Rave : రేవ్ పార్టీల బాగోతం..

విచ్చల విడి తనానికి ప్రతిరూపం..

సంస్కృతి మాటున విష సంస్కృతి వికృత రూపం.. రేవ్ పార్టీల బాగోతం..  విచ్చల విడి తనానికి ప్రతిరూపం...
మత్తు మస్త్ మజా సంతోషాలను అందిస్తోంది. నిజానికి మత్తులో మునగడానికి చిన్న పెద్ద వావి వరస అనే తేడా లేకుండా నేటి యువత మధ్యతరగతి జీవితాలు కూడా ఈ రొంపిలో పడిపోయి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాయి... ఇలాంటి నేపథ్యంలో తాజాగా రేవ్ పార్టీల బాగోతం ఇప్పుడు మీడియా ముందుకు వచ్చి ఇంట్లో నాలుగు గోడల మధ్య జరగాల్సిన ఆ పని బజారులో పడి నానా రభస మొదలవుతుంది... దీనిపై 'జయభేరి' అందిస్తున్న కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్ రాజకీయ సమగ్ర విశ్లేషణ...

Rave : రేవ్ పార్టీల బాగోతం..

జయభేరి, హైదరాబాద్ :
తెలంగాణ అంటేనే సాంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక. ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే పండుగలు పర్వదినాలు ముఖ్యంగా చెప్పుకోదగ్గది బతుకమ్మ పండుగ.

అంటే స్త్రీని మనం తల్లిగా అమ్మగా దేవతగా ఆరాధించి పూజించుకునే తెలంగాణ గడ్డమీద ఇలాంటి భక్తి భావం ఉప్పొంగిన చరిత్ర ఈ నేలకు పునర్జీవాన్ని పోసుకొచ్చింది.. ఇదంతా ఎందుకు అని మీరు అనుకోవచ్చు... అసలైన కథ నిన్న మొన్న మీడియాలలో విచ్చలవిడిగా విశ్రుంకలాలు విప్పుతూ క్షణికానందాల కోసం మత్తు మజా కోసం మస్తుగా మజా రాయిల్లు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కాదు రాష్ట్రాలు దాటి ఎల్లలు దాటి రేవ్ పార్టీల పేరుతో విచ్చలవిడిగా సంతోషాన్ని నింపుకుంటున్నారు.

Read More తీన్మార్ మల్లన్నకు గిరిజన సంక్షేమ సంఘం మద్దతు

అసలు ఇలాంటి విష సంస్కృతి మనకి ఎక్కడిది!? సినిమా మోజులో పడి కొంతమంది జీవితాన్ని పని చేసుకుంటే మరి కొంతమంది సెలబ్రిటీలు గా ఉన్నవాళ్లే ఈ రేవ్ పార్టీలలో తమదైన శైలీలలో ఆనందం శృతి మించిన దాఖలాలను మనం చూస్తున్నాం... తాజాగా పరాయి రాష్ట్రంలో రేవు పార్టీలకు వెళ్లిన హేమ అడ్డంగా బుక్ అయిన తర్వాత నన్ను మీడియా వక్రీకరిస్తుంది అని చెప్పి ఒక సెల్ఫీ వీడియో తీసి నేను హైదరాబాదు ఫామ్ అవుసుల్లే ఉన్న అని పోస్ట్ చేసింది... అంతే మన పోలీసు వారు ఊరుకుంటారా వెంటనే ఆ వీడియోను రిలీజ్ చేసి అక్కడ ఉన్న పోలీసులతో మరో వీడియో ఫుటేజ్ ని రిలీజ్ చేసింది.. ఇంకేముంది సదరు ఈ మహాతల్లి ఎక్కడ ఉందో బట్టబయలు అయిపోయింది... అంటే చెరపకురా చెడేవు అన్న మాదిరిగా తానేదో శుద్ధపూసను అని చెప్పుకుంటున్న ఆ నేపథ్యంలోనే అడ్డంగా బుక్ అయిపోయింది సినీనటి హేమ... ఇంకా మిగతా కోలో హీరో శ్రీకాంత్ కూడా ఉన్నట్టు ఆరోపణలు వస్తున్నాయి...

Read More అన్నను హతమార్చిన తమ్ముడు

Rave-Party

Read More తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాల యందు అసెస్ మెంట్ అక్రీడిటేషన్ కౌన్సిల్ (న్యాక్ )సందర్శన

ఈ నేపథ్యంలో హైదరాబాదులో భారీగా డ్రగ్స్ స్వాధీనం జరుగుతున్న ఒకవైపు కన్నడ సీరియల్ నటీనటులు కూడా మోడల్స్ , 75 శాతం పైగా ఏపీ తెలంగాణ వాసులుగా ఇలా రకరకాలుగా బెంగళూరులో జరిగిన రేవు పార్టీలో మత్తులో ఊగిపోతూ జబర్దస్త్ ఎంజాయ్ చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల పరువును బజారుకీర్చారు. ఒకవైపు తెలంగాణ నార్కోటిక్ బ్యూరో అధికారులు మారక దవ్యాలపై ఉక్కు పాదం మోపుతున్నారని చెబుతూనే ఇంకోవైపు బెంగుళూరులో ఎలక్ట్రానిక్ సిటీ పరిధిలో జిఆర్ ఫామ్ హౌస్ లో బర్త్ డే పార్టీ పేరుతో రహస్యంగా రేవు పార్టీ నిర్వహించినట్లు మీడియా ముఖంగా తెలుస్తోంది.. అయితే 12 గంటలకు ముగియాల్సి ఉన్న ఆ తర్వాత కూడా డిజె సౌండ్ లతో హోరెక్కించి రేవు పార్టీలను నిర్వహిస్తున్న నిర్వాహకులను సైతం కేసు నమోదు చేశారు పోలీసులు..

Read More చంద్రమౌళి( CM) కు బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం 

అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా మరి ఇంత విచ్చలవిడిగా మత్తు ఎంజాయ్మెంట్లో మునిగి తేలలేదు.. కానీ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత కూడా తెలంగాణ పరువును పూర్తిగా సినిమా ఇండస్ట్రీ విచ్చలవిడి సంతోషాలను మరొక్కసారి బయటికి చూపించింది. అంటే తెలంగాణకు ఉన్న భౌగోళిక ముఖచిత్రాన్ని పూర్తిగా ప్రశ్నార్ధకంగా మారేలా చేసింది. ఎందుకంటే పోరాటాల పురిటిగడ్డగా పేరు పొందుకున్న తెలంగాణ చరిత్ర సాహిత్యం కవులు కళాకారులు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ నేల తల్లికి ఓ గొప్ప చరిత్ర ఉంది.

Read More క్యాన్సర్ నిర్మూలన ధ్యేయంగా సత్యసాయి సేవా సమితి...

393156-asdrjh

Read More ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

అలాంటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సినీ తారలు మహిళలు ఇంత విచ్చలవిడితనాన్ని కోరుకోవడం దేనికి సంకేతం..!? డబ్బు ఎక్కువగా సంపాదించిన తర్వాత ఆ డబ్బులు ఏం చేయాలో తెలియక ఇలా చేస్తారని కొంతమంది అభిప్రాయాన్ని వెళ్లబుచ్చుతున్నారు. మరి కొంతమంది డబ్బు ఎక్కువగా సంపాదించిన తర్వాత మనిషిలోని రాక్షస రూపం బయటపడుతుంది అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు..
ఏది ఏమైనా తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల పరువును బెంగుళూరులో తాకట్టు పెట్టిన రేవు పార్టీల పుణ్యమా అని ఒక్కొక్కసారి మన కుటుంబంలో ఉన్న ఆడపిల్లలను చూస్తే భయమేస్తోంది..

Read More మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు

Rave-Party-1

Read More నర్సారెడ్డి ఉన్నన్ని రోజులు గజ్వేల్ లో కాంగ్రెస్ పార్టీ బాగుపడదు..!

ఎందుకంటే విష సంస్కృతిలో మనం చదువు నేర్పించాలి అనుకుంటున్నాం... ఇలాంటి ఆషారాలు అలవాట్లు విద్యార్థులకు ముఖ్యంగా అమ్మాయిల్లో ఈ ఆలోచన పుడితే రాను రాను భవిష్యత్ తరాలు పూర్తిగా మత్తులో మజాల పేరిట జీవితాన్ని బోగిపాలు చేసుకుంటారు. 
ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి మత్తు పదార్థాల పై కఠిన చర్యలు తీసుకునేలా అనేక చర్యలు చేపడుతున్న ఈ నేపథ్యంలోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం పూర్తిగా ప్రభుత్వ పనితీరుకు సవాల్గా నిలుస్తోంది...

Read More తాటికల్ ఇసుక రీచ్ బంద్ చేయాలని ఆర్డీవోకు వినతి

bengaluru-rave-party-1716178848

Read More ఘనంగా డాక్టర్ వేణుధ రెడ్డి జన్మదిన వేడుకలు

మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా అని ఆనాడు సిని కవి పాడాడేమో గానీ ఇప్పుడు అదే సినీ కవి ఉంటే మత్తు వదలరా మద్యం చిత్తూ చేయూను కదరా అని రాసేవాడు ఏమో..... ఇలాంటి రేవు పార్టీలను విచ్చలవిడి తనాన్ని ఎక్కడికి అక్కడ కట్టడి చేయకపోతే రానున్న భవిష్యత్ తరాలకు ఇది ఒక వేదికగా మారక తప్పదు..

110299046

ఇలాంటి పార్టీలకు ఇలాంటి సంతోషాలకు అసలు అవకాశం కల్పించకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని పలు అభిప్రాయపడుతున్నారు... సంతోషం సుఖం దుఃఖం ఆనందం ఏదేమైనా శృతి మించకుండా ఉంటే ఆనందంగా సంతోషంగా ఉంటుంది. శృతి మించి మత్తులో రేవు పార్టీల నిర్వహించే నిర్వాహకులను పూర్తిగా కట్టడి కచ్చితంగా చేయాలి... లేకపోతే ప్రతి ఇంటిలోనే ఉన్న ఆడపిల్ల ఇలాంటి విషస్ సంస్కృతి వలలో చిక్కి జీవితాన్ని బలి చేసుకోక తప్పదు ఇది ఒక హెచ్చరికగా భావించి ఇలాంటి వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొని మరొకసారి ఇలాంటి పార్టీలను జరగకుండా చూసుకునే బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది..

- కడారి శ్రీనివాస్ 
కాలమిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, కవి, రచయిత
గాయకులు, సామాజిక ఉద్యమకారులు