Soldiers Services : త్రివిధ దళాల సైనికుల దేశ సేవలు వెలకట్టలేనివి

వాయుదళ మాజీసైనికునికి ఘననివాళులర్పించిన త్రి దళాల మాజీ సైనికులు కమిటీ చైర్మన్ రెడ్డి శ్రీనివాస వర ప్రసాద్, మాజీ సైనికులు

Soldiers Services : త్రివిధ దళాల సైనికుల దేశ సేవలు వెలకట్టలేనివి

పల్నాడు జిల్లా పల్నాడు రూరల్ (రాష్ట్ర మరియు జిల్లా మాజీసైనికుల కమిటీ). వాయు దళ మాజీ సైనికునికి రాష్ట్ర, పల్నాడు, బాపట్ల జిల్లా మాజీసైనికులు ఘన నివాళులర్పించారు. రెంటచింతల, పసర్లపాడు నివాసి వాయు దళ మాజీసైనికుడు సార్జెంట్ పమ్మి అంజి రెడ్డి తండ్రి పమ్మి లచ్చి రెడ్డి, (46) నిన్న ఉదయం 10 గం 30 ని లకు స్వగృహం నందు గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. అయన వాయుదాళంలో 20 సం.లు దేశసేవ చేశారు. ఆయనకు తల్లి తండ్రులు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాష్ట్రమంతా మాజీసైనికులకు సేవలందిస్తున్న రాష్ట్ర త్రివిధ దళ మాజీసైనికుల కమిటీ చైర్మన్ రెడ్డి శ్రీనివాస వర ప్రసాద్ విషయం తెలుసుకున్న వెంటనే సంబంధిత అధికారులకు తెలియచేశారు.  

23ec52bd-386c-4bfc-9148-94c25974123b

Read More TDP : డబ్బుకు అమ్ముడుపోతారు.. ఓటర్లు వెధవలు.. వాళ్లను కొనేద్దాం...

25న ఉదయం 11 గం.లకు పసరపాడు మృతుని గృహానికి చేరుకున్న బాపట్ల సూర్యలంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి ఆరుగురు కంబాట్ సిబ్బంది, రాష్ట్ర త్రివిధ దళ మాజీసైనికుల కమిటీ చైర్మన్ రెడ్డి శ్రీనివాస వర ప్రసాద్, రాష్ట్ర ముఖ్య కార్యదర్శి షేక్ కాలేషా, ఐటీ ఇంచార్జి ప్రశాంత్, కోదాధికారి వంశీ కృష్ణ తదితరులు జాతీయ పతాకం తో సెరిమొనియల్ కవాతు ప్రదర్శన ద్వారా, రీత్ లతో నివాళులర్పించారు. అంజి రెడ్డి మృతిపట్ల బంధువుల, స్నేహితుల ఆర్తనాదాలతో ఆ ప్రాతం దుఃఖభరితంగా మారిపోయింది. ఎంతో బాధ్యతతో ప్రతీపనిని నెరవేర్చే అంజి రెడ్డి లేని తన కుటుంబం తీరని లోటు గా ఉందని ముఖ్య కార్యదర్శి షేక్ కాలేషా దుఃఖాన్ని వ్యక్తపరిచారు. ఫామిలీ పెన్షన్, పిల్లల స్కాలర్షిప్, విద్య,  వైద్య మొదలగు విషయాలలో మేము నిలబడి సహాయ సహకారాలు అందిస్తామని ధైర్యం చెప్పి బంధువులను భార్య పిల్లలను వర ప్రసాద్ ఓదార్చారు. రాష్ట్ర సైనిక్ బోర్డు ముఖ్య సంచాలకులు బ్రిగేడియర్ వెంటరెడ్డి (విఎస్ఎం) రిటైర్డ్, జిల్లా మాజీసైనికుల కార్యాలయం నుండి సంక్షేమ అధికారిని శ్రీమతి గుణశీల, బాపట్ల ఎయిర్ ఫోర్స్ సూర్యలంక స్టేషన్ నుండి స్టేషన్ కమాండర్ లు సంతాపం వ్యక్తపరిచారు.

Read More ycp tdp I పౌరుషాల సీమలో పవర్ ఎవరికి....?

డిపార్ట్మెంటల్ తరపున ఎటువంటి సమస్యలున్నను మా దృష్టికి తెచ్చినయెడల సత్వరమే పరిష్కరిస్తామని బాపట్ల జిల్లా రాష్ట్ర ముఖ్యలయ కార్యాలయం నుండి సేవలందిస్తామని కోశాధికారి వంశీ కృష్ణ అన్నారు. పల్నాడు జిల్లా మాజీసైనికుల సంక్షేమ సంఘం ముఖ్య కార్యదర్శి సత్యన్నారాయణ రెడ్డి, మాజీసైనికులు కె వెంకటరామిరెడ్డి, డి రామిరెడ్డి, ఖాదర్ మస్తాన్, పరిసర ప్రాంత మాజీసైనికులు జోహార్ నినాదాలతో  నివాళులర్పించారు.

Read More Chabdrababu on Jagan : బాపట్లలో ఎంపీగా రౌడీ కావాలో, పోలీస్ అధికారి కావాలో ప్రజలే తేల్చుకోవాలన్న చంద్రబాబు…

Views: 0

Related Posts