కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి కుంటుపడిన విద్యా వ్యవస్థ

కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి కుంటుపడిన విద్యా వ్యవస్థ

జయభేరి, హైదరాబాద్‌, జూన్ 13 :
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి రాష్ట్రంలో వ్యవసాయం మాత్రమే కాదు విద్యా వ్యవస్థ కూడా కుంటుపడిందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ (KTR) విమర్శించారు. వ్యవసాయ రంగం పట్ల నిబద్ధత లేదని, విద్యావ్యవస్థ పట్ల బాధ్యత లేదని మండిపడ్డారు. వానాకాలం సీజన్ మొదలవుతున్నా రైతుభరోసా అమలు విషయంలో ప్రణాళిక లేదని దుయ్యబట్టారు.

పాఠశాలలు ప్రారంభమైనా పాలకులు నిర్లక్ష్యం వీడడం లేదని చెప్పారు.అరకొర రుణమాఫీ, ఆచూకీ లేని రైతు భరోసా, అందని రైతుబీమా, ప్రాజెక్టులు పడావు పడ్డాయని విమర్శించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో పండగలా మారిన వ్యవసాయం, ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో తిరోగమనం వైపు పయనిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. వెయ్యికిపైగా సంక్షేమ గురుకులాల ఏర్పాటుతో ఎవరెస్టు శిఖరం అధిరోహించిన తెలంగాణ విద్యావ్యవస్థ ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో అవస్థలు ఎదుర్కొంటున్నదని చెప్పారు.

Read More గుడికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి 

Views: 0