనే 193 చెరువులకు హంద్రీనీవా నీళ్లు తీసుకరాలేక పోయారన్నారు. అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ఈ చెరువులకు హంద్రీ నీవా జలాలు తీసుకురావడానికి డి పి అర్ ప్రాజెక్టు కు రూ.3.40 కోట్లు బడ్జెట్ విడుదల చేసిన విషయాన్ని వారు గుర్తు చేశారు.

Read More TDP Leaders : ప్యాక్.. కొన్ని కుటుంబాలకు మాత్రమే..

ప్రజలను పట్టి పీడించిన ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మళ్ళీ పుట్టపర్తి నియోజకవర్గంలో  గెలిపించుకుంటే ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న దురదృష్టకరమని అన్నారు. ఈ ఎన్నికల్లో వైసీపీని చిత్తుగా ఓడించాలంటే సైకిల్ గుర్తుకు ఓటు వేసి పుట్టపర్తి నియోజకవర్గ టిడిపి ఉమ్మడి అభ్యర్థి అభ్యర్థి పల్లె సింధూర రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలు కోరారు.

Read More DGP : ఏపీ డీజీపీపై కేంద్ర ఎన్నికల సంఘం.. 

Views: 0

Related Posts