గౌడవల్లిలో కుక్కల స్వైర విహారం
వాహనాల వెంటపడి పరుగుపెట్టిస్తున్న వీధికుక్కలు... గాయాలపాలవుతున్న చిన్నారులు, వాహనదారులు
జయభేరి, మేడ్చల్ : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో వీధికుక్కలు ప్రజలను తీవ్రభయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. పగలురాత్రి తేడా లేకుండా గుంపులు, గుంపులుగా రోడ్లపై తిరుగుతూ చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు, సైకిల్, ద్విచక్రవాహనదారులను వెంబడించి పరుగుపెట్టిస్తున్నాయి.
Read More BRS I మీకు మీరే.. మాకు మేమే.!?
తీవ్ర గాయాలైన బాలుడిని చికిత్స నిమిత్తం నగరంలోని ఆసుపత్రికి తరలించారు. గ్రామంలోని రైల్వే స్టేషన్ సమీపంలోని కిరణ దుకాణానికి బీహార్ కు చెందిన మహిళ తన కుమారుడితో కలిసి వచ్చింది. ఇదే సమయంలో అటువైపు వచ్చిన వీధి కుక్క ఒక్కసారిగా ఇద్దరిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. స్థానికులు దాడికి పాల్పడిన కుక్కను వెంబడించి కొట్టి చంపేశారు.
Read More Telangana 26th I భద్రతకు భరోసా ఏది!?
Views: 0


