ఏబీవీపీ కార్యకర్తలను ముందస్తు అరెస్టులు
జయభేరి, దేవరకొండ :
హైదరాబాద్ లో జరుగుతున్న ప్రపంచ విశ్వసుందరి సదస్సులో భాగంగా సోమవారం రోజున నాగార్జునసాగర్ బుద్ధవనం పర్యటన ఉండడంతో ఏబీవీపీ దేవరకొండ కార్యకర్తలను ఉదయం 4:00 గంటలకు అక్రమ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ ఉమ్మడి నల్గొండ జిల్లా హాస్టల్స్ కన్వీనర్ యలమల గోపీచంద్ మాట్లాడుతూ తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రపంచ విశ్వసుందరి సదస్సునీ అడ్డుకోవడానికి ఏబీవీపీ ఎటువంటి పిలుపును ఇవ్వకముందే అర్థంపర్థం లేని అక్రమ అరెస్టులు చేసి పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం అక్రమా అరెస్టులు చేయించడం ప్రభుత్వ చేతగానితనానికి అద్దం పడుతుంది సీఎం రేవంత్ రెడ్డి కాళ్లు కాలిన పిల్లి లాగా చీటికిమాటికి ఏబీవీపీ కార్యకర్తలను అరెస్ట్ చేయడం ఆయన మతిస్థిమితం కోల్పోయినట్టుగా కనిపిస్తుంది. ఈ పిచ్చి పనులును మానేసి తెలంగాణ రాష్ట్ర ప్రజల సమస్యలను పట్టించుకోవాలని అన్నారు. తెలంగాణ పోలీస్ యంత్రాంగం విషయం తెలుసుకొని అరెస్టు చెయ్యాలని తెలియజేశారు.
Post Comment