PM Modi - Chandrababu I ప్రధాని మోదీ చంద్రబాబుతో జోకులు..!

మీ గొంతు చాలా బలంగా ఉందని, మీరు చాలా బలంగా ఉన్నారని చమత్కరించారు.

PM Modi - Chandrababu I ప్రధాని మోదీ చంద్రబాబుతో జోకులు..!

జయభేరి :
ప్రజాగళం వేదిక వద్ద ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. చంద్రబాబు నాయుడుతో ప్రధాని నరేంద్ర మోదీ జోకులు వేశారు. అంటూ సరదాగా కామెంట్స్ చేశాడు. చంద్రబాబు ప్రసంగం ముగించుకుని తిరిగి రాగానే ప్రధాని మోదీ ఆయన వద్దకు వెళ్లి మీ గొంతు చాలా బలంగా ఉందని, మీరు చాలా బలంగా ఉన్నారని చమత్కరించారు. అనంతరం ప్రధాని మోదీ ప్రసంగించారు.

ఇదిలావుంటే.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం సందర్భంగా పలుమార్లు మైక్ కట్ అయింది. ప్రధాని మోదీ మాట్లాడుతుండగా పలుమార్లు మైక్ ఆగిపోయింది. భారీగా జనం రావడంతో మైక్ కట్ చేసినట్లు తెలుస్తోంది. సభా ప్రాంగణంలో జనం కిక్కిరిసిపోయారు. జనం పెద్దఎత్తున రావడంతో ముందుకు సాగారు. ఒక్కసారిగా జనం ఆడియో కన్సోల్, మైక్ స్టాండ్ పైకి ఎక్కారు. దీంతో మైక్ కట్ అయింది. వెంటనే అప్రమత్తమైన టీడీపీ నేతలు ప్రజలందరినీ వెనక్కి పంపించారు. రెండు సార్లు ప్రజల ముందుకు రావడంతో ప్రధాని ప్రసంగం మధ్యలో మైక్ కట్ అయింది.

Read More సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సమావేశం 

Social Links

Related Posts

Post Comment