విశ్వజనని, మహోన్నత మాతృమూర్తి మదర్ థెరిస్సా జయంతి సందర్భంగా బాపట్ల పట్టణం 1వ వార్డు బేతనీ కాలనీలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆ మహనీయురాలి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన బాపట్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ ఛార్జ్ వేగేశన నరేంద్ర వర్మ.
ఈ సందర్భంగా మాట్లాడిన నరేంద్ర వర్మ సేవ యొక్క ఫలితం సంతృప్తి అంటూ సమాజ సేవకే తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి మదర్ థెరిస్సా. పరాయి దేశం నుండి మన దేశానికి వచ్చి మిషనిరీస్ ఆఫ్ చారిటీ అనే సంస్థ ను స్థాపించి 40 ఏళ్ళ పాటు నా అన్నవాళ్ళు ఎవరు లేని అనాథ లకు, కుష్టు వ్యాధిగ్రస్తులకు సేవ చేసి మానవత్వాన్ని చాటుకున్న నిజమైన మాతృమూర్తి మథర్ థెరిస్సా. అనాథలంటే దేవుడి పిల్లలు వారికి సేవ చేయడం గొప్ప అదృష్టం అంటూ వేలాది మంది జీవితాల్లో వెలుగులు నింపిన ఆ విశ్వజనని ని నోబెల్ బహుమతి, మన దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న అవార్డ్ ఇవ్వడం మనందరికీ గర్వకారణం. తన అసమనమైన సేవా దృక్పథంతో వేలాది మందికి పునర్జన్మ ను ప్రసాదించిన ఆ మహోన్నత మాతృమూర్తి జయంతి సందర్భంగా వారికి నివాళులు అర్పిస్తూ ఆమె సామాజిక సేవ స్ఫూర్తిని మనలో కూడా నింపుకొని పేదలకు అండగా నిలుద్దాం అని నరేంద్ర వర్మ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో సోముల ప్రసాద్, చెన్నూపాటి హైమావతి, బీరం మరియమ్మ, రమాదేవి, నజ్మ, మునగాల మహాలక్ష్మి, కిరణ్, పిట్టా రాజా రావు, సానాల నరసింహ రెడ్డి, షేక్ ఫరీద్, మందపాటి ఆంధ్రయ, కొల్లూరి వెంకట రావు, దార అశోక్, యలవల వెంకటేశ్వర్లు, పరిశ రమేష్ గౌడ్, గేరా చార్లెస్, బొడ్డు గోవింద్, కృష్ణ గౌడ్, భావన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.