యువతకు వరం వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం

  • సెట్విన్‌ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 450 విద్యార్థులకు పరీక్షలు
  • పరీక్షలను పరిశీలించిన సెట్విన్ ఎం.డి వేణుగోపాల్ రావు

యువతకు వరం వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం

జయభేరి, మేడిపల్లి :
తెలంగాణ యూత్ సర్వీసెస్ ఆధ్వర్యంలో పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సెట్విన్ సెంటర్ లో వివిధ వృత్తి, విద్యా, నైపుణ్య కోర్సులలో శిక్షణ పొందిన విద్యార్థులకు నిర్వహించిన పరీక్షలు, వ్రాయు విధానాన్ని సెట్విన్ ఎం.డి వేణుగోపాల్ రావు, మేడిపల్లి సెంటర్ ఇంచార్జ్ వనజ కలిసి పరిశీలించారు.

సెట్విన్ శిక్షణ కేంద్రంలో కంప్యూటర్, బ్యూటిషియన్, ఫ్యాషన్ డిసైనింగ్, ఏసీ, ఫ్రిడ్జ్, మొబైల్ రిపేరింగ్, మగ్గం వర్క్స్, జ్యుట్, పేపర్ బ్యాగ్ మొదలైన కోర్సులలో శిక్షణ పొందిన నగరంలోని వివిధ కేంద్రాలలో శిక్షణ పొందిన సుమారు 450 మంది విద్యార్థిని, విద్యార్థులు పాల్గొని ఇక్కడ సెంటర్ లో పరీక్షలు రాస్తున్నారని వనజ తెలిపారు. 

Read More ఎబివిపి ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించినారు.

6ccf90b3-e07b-411c-96a9-8cbcc28eea94.jpge

Read More జోరుగా మట్టి దందా... బేస్ మెంట్ పేరిట మట్టి విక్రయాలు...

3 రోజుల పాటు జరిగే ఈ పరీక్షల నిర్వహణకు విద్యార్థులకు అవసమైన మౌళిక వసతులు కల్పించామని, పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్ధులకు సర్టిఫికేట్ అందజేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. వచ్చే వారం నుండి కొత్త బ్యాచ్ లకు శిక్షణ తరగతులు ప్రారంభించడం జరుగుతుందని నగరంలోని నిరుద్యోగ యువతీ యువకులు, మహిళలు ఆసక్తి కలిగిన వారు అవకాశాన్ని వినియోగించుకొని వృత్తివిద్యా, నైపుణ్య కోర్సులలో శిక్షణ పొంది తాము ఎంచుకున్న రంగాలలో ఉన్నత శిఖరాలు అధిరోచించాలన్నారు. కోర్సులు, ఇతర వివరాల కోసం సంప్రదించగలరు. పీర్జాదిగూడ సెట్విన్ సెంటర్ నెంబర్ : 7207816959

Read More ఏబీవీపీ కార్యకర్తలను ముందస్తు అరెస్టులు

18e77f51-19b2-4dec-9373-e64ded013e90

Read More బ్లాస్టింగ్ చేస్తేనే ఆ టన్నెల్ తవ్వగలం!

Views: 4

Related Posts