Election Commission I ఎలక్షన్ కోడ్... ఎవరికి లాభం.!?

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎలక్షన్ కోడ్ అమలు జరిగి నాలుగు రోజులు కావస్తున్న ఇంకా 55 రోజులు ఎలక్షన్ కోడ్ అమలులో ఉండబోనుంది.

Election Commission I ఎలక్షన్ కోడ్... ఎవరికి లాభం.!?

జయభేరి, హైదరాబాద్ :

తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎలక్షన్ కోడ్ అమలు జరిగి నాలుగు రోజులు కావస్తున్న ఇంకా 55 రోజులు ఎలక్షన్ కోడ్ అమలులో ఉండబోనుంది. ఈ సందర్భంలో ఎలక్షన్ కోడ్ నియమ నిబంధనలు రాజకీయ నాయకులకు వర్తిస్తున్నాయా!? అలాగే సాధారణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారా!? అనే విషయంపై జయభేరి నిఘా సర్వేతో బయటపడిన కొన్ని నిజాలను మీకందించేందుకు నిరంతరం అక్షరాన్ని సంధిస్తూ అందిస్తున్న ‘జయభేరి’ కౌంటర్ కడారి శ్రీనివాస్ సమగ్ర విశ్లేషణలో ఒక్కసారి చదవండి...

Read More కురుమల పోరాటానికి ఎమ్మార్పీఎస్ మద్దతు కావాలి...

ఎలక్షన్ కోడ్ అమలులో జరిగి,నేటికీ ఐదు  రోజులు గడిచింది. 59 రోజులకు గాను ఐదు రోజులు గడిచిన ఇంకా 54 రోజులు ఎలక్షన్ కోడ్ అమలులో ఉంటుంది. ఇది ఎవరికి లాభాన్ని తెచ్చిపెడుతుంది అని ఒకసారి ఆలోచిస్తే.. తెలంగాణ రాష్ట్రంలో అడుగడుగునా ఎలక్షన్ కోడ్ అమలు జరిపిస్తున్న పోలీస్ సిబ్బందికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తూ దీని వెనకాల సాధారణ జనం ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆలోచన చేయాలని ప్రజలు ప్రాధేయ పడుతున్నారు. ఎలక్షన్ కోడ్ అమలులో అనేకమైన నియమ నిబంధనలను తెలియజేస్తూ ఎలక్షన్ చీఫ్ వివరాలను తెలియజేసినప్పటి నుంచి ప్రజల్లో ఒక రకమైన భయాందోళనలు పుట్టుకొస్తున్నాయి. 50 వేల కంటే ఎక్కువగా తీసుకుపోతే పట్టుకుంటారట దానికి అన్ని లెక్కలు చూపిన ఇవ్వరట అనే ఆలోచనతో ప్రజలు నిరంతర ఆర్థిక క్రయవిక్రయాల్లో పూర్తిగా వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. రియల్ ఎస్టేట్లో అనేక రంగాల్లో లక్షల లక్షలు డబ్బులు నగదు రూపంలో చేతులు మారుతున్న అవి కూడా కుంటుపడుతున్నాయి. అలాగే సాధారణ మధ్యతరగతి కుటుంబాల్లో లక్ష రూపాయలను తీసుకెళ్లాలి అని అంటే నానా యాతన పడాల్సి వస్తుంది. ఇది ఇలాగే ఇంకో 50 రోజులు గడిస్తే ప్రజలకు వారి జీవన విధానంలో ఆర్థిక భయాందోళనలు పుట్టుకొచ్చి ప్రభుత్వం మీద వ్యవస్థ మీద పూర్తిగా నమ్మకం పోయే ప్రమాదం పక్కనే పొంచి ఉంది.

Read More నవ వధువుకు పుస్తెమెట్టెలు అందజేతా..

నిజానికి మనం చరిత్ర వెనక్కి వెళితే 30 రోజులు ఎలక్షన్ కోడ్ ఉండే రోజుల్లో ఎలక్షన్ కోడ్ ఉన్న అంతగా పెద్ద పట్టింపు ఉండేది కాదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పరచుకున్న తర్వాత ఈమధ్య కాలంలో ఎలక్షన్ కోడ్ దాదాపు రెండు నెలల కాల పరిమితిని పెంచుతూ ఈ విధంగా చెకింగ్ లు చేయడం నిఘా ఏర్పాటు చేయడం బ్యాంకులపై నర్సరీ పెట్టడం ఇలాంటివన్నీ చేస్తూ ఎవరికి లాభాన్ని చేకూరుస్తున్నారు!? రాజకీయ నాయకులు అధిక మొత్తంలో నగదును తరలింప చేసే విషయంలో పోలీసుల కంటపడేలా చేస్తారా!? ఈ మాత్రం సంగతి తెలిసినా పోలీసులు నడిరోడ్డు మీద కాపలా కాస్తు బార్డర్లో సైనికులు పనిచేస్తున్నారు. అంటే సమాజంలో సగటు మనిషి తన ఆర్థిక అవసరాల కోసం డబ్బులు పట్టుకెళ్తున్న నానా ఇబ్బంది పెడుతూ అనేక సవాలక్ష ప్రశ్నలు వేస్తూ ప్రజల్ని భయ ఆందోళనలకు గురి చేస్తున్నారు పోలీసులు.

Read More కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం

నిజానికి ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కోడ్ రాజకీయ నాయకుల కంటే సాధారణమైన ప్రజలకే ఎక్కువ ఆటంకాన్ని కలిగించే విధంగా ఉంటుంది. మరి రెండు నెలల కాల పరిమితి వరకు ఎలక్షన్ కోడ్ నియమించడం వల్ల అనేక పనులు వాయిదా పడిపోతున్నాయి. దీంతో సగటు మధ్యతరగతి కుటుంబాల్లో అప్పులు రావణులు ఆగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్న దాఖలాలు లేకపోలేదు. అసలు ఎలక్షన్ కోడ్ లో పట్టుకున్న సొమ్ము ప్రజలకు లెక్క చెబుతున్నారా అని ఒకసారి ఆలోచిస్తే గత ఎన్నికల్లో పోలీసులు పట్టుకున్న సొమ్మును రాస్తే ఎన్నికల ప్రధాని అధికారి వివరించారు బాగానే ఉంది. కానీ వర్తమానం ఒకసారి ఆలోచిస్తే నిత్యం ఉరుకుల పరుగుల జీవన విధానంలో భాగ్యనగరంలో కాసులు లేనిదే కడుపు నిండని పరిస్థితి. అలాంటిది ఓ లక్ష రూపాయలు పట్టుకొని రావాలి అంటే అడుగున చెకప్లతో బందిపోటు దొంగలను పట్టుకున్నట్టుగా పోలీసులు ప్రవర్తించే తీరు నిర్దాక్షిణ్యంగా వాళ్లు ప్రవర్తించే పద్ధతి అసలు క్షమించరానిది. వాస్తవానికి మన రాష్ట్రానికి సంబంధించిన పోలీస్ కేడర్ కాదు. బయట రాష్ట్రాల నుంచి వచ్చిన పోలీసు సిబ్బందిచే నిఘా టీములుగా ఏర్పాటు చేసి భారీ కేసులు పెట్టి వాళ్ళు చేసే చెకప్ లు బార్డర్లో కూడా అంతగా చేయరేమో అనేలా అనిపిస్తుంది. ఎక్కడికక్కడ సాధారణ పౌరులను పెద్దలను వృద్ధులను ఆపి మరీ వాళ్లను చెకప్ చేయడం వారిని ఒకంతకు భయానికి గురి చేస్తున్న బాధ్యతగా ప్రజలు సహకరిస్తున్నారు.

Read More యూనియన్ బ్యాంక్ మేనేజర్ పున్న సతీష్ కుమార్ కు బెస్ట్ బ్యాంకర్ అవార్డు 

కానీ పోలీసులు తీరు చూస్తేనే అసలు బయటికి వెళ్లకుండా ఉండేలా భయానికి గురవుతున్నారు. నిజానికి ఓట్ల రద్దు విషయంలో పెద్దపెద్ద కుటుంబాల్లో అంతగా ఆందోళన మనకు కనపడలేదు, అలాగే ఎలక్షన్ కోడ్ నియమ నిబంధనలో పెద్దవాళ్ళకి అంతగా ఈ కోడ్ పట్టదేమో వాళ్ళు ఎలా నగదును తీసుకువెళ్లాలో అలాగే నగదును తీసుకు వెళుతూ ఉంటారు. అక్కడక్కడ పోలీసులు కంటపడి దొరికిపోయే కేసులను కూడా మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఎలక్షన్ కోడ్ లో సామాన్య మధ్యతరగతి ఉన్నత వర్గాల్లోనే ఎక్కువగా ఆర్థిక క్రయవిక్రయాలు చేస్తున్న ప్రజలు పూర్తిగా ఎన్నికల కోడ్ను నియమ నిబంధనలను గుర్తు చేసుకుంటూ భయ బ్రాంతులకు గురవుతూ, ఆయా కుటుంబాల్లో భార్యాభర్తలు నిత్యం గొడవ పెట్టుకుంటూ కాపురాలు విడిపోయే పరిస్థితి దాపురుస్తుంది.
పనిచేస్తే గాని కడుపునిండాని భాగ్యనగర జీవన విధానంలో యాంత్రిక జీవన పయనం అలవాటుగా మారిపోయింది. మరి రెండు నెలల వరకు ఎలక్షన్ కోడ్ అమలులో ఉంది అంటే ఎలక్షన్ కమిషన్ కూడా ప్రజల నుంచి భారీగా డబ్బును వసూలు చేస్తూ మూట కట్టుకోవాలని చూస్తుందా అని పలువురు ఆరోపిస్తున్నారు. 30 రోజులు అంటే ప్రజలు సర్దుకుపోతారు కానీ రెండు నెలల వరకు ఎన్నికల కోడ్ నిబంధన ఉంటుంది అని తెలియగానే చాలామంది తమ తమ వ్యాపారాల్లో క్రయవిక్రయాలను జరపడం నిలిపివేశారు.

Read More గుడికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి 

దీంతో సాధారణ ప్రజలు 50 వేల నుంచి లక్ష రూపాయలు ఇక్కడి నుంచి మరెక్కడికైనా తీసుకుపోవాలి అంటే చాలా ఆందోళనకు గురవుతూ పనులను వాయిదా వేసుకోవడం వల్ల ఆయా కుటుంబాల్లో ఆర్థిక భారం పెరిగిపోయి ఆత్మహత్యలకు పాల్పడే ఆలోచనలు ఆయా కుటుంబాల్లో పురుడు పోసుకుంటున్నాయి. ఎలక్షన్ కమిషన్ నిర్దాక్షిణ్యంగా చెప్పిన నియమావళి ఒక అందుకు మంచిగా నే ఉన్న మధ్య తరగతి సగటు కుటుంబాల్లో పూర్తిగా దయాదాక్షణను మరిచిపోయి ఆయా కుటుంబాల్లో విషాదాన్ని నింపే పరిస్థితి దాపురించింది అని మధ్యతరగతి సాధారణ కుటుంబాల జనాలు బెంబేలెత్తిపోయి శాపనార్ధాలు కూడా పెడుతున్నారు. ఎందుకంటే నిత్యం నగదు రూపంలో జరిగే కొన్ని కొన్ని పనులు కాంట్రాక్టు లేబర్ కూలీలు కూరగాయలు అమ్ముకునే వ్యాపారులు చిరు వ్యాపారులు ఇలా కొన్ని కొన్ని వ్యాపార చిరు వ్యాపార రంగాల్లో ప్రతిరోజు నగదు రూపంలో డబ్బులు క్రయవిక్రయాలకు వినియోగిస్తుంటారు. ఇలాంటి సమయంలో వాటికి సంబంధించిన పేపర్స్ ఒక్కొక్కసారి ఉండకపోవచ్చు. అలాంటి సమయంలోనే పోలీసులు మూకుమ్మడిగా దాడి చేసి పట్టుకోవడం వారిని ఇబ్బందులకు గురి చేయడం కేసులు పెట్టడం ఇవన్నీ ఉన్నత వర్గాల్లో ఆయా కుటుంబాల్లో జరగవు కేవలం సాధారణ మధ్యతరగతి సగటు కుటుంబాల్లోని ఆర్థిక క్రయవిక్రయాలు చేసే వ్యాపారులని టార్గెట్ చేస్తూ ఎన్నికల కోడ్లో ఎక్కువగా సాధారణ జనమే బలైపోయే అవకాశం నూటికి నూరుపాలు కనిపిస్తుంటుంది.

Read More దండోరా దళపతి పాట ఆవిష్కరించిన మందకృష్ణ మాదిగ

ఒకవైపు స్వార్ధ రాజకీయాలు నిత్యం ఊపిరి పోసుకొని నియంతృత్వ పోకడలో పరిపాలన కొనసాగించే నేతలు నిత్యం ధనాన్ని పోగేసుకునే స్వార్థ బుద్ధి జీవులు సంచరించే నేటి సమాజంలో రాజకీయ నాయకులు ఊసరవెల్లిలా రంగులు మార్చే ఇలాంటి స్వార్థపరులను రాజకీయ నాయకులని ఎట్లా పిలవాలి అంటూ ప్రజలు ఆవేశంతో ఊగిపోతున్న ఇలాంటి తరుణంలోనే ఎలక్షన్ కోడ్ రావడం వల్ల సాధారణ ప్రజలతో పాటు విద్యార్థులు యువత వ్యాపారస్తులు చిరు వ్యాపారులు బ్రతకలేమి జీవుడా అంటూ తమకు వచ్చిన పనులను వాయిదా వేసుకుంటున్నారు.
ఇక ఇదిలా ఉంటే రాజకీయ నాయకులు వాళ్లు తమ గోడును వెళ్ళబోసుకుంటున్నారు.

Read More ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్

రెండు నెలలు ఎలక్షన్ కోడ్ ఉన్న తరుణంలో ఎన్నికల రణరంగంలో రెండు నెలపాటు తమ క్యాడర్ను ప్రతి రోజు ఉదయం టీ టిఫిన్ దగ్గర నుంచి రాత్రి బిరియాని మందు మళ్ళీ వాళ్ళకి 500, 1000 రూపాయలు ఖర్చులకు ఇవ్వడానికి లెక్కలు వేసుకుంటే గుండెలు పగిలిపోతున్నాయని రాజకీయ నాయకులు టికెట్ దొరికిన అభ్యర్థులు విలవిలలాడిపోతున్నారు. అసలే ప్రజాస్వామ్యంలో పారదర్శకంగా ఎన్నికలు జరగాలని ఒకవైపు ఎలక్షన్ కమిషన్ చెబుతూ నిర్దాక్షిణ్యంగా సాధారణ జనాల నుంచి డబ్బులను గుంజుకుని నానా ఇబ్బందులకు గురి చేస్తూ ప్రతిరోజు నిత్యం వార్త దినపత్రికల్లో ప్రసారం అవుతున్న ఈ నేపథ్యంలో ఇంకోవైపు టికెట్ పొందిన రాజకీయ అభ్యర్థులు తమ క్యాడర్ ని ఓటర్లను ఎటు వెళ్లకుండా తమ వైపు తిప్పుకోవడానికి రోజుకు లక్షలలో డబ్బులు ఖర్చవడం భరించలేకపోతున్నారు. దీంతో రాజకీయ నాయకుల ఖర్చు పరిమితిని మించి దాటిపోతున్నాయి.

Read More మున్సిపాలిటీ పరిధిలోని 18 వార్డులో అభినందన సభ

అసలు రాజకీయ పార్టీ ఇంతకంటే ఎక్కువగా ఖర్చు చేయొద్దు అని ఎన్నికల కమిషన్ ఒక నియమ నిబంధనను జారీ చేసిన ప్రతిరోజు ఓటర్స్ ను కాపాడుకునే ప్రయత్నంలో వాస్తవ పరిస్థితులను చూస్తే అది మూడోవంతుకే పనికి రాకుండా పోతుంది. అంటే చెప్పేది ఒకటి జరిగేది ఇంకొకటి. మొత్తానికి ఎలక్షన్ కోడ్ ఎవరికి లాభాన్ని తెచ్చిపెట్టింది అంటే ప్రభుత్వానికి ఆదాయాన్ని వనగూర్చే దానిలో ఇది ఒక ప్రాధాన్యత సంతరించుకొని ప్రభుత్వానికి ఆదాయాన్ని కోట్లల్లో సమకూర్చే యాంత్రిక మిషన్ గా మారిపోయింది. రెండు నెలలకాల పరిమితిలో ఎన్ని కోట్లు లభ్యమవుతాయో ఎంత బంగారం బట్టబయలవుతుందో ఎంత డబ్బు ప్రజల నుంచి పోలీసులు పట్టుకుంటారు మనం ముందు ముందు వేచి చూడాల్సిందే. ఇక రాజకీయ నాయకులు గత ఎన్నికల కంటే ఈసారి రెండు నెలల పాటు తమ క్యాడర్ ని కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా కొన్ని కోట్ల రూపాయలను ఖర్చుపెట్టి అవకాశం లేకపోలేదు. రాజకీయ నాయకులకు కంటతడి తెప్పిస్తున్న ఈ ఎలక్షన్ కోడ్ వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా సగటు మనిషి ఆర్థిక జీవన విధానం పై దెబ్బకొడుతూ పూర్తిగా ప్రభుత్వం ఎన్నికల కమిషన్ నిరంకుశంగా నిర్ధాక్షంగా కార్పొరేట్ వ్యవస్థల కింద పనిచేస్తుంది అనే ఆరోపణలను మూటగట్టుకుంటుంది.

Read More నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి 

మొత్తానికి ఎలక్షన్ కోడ్ ప్రభుత్వానికి లాభాన్ని చేకూర్చే విధంగా ఉంటుందని రాజకీయ నాయకులతో పాటు సాధారణ సగటు కుటుంబాల్లో జీవించే కుటుంబ పెద్దలు దుమ్మెత్తి పోస్తున్నారు. ఏదేమైనా ఎలక్షన్ కోడ్ నియమ నిబంధనలు ప్రజాస్వామ్య పరిరక్షణకే ఉంటాయని ఎన్నికల ప్రధాన అధికారి చెబుతున్న మరి ఇంత ఎప్పుడు ఇంత కాలవ్యవధిని చూడలేదని లబోదిబోమంటూ రాజకీయ నాయకులు ప్రజలు మొత్తుకుంటున్నారు.... ఎంత ఏడ్చినా ఎంత విన్నవించినా ఎంత ప్రార్ధించిన దేవుడైన కనికరించి వరం ఇస్తాడో తెలియదు కానీ ఎన్నికల కోడ్ అంటూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేయడం ఒకటి ట్రాఫిక్ నిబంధనలు అంటూ ప్రజలను పీడించడం మరొకటి ఇంకో అడుగు ముందుకేసి ప్రతి విషయంలో ప్రజలను పీడించి పీడించి రక్తం పిలిచే జలగలుగా ప్రతి శాఖ ప్రజలపైనే పడుతూ ప్రజల నుంచి భారీగా నగదును వసూలు చేసే పనులకు శ్రీకారం చుడుతోంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. వీటితోపాటు ప్రధాన ఎన్నికల కమిషన్ కూడా అదే తోవలో నడుస్తూ రెండు నెలల పాటు ఎన్నికల కోడ్ను విధించడం మాటికి తప్పు అంటూ అనేక రాజకీయ పార్టీ నాయకులతో పాటు సగటు కుటుంబాల ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఎన్నికల నియమవలి ఏంటో కానీ ప్రజల ఆర్థిక విధానంలో క్రయవిక్రయాల్లో పూర్తిగా నిలిచిపోయి అప్పుల భారంగా మిగిలిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంది. వారి జీవితాలు అతలాకుతలం అయ్యే పరిస్థితి దాపురిస్తోంది.

Read More తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాల యందు అసెస్ మెంట్ అక్రీడిటేషన్ కౌన్సిల్ (న్యాక్ )సందర్శన

...కడారి శ్రీనివాస్ 
కాలమిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, కవి, రచయిత

Latest News

డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్
జయభేరి, డిండి : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS)కామదేను గౌరారం గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మాదిగ...
తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు నేషనల్ అసెస్ మెంట్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)B++గ్రేడ్ మంజూరు
చంద్రమౌళి( CM) కు బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం 
ఎబివిపి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించినారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం PRTUTS తోనే సాధ్యం 
గుడికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి