తాటికల్ ఇసుక రీచ్ బంద్ చేయాలని ఆర్డీవోకు వినతి

తాటికల్ ఇసుక రీచ్ బంద్ చేయాలని ఆర్డీవోకు వినతి

 జయభేరి, దేవరకొండ : దేవరకొండ మండలం తాటికొల్ గ్రామపంచాయతీ పరిధిలోని వాగులో ఇసుక రీచ్ కు ప్రభుత్వం ఇచ్చిన అనుమతిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దేవరకొండ RDO  కి తాటి కోల్ గ్రామస్తులు సోమవారం వినతిపత్రం ఇచ్చారు. గతంలో కూడ 2018లో TSMDC  ప్రైవేట్ వ్యక్తికి ఇసుక రవాణ కోసం అనుమతి ఇవ్వడంతో గ్రామస్తులు ఏకమై అడ్డుకోవడం జరిగింది.

తాటి కోల్ వాగు నుండి పెద్ద ఎత్తున ఇసుక తరలించడంతో భూగర్భ జలాలు ఎండిపోవడం జరుగుతుందని, వాగు మీద ఆధారపడి వ్యవసాయం చేస్తున్న రైతులు రోడ్డు మీద పడే ప్రమాదం వుందని ఆందోళన వ్యక్తం చేశారు.

Read More Auto I షౌకత్ గ్యారేజ్

IMG-20250310-WA0739

Read More Telangana I యువత ఆలోచన విధానం..!

అలాగే గ్రామ ప్రజలకు సాగు,  త్రాగు నీటికి ప్రధాన నీటి వనరు అయిన వాగులో ఇసుక రవాణా చేస్తే భూగర్భ జలాలు తగ్గి తీవ్ర కరువు పరిస్థితులు ఎదుర్కోవల్సి వస్తున్నందున ఇసుక రవాణాను వెంటనే నిలిపి వేయాలని గ్రామస్తులు ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు ఈ కార్యక్రమంలో తాటి కోల్ గ్రామస్తులు పాల్గొన్నారు.

Read More Telangana I పేట ఎవరి సొంతం..!?

Views: 0