నెల రోజుల్లోనే 9 వేల కోట్లు... ఓటర్లకు మించి లబ్దిదారులు

టీడీపీ సూపర్‌ సిక్స్ పథకాల అమలు కోసం ఏటా రూ.73,440కోట్ల రుపాయలు అవసరమని ఏపీ ఆర్ధిక శాఖ ఎన్నికలకు ముందు అంచనా వేసినట్టు సిద్ధం సభల్లో జగన్ చెప్పారు. బీసీలకు 50ఏళ్లకే పెన్షన్ పథకాన్ని కూడా కలుపుకుంటే మరో రూ.13,872 కోట్ల రుపాయలు అవసరం అవుతాయని జగన్ అప్పట్లో ఆరోపించారు. చంద్రబాబు ప్రకటించిన ఏడు పథకాలకు 87,312 కోట్ల రుపాయలు అవసరం అవుతాయని, ఇప్పటికే అమలు చేస్తున్న డిబిటి పథకాలతో కలిపితే అది రూ.1.40లక్షల కోట్లకు చేరుతుందనేది జగన్ మాట.

నెల రోజుల్లోనే 9 వేల కోట్లు... ఓటర్లకు మించి లబ్దిదారులు

విజయవాడ, జూలై 18 :
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం తీవ్ర ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటోంది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం ముందున్న ఆర్ధిక సవాళ్లు సర్కారును కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ముందు ఉన్నఇప్పుడు తీవ్రమైన ఆర్థిక సవాళ్లు ఉన్నాయి.

ఓ వైపు సంక్షేమ పథకాలను కొనసాగించడం మరోవైపు అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగించడం కత్తిమీద సాముగా మారింది. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్ల చెల్లింపు భారాన్ని ఎదుర్కొంటోంది.  ప్రభుత్వం ఏ పనిచేయాలన్నా డబ్బుతో ముడిపడి ఉండటం ప్రభుత్వాన్ని ఊపిరిసలపనివ్వడం లేదు. కేంద్ర ప్రభుత్వ సాయంతో పాటు ఆర్థిక వెసులుబాటు అందకపోతే పాలన ముందుకు నడవలేని పరిస్థితులు ఏపీలో నెలకొన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన వెనుక ఉద్దేశం కూడా ఇదేనని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రం ముందు ఉన్న ఆర్థిక సవాళ్లను కేంద్రానికి మొరపెట్టారు.ప్రభుత్వం ఏర్పాటైన నెల రోజుల వ్యవధిలోనే ఆర్‌బిఐ వేలంలో రూ.9కోట్లను సమీకరించారు. జూన్ 12న రూ.2వేల కోట్లు, జూన్ 28న రూ.5వేల కోట్లు, జూలై 12న రూ.2వేల కోట్లను సమీకరించింది.ఆంధ్రప్రదేశ్‌లో 2023-2024 ఆర్థిక సంవత్సరానికి ఏటా ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల రూపంలో  రూ.52వేల కోట్ల రుపాయల్ని ప్రజలకు నేరుగా పంచిపెట్టారు.

Read More ఫార్మా సిటీ ప్రమాదం

ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలంటే మరో రూ.20-30వేల కోట్ల రుపాయలు అదనంగా వెచ్చించాల్సిన పరిస్థితులు ఉన్నాయిఏపీలో సంక్షేమ పథకాల్లో భాగంగా తప్పనిసరిగా అందించే ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలతో  ఏటా లబ్దిదారులకు బదిలీ చేస్తున్న సొమ్ము ఏటా రూ.52వేల కోట్ల రుపాయలుగా ఉండేది. ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ పథకాల రూపంలో లబ్దిదారులకు కొన్ని పథకాల్లో ప్రత్యక్ష నగదు బదిలీ అమలు చేస్తున్నారు. వీటిలో కొన్ని తప్పనిసరిగా అమలు చేయాల్సిన పథకాలు ఉన్నాయి. 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న కొన్ని పథకాలను మరింత మెరుగ్గా తాము అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో హామీ ఇచ్చారు.

Read More collector vijaya krishnan : ప్రజా సమస్యలకు మండల స్థాయిలోనే పరిష్కారం చూపాలి కలెక్టరు విజయ కృష్ణన్

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో అధికార ప్రతిపక్షాలు పోటాపోటీగా తమను గెలిపిస్తే జనాలకు ఏమి చేస్తామో వివరిస్తూ వరాలు కురిపించాయి. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి కనీవిని ఎరుగని మెజార్టీని ప్రజలు కట్టబెట్టారు. ఎన్నికల హామీల్లో భాగంగా పెంచిన పెన్షన్లను ఇప్పటికే పంపిణీ ప్రారంభించారు. ఈ పథకంలో ప్రతి నెల రూ.3500కోట్ల రుపాయలను పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం ఖర్చు చేయనుంది.వైసీపీ ప్రభుత్వం తప్పనిసరిగా అమలు చేయాల్సిన పథకాలకే రూ.52వేల కోట్లను ఏటా చేయాల్సి వస్తే, చంద్రబాబు ఇచ్చిన హామీలు కలిపితే ఆ భారం మరింత పెరుగనుంది. టీడీపీ సూపర్‌ సిక్స్ పథకాల అమలు కోసం ఏటా రూ.73,440కోట్ల రుపాయలు అవసరమని ఏపీ ఆర్ధిక శాఖ ఎన్నికలకు ముందు అంచనా వేసినట్టు సిద్ధం సభల్లో జగన్ చెప్పారు. బీసీలకు 50ఏళ్లకే పెన్షన్ పథకాన్ని కూడా కలుపుకుంటే మరో రూ.13,872 కోట్ల రుపాయలు అవసరం అవుతాయని జగన్ అప్పట్లో ఆరోపించారు. చంద్రబాబు ప్రకటించిన ఏడు పథకాలకు 87,312 కోట్ల రుపాయలు అవసరం అవుతాయని, ఇప్పటికే అమలు చేస్తున్న డిబిటి పథకాలతో కలిపితే అది రూ.1.40లక్షల కోట్లకు చేరుతుందనేది జగన్ మాట.

Read More స్మశాన వాటిక స్థలం కొరకు ఎమ్మెల్యేకు వినతిపత్రం అందచేసిన ఉపసర్పంచ్ వెన్నెల

Latest News

BC Reservations: స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంపునకు సుముఖం..!! BC Reservations: స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల పెంపునకు సుముఖం..!!
జయభేరి, హైదరాబాద్‌, జూన్‌ 18 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను అమలు చేయడానికి ఇంతవరకు జరిగిన కృషిని వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్‌ను...
కాళేశ్వరం ప్రాజెక్టును కాలగర్భంలో కలిపి, కేసీఆర్‌ ని వ్యక్తిగతంగా బద్నాం చేయాలనే కాంగ్రెస్ కుట్రలు
KavyaKalyanram : అందమే అసూయపడేలా కనువిందు
Air India Flight Crashed : అంతులేని విషాదం వెనుక
Pooja Hegde
Deepika pilli