Land : రీ-సేల్‌కు ల్యాండ్ మార్క్‌గా యనమల డెవలపర్స్
- ఘనంగా యనమల రియల్ స్టార్ అవార్డ్స్ కార్యక్రమం..
- రియల్ విజేతలకు అవార్డులను అందించిన ప్రముఖ సినీతార, బిగ్‌బాస్ ఫేం అశ్వినీ శ్రీ
- కొనిపించడమే కాదు మళ్లీ ఆ ప్రాపర్టీని అమ్మించే భాధ్యత కూడా మాదే.. -యనమల డెవలపర్స్ సీఎండీ యనమల రాజు
జయభేరి, హైదరాబాద్ :
ఈ తరం యువతకు రియల్ ఎస్టేట్ మంచి భవిష్యత్‌గా మారిందని, ఈ రంగంలో ఎన్నో స్పూర్తిదాయక వ్యక్తిత్వాలను చూడొచ్చని ప్రముఖ సినీతార, బిగ్‌బాస్ ఫేం అశ్వినీ శ్రీ తెలిపారు. ప్రముఖ రియల్ సంస్థ ‘యనమల డెవలపర్స్’ ఆధ్వర్యంలో సోమవారం గచ్చిబౌలిలోని రాడిసన్ హోటల్ వేదికగా ఏర్పాటు చేసిన ‘యనమల రియల్ స్టార్ అవార్డ్స్’ కార్యక్రమంలో సినీతార అశ్వినీ శ్రీ పాల్గొని ఈ రంగంలో అద్భుతంగా రాణించిన వారికి అవార్డులను ప్రధానం చేశారు.

ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు డా.గంప నాగేశ్వర్ రావు, రియల్ ఎస్టేట్ కోచ్-ట్రైనర్ సింగిరెడ్డి నిరంజన్ పాల్గొని రియల్ ఎస్టేట్ ఔత్సాహికులకు అవగాహాన కల్పించారు. ఈ సందర్భంగా యనమల డెవలపర్స్ సీఎండీ యనమల రాజు మాట్లాడుతూ., ప్రస్తుత తరుణంలో రియల్ ఎస్టేట్ అంటే ఎలాగోలా ప్లాట్లు కొనిపించి చేతులు దులుపుకుంటున్నారని, అలా కాకుండా కస్టమర్లను ప్లాట్లు కొనిపించడమే కాకుండా అవసరమైన సమయంలో వారి ప్లాట్లను అమ్మి పెట్టే భాధ్యత కూడా తామే తీసుకుంటున్నామని అన్నారు. ఇలాంటి వినూత్న ప్రయత్నంలో ఇన్వెస్టర్లు, కస్టమర్లకు అత్యున్నత సేవలందిస్తూ వారి భవిష్యత్‌కు మంచి బాట వేసుకుంటున్న 25 మందిని ఎంపిక చేసి యనమల రియల్ స్టార్ అవార్డ్స్‌తో సన్మానించామని అన్నారు.
నగరంలోని రియల్ ఎస్టేట్ రంగంలో రీ-సేల్‌కు ల్యాండ్ మార్క్‌గా తమ సంస్థ మారిందని, ఈ రంగంలో తమకున్న సుధీర్ఘమైన అనుభవంతో అటు కస్టమర్లకు, తమ సంస్థ వారధులకు ఆర్థిక వెసులుబాటుతో పాటు భవిష్యత్‌లో లాభాలను చేకూర్చే రియల్ ప్రణాళికలతో ముందుకు పోతున్నామని పేర్కొన్నారు. యనమల డెవలపర్స్ 2050 విజన్‌లో భాగంగా 10 లక్షల ప్లాట్లు అమ్మడంతో పాటు 20 లక్షల మందికి తోడ్పాటునందిస్తూ, వెయ్యి మంది మధ్య తరగతి కుటుంబాల వారికి కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. తమ ప్రయత్నానికి ఈ అవార్డులే నిదర్శనమని, ఈ విజేతలే సాక్ష్యాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు రజనీ సాయిచంద్, పులిమామిడి నారాయణ, చొక్కారపు వెంకటరమణ, డా.చంద్రకాంత్ రావు, డా.పద్మజలతో పాటు సంస్థ డైరెక్టర్ యనమల సిరి, ఎండీలు సునీల్ ఆర్య, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.

యనమల డెవలపర్స్ గురించి:
రియల్ ఎస్టేట్ మార్కెట్ విలువ కన్నా దాదాపు 30 శాతం తక్కువ ధరకే అత్యంత విలువైన స్థలాలను అందించే లక్ష్యంతో యనమల డెవలపర్స్ సేవలందిస్తుంది. మధ్య తరగతి కుటుంబాల భవిష్యత్‌కు భరోసాను అందించాలనే ఆలోచనతో వారికి అనువైన ఆఫర్లతో విభిన్న ప్రాజెక్టులను చేపట్టి రియల్ రంగంలో అగ్రగామిగా పునాదులను వేసుకుంది. సంస్థకు వచ్చే లాభాల్లో 5 శాతం వాటాను ‘హ్యప్పీ ఫౌండేషన్’ పేరుతో సమాజహితమైన సేవాకార్యక్రమాలను నిర్వహిస్తూ తమవంతు భాధ్యతను నిర్వర్తిస్తున్నారు. రానున్న రెండేళ్లలో రెండు తెలుగు రాష్ట్రలాల్లో రియల్ రంగ అగ్రగామిగా అన్ని రకాల సేవలను అందించడానికి సిద్దంగా ఉంది.


