Brs - Bjp : బిఆర్ఎస్.. బిజెపి పొత్తు కుదరబోతుందా..!?

'జయభేరి' ధారాళంగా అందిస్తున్న వరుస కథనాలు రోజుకో మలుపు తిరుగుతున్న రాజకీయాల పరిస్థితి చూస్తే బిఆర్ఎస్.. బిజెపి రెండు కలవబోతున్నాయని సంకేతాలుకు ఊతమిస్తూ కాంగ్రెస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు ఇవ్వాళ దుమారాన్ని రేపుతున్నాయి...

Brs - Bjp : బిఆర్ఎస్.. బిజెపి  పొత్తు కుదరబోతుందా..!?

జయభేరి, హైదరాబాద్ :

తెలంగాణ రాష్ట్రంలో గత కొంతకాలంగా పార్టీలు మారుతున్న నేతలపై వరుస కథనాలు 'జయభేరి' ధారాళంగా అందిస్తున్న రోజుకో మలుపు తిరుగుతున్న రాజకీయాల పరిస్థితి చూస్తే బిఆర్ఎస్.. బిజెపి రెండు కలవబోతున్నాయని సంకేతాలుకు ఊతమిస్తూ కాంగ్రెస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు ఇవ్వాళ దుమారాన్ని రేపుతున్నాయి... దీనిపై దాసోజు శ్రవణ్ ఘాటుగా కామెంట్ చేశారు... ఈ విషయాలపై 'జయభేరి' కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్ సమగ్ర రాజకీయ విశ్లేషణ...

Read More నవ వధువుకు పుస్తెమెట్టెలు అందజేతా..

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు వలస పక్షులు లాగా మారుతున్న ఈ సందర్భంలో సికింద్రాబాద్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా నామినేట్ చేసిన దానం నాగేందర్ పార్టీ ఎందుకు మారాడు క్లారిటీగా చెప్పారు... గతంలో అంటే శాసనసభ ఎన్నికల కంటే ముందు బిఆర్ఎస్ తో బిజెపి కలవబోతుంది అని స్వయంగా కేటీఆర్ఏ చెప్పినట్టు దానం నాగేందర్ చేస్తున్న కామెంట్లు సర్వత్ర ఆసక్తిని కలిగించేస్తున్నాయి... ఇక దీనిపై దాసోజు శ్రవణ్ కాంగ్రెస్ ఉప్పు తిని తిని చేదెక్కి కెసిఆర్ గూటికి చేరిన తరువాత కరెన్సీ కట్టలు కాశపడ్డాడు తెలియదు కానీ మొత్తానికి కేసీఆర్ భజన చేస్తూనే కేటీఆర్ అలా అన్నాడు అంటే తాను ముక్కు చెవులు కోసుకుంటాను అని చెప్పడం దేనికి సంకేతం!?

Read More డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్

రాష్ట్ర రాజకీయాల్లో పరిస్థితి గమనిస్తే పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న ఈ సమయంలోనే కవిత లిక్కర్ కేసులో అరెస్ట్ జైల్లో ఉంటూ మళ్లీ సుప్రీంకోర్టులో తన కొడుకు పరీక్షలు జరుగుతున్నా నేపథ్యంలో బెయిల్ కావాలని చెప్పి కోరుకున్న విషయంపై త్వరలో బెయిల్ రావడం లేదా అనే విషయం ఉన్నందున ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి... నిజంగా కవితకు బెయిల్ వస్తే కనుక కచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ బీజేపీతో పొత్తు కుదుర్చుకున్నట్టే... ఇక ఇదే విషయాన్ని దానం నాగేందర్ కుండ బద్దలు కొట్టినట్టు చెప్పి ఆ కారణం చేతనే కాంగ్రెస్ గూటికి చేరుతున్నాను అని చెప్పడం నిజంగా తెలంగాణ ప్రజలు ఇలాంటి నాయకులు నమ్మొచ్చా అని ఆలోచిస్తే.... 
ముమ్మాటికి నమ్మకూడదు అనే జవాబు తప్పకుండా తెలంగాణ ప్రజల్లో నుంచి వస్తోంది.. ఎందుకంటే ఆ పార్టీలో ఉండి అనేక అధికారాల్లో అనుభవించి అధికారం పోగానే ఆరోజున ఈయన ఇలా అన్నాడు అలా అన్నాడు అని చెప్పడం ఏ గూటికి వెళ్తే ఆ పాట పాడడం రాజకీయ నాయకులకు పరిపాట అయిపోతుంది... వినేపద్యంలో అధికార పార్టీ కాంగ్రెస్ ఉన్నందున రేపు కాంగ్రెస్ పార్టీలోని నేతలు కూడా తనతో ఇలా అన్నారని పార్టీ ఒకవేళ మారితే కాంగ్రెస్ లొసుగులను కూడా బయటపెట్టేసే అవకాశం ఉంటుంది కదా....
దాసుసు శ్రవణ్ కుమార్ ఎంతోకాలంగా కాంగ్రెస్ లో ఉంటూ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని సేవ చేసిన అక్కడ అవకాశాలు రాకపోవడంతో కెసిఆర్ పంచన చేరిన అదే సంవత్సరంలో కెసిఆర్ అధికారాన్ని కోల్పోవాల్సి వచ్చింది...

Read More గద్దర్ పై బండి సంజయ్ చేసిన అనుచిత వాఖ్యలను ఖండిస్తున్నాం 

ఏం చేస్తాం కర్రు కాల్చి తనే వాత పెట్టుకున్నట్టుగా అయింది.. చేసేది ఏం లేక ముందు పోతే నుయ్యి వెనక పోతే గొయ్యి అన్న మాదిరిగా సచ్చినట్టు బి ఆర్ ఎస్ పార్టీలోనే ఉంటూ వస్తున్న లీకులను అడ్డుకోవడానికి ముక్కు చెవులు కోసుకుంటానని చెప్పడం తెలంగాణ ప్రజల్ని మభ్య పెట్టడమే... వాస్తవానికి ప్రశ్నలు వేసేది రాజకీయ నాయకులే ఆ ప్రశ్నకు మళ్లీ ప్రశ్నను విసిరేది అదే రాజకీయ నాయకులే.... మొత్తానికి తెలంగాణ ప్రజలను తికమకలో పెట్టి ఎవరు నీతి నిజాయితీగల నాయకులు అర్థం కాని పరిస్థితుల్లో ఏదో ఒక పార్టీకి ఓటు వేస్తాన్లే అన్న ఆలోచనకు రావాల్సి వస్తుంది...

Read More మున్సిపాలిటీ పరిధిలోని 18 వార్డులో అభినందన సభ

ఇక తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలు త్వరలో రాబోతున్న నేపథ్యంలో రాజకీయంగా ఇలాంటి పరిణామాలు చోటుచేసుకుంటున్న సందర్భంలో కారు పార్టీ పూర్తిగా ఖాళీ అయ్యే ప్రమాదం కనిపిస్తోంది... అధికారం ఉన్నన్ని రోజులు కేసీఆర్ పంచన చేరిన ఈ నాయకులే ఇప్పుడు అదే పార్టీలోని లోసుగులను చెబుతూ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన రోజే టికెట్ ఆశించి మళ్లీ అధికారం కోసం ప్రజల్లోకి వచ్చిన ఇలాంటి నాయకులను ప్రజలు నిలబెడతారు ఓడిస్తారు అది ప్రజాభిప్రాయానికి వదిలేయాలి... ఏకంగా మాజీ సీఎం అధికారం కోల్పోయిన తర్వాత ఫామ్ హౌస్ నుంచి బయటికి వచ్చి పొలం బాట పట్టడం రైతుల గురించి మాట్లాడడం తులం బంగారం గురించి మాట్లాడడం నిజానికి ధర్నాలు చేయొద్దు ప్రతిపక్షాలు ఉండొద్దు అనుకునే ఆలోచనలతో మిగిలిన మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని ప్రతిపక్షంలో కూర్చుని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాడు అర్థం కావడం లేదు... ఇదే విషయాన్ని అధికార పార్టీ కాంగ్రెస్ ప్రస్తావిస్తూ సీఎం రేవంత్ రెడ్డి మొత్తానికి ఫామ్ హౌస్ నుంచి బయటికి వచ్చేలా ప్రజలు నిర్ణయించాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.... ప్రతిపక్ష పార్టీ అంటే కనీసం ఆ బాధ్యత ఉండాలి సమస్యలు లేవనెత్తి ప్రభుత్వానికి చూపితే ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపడుతుంది అని చురకలు అంటించాడు...

Read More మత్తుపదార్థాల అవగాహన కార్యక్రమం 

మొత్తానికి త్వరలో బిజెపి పార్టీ బీఆర్ఎస్ తో కలవబోతుందా అనే అన్ని ప్రశ్నలకు సమాధానం మరో రెండు మూడు రోజుల్లో సుప్రీంకోర్టులో కవిత మెయిల్ పిటిషన్ పాస్ అవుతుందో లేదో అన్న విషయం మీదనే పూర్తిగా ఆధారపడి ఉంది... ఒకవేళ కవిత ఒక బెయిల్ దొరికితే కచ్చితంగా బిఆర్ఎస్ పార్టీ బిజెపికి సపోర్ట్ చేస్తున్నట్టే లెక్క అని తెలంగాణ ప్రజలు గుసగుసలు పెట్టుకుంటున్నారు... ఒకవేళ బెయిల్ రాకపోతే ఈ మాట అవాస్తవమేనని కేవలం దానం నాగేందర్ రాజకీయ లబ్ధి కోసమే ఇలా మాట్లాడాడని అనుకోవచ్చని తెలంగాణలో రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..
మొత్తానికి రాజకీయం ఏమో తెలియదు గానీ ముక్కు చెవులు కోసుకుంటా అనే మాట వినపడుతున్నప్పుడు మరో ఇతిహాసానికి తెరతీస్తున్న టిఆర్ఎస్ నాయకులు ఏం చేయాలో అర్థం కాక ఇలా ముక్కు చెవులు కోసుకుంటా అంటున్నారు అని జనాలు చురకలంటిస్తున్నారు...

Read More తీన్మార్ మల్లన్నకు గిరిజన సంక్షేమ సంఘం మద్దతు

- కడారి శ్రీనివాస్ 
కాలమిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, కవి, రచయిత
గాయకులు, సామాజిక ఉద్యమకారులు

Read More వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి

Latest News

డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్
జయభేరి, డిండి : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS)కామదేను గౌరారం గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మాదిగ...
తెలంగాణ రాష్ట్ర గిరిజన గురుకుల మహిళా డిగ్రీ కళాశాలకు నేషనల్ అసెస్ మెంట్ అక్రెడిటేషన్ కౌన్సిల్ (న్యాక్)B++గ్రేడ్ మంజూరు
చంద్రమౌళి( CM) కు బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం 
ఎబివిపి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించినారు.
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం PRTUTS తోనే సాధ్యం 
గుడికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి