Pavan Babu I దారి తప్పిన పవన్ గాలులు.. చంద్రబాబుతో పొత్తులు...
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుని 2024 ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని తపనతో ఇరు పార్టీలు కాలు దువ్వుతున్నాయి. నేపథ్యంలో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాలపై 'జయభేరి' సగర్వంగా అందిస్తున్న కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్ రాజకీయ సమగ్ర విశ్లేషణ..
జయభేరి, హైదరాబాద్ :
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో క్రేజ్ సంపాదించుకొని తన అన్న చిరంజీవి రాజకీయ జీవితాన్ని నెమరు వేసుకుంటూ రాష్ట్ర రాజకీయాల్లో పూర్తిగా అవినీతి రహితంగా మార్చాలని ఉద్దేశంతో తాను సంపాదించుకున్న ఇమేజ్ ని కాసులని తన పార్టీ ఖాతాలో వేసుకుంటూ 2014 ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలనుకుని పోటీ చేయలేకపోయారు.. ఇక 2019లో పోటీ చేసి మరి ఓడిపోయి కంగు తిన్నారు.... అసలు రాజకీయాలకు నేను పనికి వస్తాన రానా అని మీమాంసలో జనసేన ని తన మనసు మార్చుకున్నాడు ఏమో సీఎం పదవిని పక్కన పెట్టి చంద్రబాబు సీఎం అవ్వాలని అందుకు నేను టిడిపితో కలిసి పొత్తు పెట్టుకుని పని చేస్తానని ముఖ్యమంత్రి జగన్ గద్దె దింపడమే లక్ష్యంగా అడుగులేస్తూ తడబడుతూనే 2024 ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఉద్దేశంతో నానా యాతనలు పడుతున్నాడు... రాజకీయాల్లో గెలుపోటములు సహజమే కానీ పవన్ కళ్యాణ్ గెలిచింది ఎక్కడ ?
జనసేన ని ఎప్పుడు ఓటమి వెంటాడుతూనే ఉంది. అందుకే తాజాగా పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి.. రాజకీయాల్లో డబ్బులు ఖర్చు పెట్టకుండా గెలవడం అంటే అసాధ్యం అలా అని డబ్బులు ఖర్చు పెట్టమని చెప్పట్లేను కానీ కనీసం భోజనాల ఖర్చయినా పెట్టకపోతే ఎలా ?రాజకీయాల్లో మనం గెలుస్తాం అంటూ తప్పదు మాటలు వల్లించాడు.. ఎలక్షన్ కమిషన్ ఇన్ని లక్షల వరకు ఖర్చు పెట్టుకోవచ్చు అని చెబుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా డబ్బులు ఖర్చు పెట్టాల్సిందే అనే విషయాన్ని నిజాన్ని చాలా రోజులకు వంట పట్టించుకున్నాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్...
ఇక 2014లో పోటీ చేయలేక 2019లో ఓటమిని జీర్ణించుకోలేక 2024లో ఎలాగైనా గెలవాలని భీమవరం నియోజకవర్గంలో మరి ఇల్లు కొనుక్కొని తిష్ట వేస్తూ కొత్త కొత్త మాటలు మాట్లాడుతూ రాజకీయాల్లో ముడ్డి లేని బంగారంగా ఎక్కడ కుదురుగా కూర్చోకుండా స్థిమితం లేకుండా దీర్ఘకాలిక ఆలోచన సరళి పూర్తిగా మందగించిపోయి రాష్ట్ర రాజకీయాల్లో తానుక అటు ఇటు గాని వ్యక్తిగా ఉన్నాడనేది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం. కానీ 2024 ఎన్నికల్లో ఎలాగైనా జగన్ ని ఓడించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుని కేంద్రంలో బీజేపీతో వంద కాగుతూ మొత్తానికి సీఎం జగన్మోహన్ రెడ్డిని గద్దెనించాలని పధక రచనలు చేస్తూ దైవభక్తి అంతంతగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన చేతులకు కూర్మా నాగబంధం అనే ఈ రెండు ఉంగరాలను చేతికి తగిలించుకొని తన రాజకీయ జీవితాన్ని మొదలెట్టబోతున్నాడు అనేది ఆయన మాట్లాడుతున్నంత సేపు ఆయన కూర్చున్న మీటింగ్లో జనసేన ని సైనికులు ఆయన చేతి వేలు ఉంగరాన్ని చూస్తూ ఉండిపోయారట...
కూర్మ ఉంగరం ధరించడం వలన అభిప్రాయం సిద్ధించే యోగం కలుగుతుందని వృద్ధి అధికారం ప్రజాకర్షణ ఎక్కువగా లభిస్తాయని ఒక నమ్మకం. అంటే ప్రజాకర్షణ ఎలాగూ పవన్ కళ్యాణ్ కు ఉండనే ఉంది సిద్ధించే యోగం వృద్ధి అధికారం ఈ మూడే కలగాలని కోరుమావతారంలో ఉన్న బంగారు ఉంగరాన్ని చేతివేళ్లకు తగిలించుకున్నాడు పవన్ కళ్యాణ్. అలాగే మరొక ఉంగరం నాగబంధం ఉంగరం ఈ ఉంగరం ధరించడం వలన సత్ఫలితాలు మహిమాన్వితమైన శక్తి తనకోసం అవుతుందనే ఉద్దేశంతో ఎవరు చెప్పారు ఏమో తెలియదు గానీ తన జీవితం లో అధికారం దక్కదేమో అనే భయంతో ఇలా ఉంగరాల రాజకీయం చేస్తున్న బొంగురాల హీరోని భీమవరం ప్రజలు గట్టేక్కిస్తారో..? పాతి పెడతారో? రాష్ట్ర ఎన్నికల లో ఓటు వేసే ప్రజలే నిర్ణయించాలి.
అధికారంలోకి రావాలని 2014లో జనసేన అని రాష్ట్ర రాజకీయాల్లో ప్రవేశించి పోటీ చేస్తానని పోటీ చేయకుండానే కనీసం పార్టీకి తగిన నాయకులు దొరకక అయోమయంలో పడి ఆ ఐదు సంవత్సరాల కాలాన్ని వృధా చేసుకున్నాడు. 2019 ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ఉద్దేశంతో రెండు స్థానాల్లో పోటీ చేసి రెండు స్థానాల్లోనూ ఓటమిని చవి చూశాడు. తనకున్న ఇమేజ్ అభిమానుల తాకిడి ఓట్లు వచ్చేసరికి ఓట్లు వేయడంలో ఆ అభిమానులు ఎవరు పవన్ కళ్యాణ్ ని సీఎం గా చూడలేకపోయారు... గతంలో పవన్ కళ్యాణ్ తానే సీఎం గా కావాలని నేనే సీఎం గా మీ ముందుకు వస్తాను ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పుకొచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాట మారుతుంది అడుగులు తడబడుతున్నాయి పయనం దారి తప్పుతోంది అని అనడానికి టిడిపి తో పొత్తు పెట్టుకోవడమే... ఇక టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు కొన్నిఏళ్లుగా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ముసలిదానానికి మల్లొకసారి ఆంధ్రప్రదేశ్కు సీఎం గా చేసి తన ఈగోను సాటిస్ఫాక్షన్ చేసుకోవాలని తహతలాడుతున్నాడు... చంద్రబాబు పధక రచనలు పవన్ కళ్యాణ్ బుక్ అయిపోయాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు.
నిజానికి పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేస్తాడని ఆయన అభిమానులు బాగా ఆశపడ్డారు. అభిమానుల ఆశలను మరింత రెట్టింపు చేసే లాగిన కచ్చితంగా నేనే సీఎం గా పోటీ చేస్తా నన్ను మీరు ఆశీర్వదించండి ఒకే ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి అంటూ నాటి జగన్ అన్న మాటలనే పదేపదే వర్ణిస్తూ ఎలాగైనా అధికారం రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ వస్తున్నాడు. కానీ కాలగమనంలో చంద్రబాబు చేసిన పాపాలకు జైలుకు వెళ్లడం ఆయన పరామర్శించేందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ సానుభూతితో మొత్తానికి తన పార్టీని టిడిపిలో కలిపి వేశాడు... ఇక్కడే పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితం ప్రశ్నార్థకంగా మారిపోయింది. ప్రతి అంత ఆశ మాషి మనిషి కాదు.. ఎన్నో వడిదుడుకులను దిగమింగుకొని ఎన్నో ముళ్ళకంచెలను దాటి సీఎంగా ఆంధ్ర రాష్ట్రాన్ని ఏలుతున్న మొండి ఘటం వైయస్సార్ తనయుడు జగన్మోహన్ రెడ్డి... తన జీవితం ముందు ఇలాంటి పొత్తులు జిత్తులు ఏవి చెల్లవ అనేది ఆంధ్ర జనం అప్పుడప్పుడు టిడిపి నేతలకు చుక్కలు చూపిస్తున్నారు...
ఇక పవన్ కళ్యాణ్ భీమవరానికి ఎప్పుడు రాకుండా ముచ్చటగా మూడోసారి వచ్చి ఇక్కడే ఇల్లు తీసుకుంటాను, భీమవరం ప్రజలకి అందుబాటులో ఉంటాను, నాకు ఒక్కసారి అవకాశం కల్పించండి, నేను మీకు తోడుగా ఉంటాను... అనే మాటలు భీమవరం నియోజకవర్గ ప్రజలు నమ్ముతారా? గత రెండుసార్లు జరిగిన ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన పవన్ కళ్యాణ్ పోయి టిడిపి చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకుంటే నిలబడగలడా? గెలవగలడా? అనేది ప్రశ్నార్ధకంగా మారుతుంది. ఎందుకంటే చంద్రబాబు ఎత్తులు, జిత్తులు పై ఎత్తులు అంతగా పవన్ కళ్యాణ్ కు అర్థం కావు, అంత వయసు లేదు. ముసలితనాన్ని కూడా అధికారం కోసం వెంపర్లాడే ఆ వ్యక్తికి నవతరం నాయకుడిగా జనసేనకి ఎంతో రాజకీయ జీవితంలో చాలా పెద్ద అడ్డుగీత ఉంది. దాని దాటుకొని చంద్రబాబుతో జతకట్టి అధికారం పొందాలనుకునే పవన్ కళ్యాణ్ ఆశలు నిరాశగా మిగలడానికి ఎంతో దూరం కూడా లేదు.. చేతికి ఉంగరాలు ధరించినంత మాత్రాన నాగబంధం కూర్మావతార ఉంగరాలు అధికారాన్ని తెచ్చి పెడతాయి అనుకుంటే అంతకంటే వెర్రితనం మరొకటి ఉండదు... ఉంగరాలతో అధికారాన్ని చేజెక్కించుకోవాలని ప్రజాస్వామ్యంలో మూర్ఖత్వం... ఎన్నడూ ధరించని ఉంగరాల సోగ్గాడు పవన్ కళ్యాణ్ ఉంగరాలు ధరించి అందరిని ఆకర్షించుకునే ప్రయత్నం చేశాడు.. అవి రాజకీయాల్లో అధికారం ఎలాగైనా సంపాదించుకోవడానికి ఇలాంటి ఉంగరాలు పెట్టాలని ఆయనకు ఏ నాయకుడు చెప్పాడో ఏమో తెలియదు కానీ మొత్తానికి దేవుడి మీద భారం పెట్టుకుని ప్రజాక్షేత్రంలో తన జీవితాన్ని పరీక్షించుకుంటున్న పవన్ కళ్యాణ్ జగన్ ముందు అధికారం దక్కించుకోగలడా?
జగన్ అంటే మామూలు వ్యక్తి కాదు అతను ప్రభంజనం.. ఐదేళ్లు అధికారంలో ఉన్న సీఎం మరో ఐదేళ్లు అధికారంలో రావ డానికి ఎన్ని ప్రయత్నాలు అయినా చేసుకుంటాడు. ఎంత దూరమైనా వెళ్తాడు.. ప్రతిపక్షంలో కూర్చున్న టిడిపి అసలే రాజకీయ ఖాతా తెరవని జనసేన ని రెండు దొందూ దొందే అన్నట్టుగా రాజకీయ వ్యవహార శైలి చూస్తుంటే ఆంధ్ర ప్రజలు మరొక్కసారి జగన్కే అధికారం కట్టబెట్టే ఆలోచనలో ఉన్నారనే విషయం స్పష్టంగా తెలుస్తోంది... ఇదే గనక నిజమైతే జగన్ మరొకసారి అధికారంలోకి వస్తే అటు టిడిపి ఇటు జనసేన అని రెండు మూట మూల సర్దుకోవాల్సిందే….
...కడారి శ్రీనివాస్
కాలమిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, కవి, రచయిత
Post Comment