అఖిలేష్ లాబీయింగ్...

ఇండియా కూటమిలోకి జగన్

అఖిలేష్ లాబీయింగ్...

విజయవాడ, జూలై 25 :
జగన్ ఇండియా కూటమికి దగ్గరవుతున్నారా? జాతీయ పార్టీల అండ ఉండాలనుకుంటున్నారా? అవసరమైతే కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపాలనుకుంటున్నారా? జాతీయస్థాయిలో ప్రస్తుతం జరుగుతున్న చర్చ ఇది. ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆరోపిస్తూ జగన్ హస్తిన బాట పట్టారు.

జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. మద్దతు తెలపాలని జాతీయస్థాయిలో అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. కానీ పార్టీల నుంచి స్పందన అంతంత మాత్రమే. ఏపీలో మిగతా పార్టీలు స్పందించలేదు. రాజకీయ స్నేహితుడైన కేసీఆర్ పార్టీ సైతం పెద్దగా మొగ్గు చూపులేదు. కానీ అనూహ్యంగా సమాజ్ వాది పార్టీ ధర్నాకు సంఘీభావం తెలపడం విశేషం. తద్వారా కొత్త సమీకరణలకు సంకేతాలు వెలువడ్డాయి. సమాజ్ వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ద్వారా ఇండియా కూటమిలోకి ఎంట్రీకి జగన్ ప్రయత్నిస్తున్నట్లు తేటతెల్లమయ్యింది. కాంగ్రెస్ పార్టీతో ఉన్న విభేదాల దృష్ట్యా అఖిలేష్ సాయాన్ని జగన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల్లో సమాజ్ వాది పార్టీ అనూహ్యంగా పుంజుకుంది.

Read More భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొన్న ఎంపీపీ పైల, మాజీ సర్పంచ్ చుక్కా

ఎంపి స్థానాలను సాధించింది. భవిష్యత్ రాజకీయ అవసరాల దృష్ట్యా అఖిలేష్ యాదవ్ జగన్ కు స్నేహ హస్తం అందించినట్లు తెలుస్తోంది. ఏపీలో మిగతా రాజకీయ పక్షాలు జగన్ తో కలిసేందుకు సాహసించడం లేదు. కాంగ్రెస్, వామపక్షాలు ఇండియా కూటమిలో ఉన్నాయి. టిడిపి, బిజెపి,జనసేన ఉమ్మడిగా ముందుకు సాగుతున్నాయి. వచ్చే ఎన్నికల వరకు ఇదే సమన్వయంతో కొనసాగాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ తరుణంలో ఏపీలో మిగతా రాజకీయ పక్షాలను కలుపుకొని వెళ్లాలంటే.. ఇండియా కూటమిలో చేరడం శ్రేయస్కరమని జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.కేంద్రంతో పాటు ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది.

Read More పండగ వేళ దుర్గమ్మే ఇంటికి వచ్చిందని...

రాష్ట్రంలో ఎన్డీఏ కూటమికి వ్యతిరేకంగా జగన్ ఢిల్లీలో ధర్నా చేపడుతున్నారు. ఒక విధంగా చెప్పాలంటే ఎన్డీఏకు వ్యతిరేకంగా వెళుతున్నట్టే. దేశంలో చాలా పార్టీలకు సమాచారం ఇచ్చారు. మద్దతు కోరారు. కానీ ఎన్డీఏ పక్షాలు మద్దతు తెలిపే ఛాన్స్ లేదు. కానీ అనూహ్యంగా ఇండియా కూటమిలోని సమాజ్ వాది పార్టీ ముందుకొచ్చింది. సంఘీభావం ప్రకటించింది. కేంద్రంలో ప్రధాని మోదీ, బిజెపి విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు అఖిలేష్. ఎన్డీఏ కూటమి అంటేనే అల్లంత దూరంలో ఉంటారు. అటువంటి అఖిలేష్ నేతృత్వంలోనే సమాజ్ వాది పార్టీ జగన్ కు మద్దతు తెలపడం వెనుక చాలా కథ నడిచినట్లు సమాచారం.

Read More ఘనంగా మదర్ తెరిసా 114 జయంతి వేడుకలు

ముఖ్యంగా జగన్ ఇండియా కూటమి వైపు మొగ్గు చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నేషనల్ మీడియా సైతం ఇదే స్పష్టం చేస్తోంది.ఇండియా కూటమిలో అతిపెద్ద పార్టీగా సమాజ్ వాది పార్టీ నిలిచింది. కాంగ్రెస్ పార్టీ తర్వాత ఎక్కువ ఎంపి స్థానాలను దక్కించుకుంది. బిజెపికి యూపీలో చావు దెబ్బతీసింది. బిజెపి సొంతంగా అధికారంలోకి రాకుండా చేయడంలో సమాజ్ వాది పార్టీ సక్సెస్ అయ్యింది. అటువంటి సమాజ్ వాది పార్టీ మద్దతును జగన్ కూడగట్టారు. ఇది కచ్చితంగా కేంద్ర పెద్దలకు ఆగ్రహం తెప్పించే విషయమే. అయితే ముందస్తు వ్యూహంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోందిఇప్పుడున్న పరిస్థితుల్లో బిజెపి వైసిపికి సహకరించే పరిస్థితి లేదు. ప్రస్తుతానికి రాజ్యసభలో వైసిపి అవసరం ఉన్నా.. కొద్ది రోజుల్లో రాజ్యసభలో ఎన్డీఏ ప్రాతినిధ్యం పెరగనుంది. మ్యాజిక్ ఫిగర్ దాటనుంది.

Read More దువ్వాడ.. యుగపురుషడు... వైరల్ గా  మాధురి కామెంట్స్

మరోవైపు లోక్ సభలో టిడిపి కింగ్ మేకర్ గా ఉంది. ఎన్డీఏకు బలమైన పక్షంగా నిలిచింది. ఏపీలో టిడిపికి బద్ద విరోధిగా ఉన్న జగన్ కు సహకరించే స్థితిలో బిజెపి లేదు. అందుకే ఈ పరిణామాలన్నింటినీ ఆలోచించిన జగన్ సాహసం నిర్ణయానికి వచ్చారు. అఖిలేష్ ద్వారా ఇండియా కూటమిలో అడుగుపెట్టి.. ఏపీలో కాంగ్రెస్, వామపక్షాల స్నేహ హస్తాన్ని అందుకునేందుకు ఈ ప్రయత్నాలని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి అందులో ఎంత వాస్తవం ఉందో తెలియాలి.

Read More జనవరి నుంచి కొత్త రేషన్ కార్డులు

Latest News

ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి  ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం-2005 బోర్డులు ఏర్పాటు చేయాలి 
జయభేరి, దేవరకొండ :రాష్ట్రములో ఉన్న అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలలో సమాచార హక్కు చట్టం 2005 సెక్షన్ 2(హెచ్) ప్రకారం అధికార యంత్రంగం సూచిక బోర్డులను తప్పనిసరిగా...
మొద్దు నిద్రలో రేవంత్ సర్కారు
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ పీఏ పల్లి శాఖ ఆధ్వర్యంలో స్థానిక స్థానిక ఆదర్శ పాఠశాల ముందు ధర్నా
వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు జరుగుతున్నా మొద్దునిద్ర వీడని రేవంత్ సర్కార్ 
ప్రజా ప్రభుత్వంలో విద్యా రంగానికే పెద్ద పీఠ 
విద్యుత్ షాక్ తగిలి వ్యక్తి మృతి