హత్యా నిందితుడికి మళ్ళీ ఎందుకు పట్టం కడుతున్నారు ?

  • రాముడికి లక్ష్మణుడు ఎలాగో వైఎస్సార్ కు వివేకా అలా ఉండేవాడు. వివేకా చనిపోయి 5 ఏళ్లు అయ్యింది. చంపేశారు.. హత్య చేశారు. గొడ్డలితో 7 సార్లు అతి క్రూరంగా హత్య చేశారు. ఎముకలు,మెదడు బయటకు వచ్చేలా నరికి చంపారు. ఎవరు చంపారో అందరికీ తెలుసు. సిబిఐ  దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. అవినాష్ రెడ్డి నిందితుడు అని అన్ని సాక్ష్యాలు ఉన్నాయి.

హత్యా నిందితుడికి మళ్ళీ ఎందుకు పట్టం కడుతున్నారు ?

జయభేరి, కడప :
జమ్మలమడుగు నియోజక వర్గంలో ఏపీసీసీ చీఫ్& కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పెద్దముడియం మండలం సుద్ధపల్లి గ్రామం నుంచి ప్రచారం ప్రారంభించారు.  షర్మిలా రెడ్డి మాట్లాడుతూ...  రాముడికి లక్ష్మణుడు ఎలాగో వైఎస్సార్ కు వివేకా అలా ఉండేవాడు. వివేకా చనిపోయి 5 ఏళ్లు అయ్యింది. చంపేశారు.. హత్య చేశారు. గొడ్డలితో 7 సార్లు అతి క్రూరంగా హత్య చేశారు. ఎముకలు,మెదడు బయటకు వచ్చేలా నరికి చంపారు. ఎవరు చంపారో అందరికీ తెలుసు. సిబిఐ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. అవినాష్ రెడ్డి నిందితుడు అని అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. ఇవి మేము చెప్తున్నది కాదు..సిబిఐ దగ్గర ఆన్న ఆధారాలు నేను చెప్తున్న. అన్ని వెళ్ళు అవినాష్ రెడ్డివైపే చూపిస్తున్నాయి.  చంపించిన వారికి,చంపిన వారికి ఈరోజుకి శిక్ష లేదు.  హంతకులను కాపాడుతున్నది జగన్ మోహన్ రెడ్డి. అవినాష్ రెడ్డిని అరెస్టు చేయాలని చూస్తే కర్నూల్ లో కర్ఫ్యూ సృష్టించారు. అరెస్ట్ కాకుండా జగన్ రెడ్డి అడ్డం పడ్డాడు.  ఎందుకు హంతకులను వెనకేసుకు వస్తున్నారు జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి.  

హత్యా నిందితుడికి మళ్ళీ ఎందుకు పట్టం కడుతున్నారు ? - అధికారం అడ్డు పెట్టీ అవినాష్ రెడ్డిని కాపాడుతున్నారు ? - ఇది అన్యాయం . అక్రమం. - ఇది అధర్మం.  అన్యాయాన్ని ఎదురించేందుకు నేను నిలబడ్డా. - న్యాయం వైపు నేను నిలబడ్డా మీరు న్యాయం వైపా..? అన్యాయం వైపా? - కొంగుచాచి న్యాయం అడుగుతున్నాం.  మీరు న్యాయం వైపు నిలబడతారని కోరుకుంటున్న. న్యాయం కోసం ప్రతి ఒక్కరినీ ప్రార్థిస్తున్నానని అన్నారు.

Read More Tagoor : ఠాగూర్ ఫార్మా పరిశ్రమ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

Social Links

Related Posts

Post Comment