Jagan : బీజేపీ బానిస జగన్
షర్మిల ఘాటు వ్యాఖ్యలు
జయభేరి, కడప :
కడప జిల్లాలో జగన్, అవినాష్ రెడ్డిలే లక్ష్యంగా ఏపీపీసీసీ అధినేత్రి షర్మిల బస్సుయాత్ర కొనసాగుతోంది. మతం పేరుతో రాజకీయాలు చేస్తున్న బీజేపీకి జగన్ మోహన్ రెడ్డి బానిస అంటూ షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ ఎప్పుడూ బీజేపీకి వ్యతిరేకంగా ఉండేవారని గుర్తు చేశారు. ఇలాంటి ముస్లింలకు జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బస్సు యాత్రలో షర్మిల ఇంకా ఏమన్నారంటే... "వైఎస్ఆర్ ఎప్పుడూ బీజేపీ వ్యతిరేకి.. మతం పేరుతో గొడవలు సృష్టించేది బీజేపీ.. వైఎస్ఆర్ తనయుడు జగన్ మోహన్ రెడ్డి బీజేపీకి బానిస. అందుకే జగన్ సమాధానం చెప్పాలి.
కడప ఉక్కుపై స్థానిక ఎంపీ అవినాష్ రెడ్డి ఒక్కరోజు కూడా నోరు మెదపలేదు.. కడప-బెంగళూరు రైల్వేలైన్ వైఎస్ఆర్ ఆశయం. జగన్ కు కడప లైన్ అక్కర్లేదు." అని విమర్శించారు. అవినాష్ రెడ్డిని సీబీఐ నిందితుడిగా ముద్ర వేసిందని షర్మిల... జగన్ నిందితుడిగా ఉన్న వ్యక్తికి టికెట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. బాబాయి హత్య విషయంలో జగన్ ఎందుకు మౌనంగా ఉన్నారని మండిపడ్డారు. బాబాయి హత్య కేసులో జగన్ ఎందుకు మౌనం వహిస్తున్నారు.. అసలు నిజాన్ని ఎందుకు దాచిపెడుతున్నారు.. సీబీఐ విచారణ ఎందుకు జరగడం లేదు.. నేరం చేయకపోతే విచారణకు ఎందుకు అడ్డుపడుతున్నారు.. నిందితులను ఎందుకు కాపాడుతున్నారు? వీటికి జగన్ మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలని ఆయన అన్నారు. హత్యా రాజకీయాలను ప్రోత్సహించే వారికి కడప జిల్లా ప్రజలు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. నిందితుడిగా సీబీఐ చెబుతున్న అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చి పోటీ చేయాల్సి వచ్చిందన్నారు. కడప ప్రజలకు అందుబాటులో ఉంటానని... వైఎస్ఆర్ గణానికి సేవ చేస్తానని షర్మిల హామీ ఇచ్చారు.
Post Comment