RTI I ఆర్టీఐ కమిషనర్ గా జర్నలిస్ట్ రెహానా బేగం నియామకం పట్ల "ప్రజా సంకల్ప వేదిక " అభినందనలు
భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అభిలషించారు.
జయభేరి, అమరావతి:
ఈ మేరకు అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మదిరే రంగ సాయిరెడ్డి, పి. సాయికుమార్, ఎస్. సూర్యనారాయణ రెడ్డి, తదితరులు ఆర్టీఐ కమిషనర్ గా నియమితులైన సందర్భంగా జర్నలిస్ట్ రెహానా బేగంకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.
భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అభిలషించారు. ఆర్టీఐ నిర్దేశిత లక్ష్యాలను నెరవేర్చే దిశగా మీడియా ప్రతినిధిగా ప్రత్యేకతను చాటు కోవాలన్నారు. ప్రభుత్వ పనితీరులో పారదర్శకతనూ, జవాబుదారీతనాన్ని ప్రోత్సహించడం ద్వారా ప్రజాస్వామ్య పరిరక్షణకు తనదైన శైలిలో కృషి చేయాలన్నారు.
ఆర్టీఐ కమిషనర్ గా బాధ్యతలు చేపట్ట నున్న సందర్భంగా అభినందనలు తెలిపారు.
ప్రజాసంకల్పవేదిక
ఆర్టీఐ విభాగం.
Views: 1


