చంద్రమౌళి( CM) కు బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం 

కుల సంఘాలలో రాణిస్తూ కులానికి సేవ చేయాలి 

చంద్రమౌళి( CM) కు బీసీ సంఘం ఆధ్వర్యంలో ఘన సన్మానం 

జయభేరి, దేవరకొండ : దేవరకొండ పట్టణ పద్మశాలి సంఘం నూతన సహాయ కార్యదర్శిగా ఏకగ్రీవంగా నియమితులైన మాకం చంద్రమౌళి(CM)  ని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం రిటైర్డ్ ఉద్యోగస్తుల భవనంలో శాలువాతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ కుల సంఘంలో ఎన్నిక కావడం గొప్ప విషయమని తెలిపారు. భవిష్యత్తులో సైతం మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కులానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని కుల సంఘాలలో ఎన్నిక కావడం తోపాటు సమాజంలో మంచి గుర్తింపు గౌరవం దక్కుతాయని అన్నారు. కుల సమాజానికి సేవ చేసేటువంటి అదృష్టం కలగడం గొప్ప విషయం అని తెలిపారు.

Read More అంతర్రాష్ట్ర గంజాయి విక్రెతల ముఠా అరెస్ట్... భారీగా గంజాయి స్వాధీనం

మాకం చంద్రమౌళి(సిఎం) అటు ఆధ్యాత్మిక రాజకీయ బీసీ కుల సంఘాలలో తనదైన ముద్ర వేస్తూ సమాజానికి సమయాన్ని కేటాయిస్తూ సంఘానికి పనిచేస్తూ సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను సంపాదించారని కొనియాడారు. చంద్రమౌళి(సీఎం) మరిన్ని పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో చొల్లేటి భాస్కరాచారి ,కూరెళ్ళ కృష్ణమాచారి , లావుడి భాష ,అంకం చంద్రమౌళి, రాములు యాదవ్, ముసిని వీరయ్య, సురేష్ ,కోటేష్ ,రఘుపతి, పెద్దన్న ,కోటయ్య, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Read More నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న డీసీసీ అధ్యక్షులు నర్సారెడ్డి