BRS : హుజురాబాద్ లో చెల్లని రూపాయి మల్కాజిగిరిలో ఎలా చెల్లుతుంది..
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ పీర్జాదిగూడ నగరానికి ఎన్నో ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేశారని మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా నిలిచి భారీ మెజారిటితో గెలిపించి కేసీఆర్ కు గిఫ్ట్ గా ఇవ్వాలన్నారు.
జయభేరి, మేడిపల్లి:
మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గెలుపే లక్ష్యంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎం.కె.బీ.ఆర్ కన్వీన్షన్ నందు జరిగిన ఉమ్మడి ఘట్కేసర్ మండల బి.ఆర్.ఎస్. సన్నాహక సమావేశంలో ముఖ్య అతిధిగా మాజీ మంత్రి, బి.ఆర్.ఎస్. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, మేయర్లు జక్క వెంకట్ రెడ్డి, సామల బుచ్చిరెడ్డి, బోడుప్పల్ బి.ఆర్.ఎస్. అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, పీర్జాదిగుడా, బోడుప్పల్, పోచారం, ఘట్కేసర్ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మాజీ మంత్రి మాల్లారెడ్డి మాట్లాడుతూ... మల్కాజిగిరి పార్లమెంట్లో రాగిడి లక్ష్మారెడ్డికి భారీ మెజారిటీ ఖాయం.. 20 ఏళ్లుగా ప్రజా సేవలో ఉన్న వ్యక్తి రాగిడి.. బి.ఆర్.ఎస్. ను రెండు జాతీయ పార్టీలు కలిసినా ఏమి చేయలేవు.కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత మోసం చేస్తుందని ప్రజలు ఉహించలేదు. నాలుగు నెలల్లోనే ప్రజలకు అర్ధమైంది.తెలంగాణా అభివృద్ధి పధకాలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం బంద్ చేసింది.కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ కూడా తెలంగాణా ప్రజలకు చేసిందేమీ లేదు.ప్రజలందరూ బి.ఆర్.ఎస్. కు ఓటు వేయాలని పిలుపు.
మల్కాజిగిరి బిఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి రాగిడి మాట్లాడుతూ... నన్ను నమ్మి మల్కాజిగిరి టికెట్ కేటాయించిన కేసీఆర్ కు ధన్యవాదాలు.. తెలంగాణా అన్ని రకాలుగా అభివృద్ధి సాధించిందంటే పదేళ్ల కేసీఆర్ పాలనలోనే.. బీజేపీ, కాంగ్రెస్ మ్యాచ్ ఫిక్సింగ్ లో ఉన్నారు. ప్రజలు గమనించాలి.రాబోయే ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలి.
ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ... హుజురాబాద్ లో చెల్లని రూపాయి మల్కాజిగిరిలో ఎలా చెల్లుతుంది.. 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి హుజురాబాద్ ను అభివృద్ధి చేసింది లేదు.ఒక్కరోజు కూడా బొట్టు పెట్టని ఈటల నేడు హిందుత్వం గురించి మాట్లాడుతున్నాడు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మన కేసీఆర్, కేటీఆర్ వెంట్రుక కూడా పీకలేరు..బీజేపీ తో కుమ్మక్కై కావాలనే మల్కాజిగిరి లో కాంగ్రెస్ నుండి డమ్మీ అభ్యర్థి సునీత మహేందర్ రెడ్డిని నిలబెట్టారు. బి.ఆర్.ఎస్. కార్యకర్తలు అందరూ దైర్యంగా ఉండి పార్లమెంట్ ఎన్నికల కోసం కష్టపడాలి.మల్కాజిగిరి లో రాగిడి లక్ష్మారెడ్డిని గెలిపించాలి.
మేయర్ జక్క వెంకట్ రెడ్డి మాట్లాడుతూ... మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ పీర్జాదిగూడ నగరానికి ఎన్నో ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి చేశారని మల్కాజ్గిరి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా నిలిచి భారీ మెజారిటితో గెలిపించి కేసీఆర్ కు గిఫ్ట్ గా ఇవ్వాలన్నారు.
Post Comment