TDP : నందమూరి బాలకృష్ణ, వసుంధర ఆస్తులు, అప్పులు ఎన్నో తెలుసా?

బాలకృష్ణ శుక్రవారం భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు.

  • ఆయన ఆస్తుల విలువ రూ. 81.63 కోట్లు. ఆయన భార్య వసుంధర ఆస్తుల విలువ రూ. 140 కోట్ల 38 లక్షల 83 వేలు. బాలయ్య అప్పులు 9 కోట్ల 9 లక్షల 22 వేల రూపాయలు. వసుంధర అప్పులు రూ. 3 కోట్ల 83 లక్షల 98 వేలు ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించింది.

TDP : నందమూరి బాలకృష్ణ, వసుంధర ఆస్తులు, అప్పులు ఎన్నో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నామినేషన్ల పర్వం జోరుగా సాగుతోంది. ప్రముఖ సినీ నటుడు, హిందూపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మరోసారి ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రెండుసార్లు గెలిచిన బాలకృష్ణ. హిందూపురం, రాయలసీమ జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపుతున్నారు బాలయ్య. కాగా, బాలకృష్ణ శుక్రవారం భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. భార్య వసుంధరతో కలిసి హిందూపురం ఆర్డీఓ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు.

బాలకృష్ణ తన నామినేషన్ పత్రాల్లో ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించారు. అతనికి రూ. 9 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయని బాలయ్య తన అఫిడవిట్‌లో పేర్కొన్నాడు. ఇక బాలయ్య చూపించిన ఆస్తుల విషయానికొస్తే.. ఆయన ఆస్తుల విలువ రూ. 81.63 కోట్లు. ఆయన భార్య వసుంధర ఆస్తుల విలువ రూ. 140 కోట్ల 38 లక్షల 83 వేలు. బాలయ్య అప్పులు 9 కోట్ల 9 లక్షల 22 వేల రూపాయలు. వసుంధర అప్పులు రూ. 3 కోట్ల 83 లక్షల 98 వేలు ఎన్నికల అఫిడవిట్‌లో వెల్లడించింది. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం బాలకృష్ణ మీడియాతో మాట్లాడారు.

Read More అఖిలేష్ లాబీయింగ్...

హిందూపురం నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామన్నారు. తాగునీటి సమస్య పరిష్కారంతో పాటు మండలాలు, గ్రామాల్లో సీసీ రోడ్లు, కల్వర్టులు నిర్మించినట్లు తెలిపారు. వైసీపీ ప్రభుత్వం క్యాంటీన్లను తొలగించినా హిందూపురంలో 400 మందికి భోజనాలు ఏర్పాటు చేసిందన్నారు. నందమూరి కుటుంబంపై హిందూపురం ప్రజలకు ఎనలేని అభిమానం ఉందన్నారు. తనను రెండుసార్లు గెలిపించిన హిందూపురం ప్రజలను మళ్లీ భారీ మెజార్టీతో గెలిపించాలని బాలకృష్ణ కోరారు.

Read More ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా చర్చ సమావేశం