బదిలీపై వెళ్తున్న మహిళ ఎస్.ఐ ను సన్మానించిన పోలీసులు..

  • శామీర్ పేట్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహించిన ఎస్.ఐ. హారిక..  
  • ఇటీవలే శంషాబాద్ కు బదిలీ.. 
  • హారిక శామీర్ పేట్ ప్రజలకు అందుబాటులో ఉండి  అందించిన సేవలు మరువలేనివి.. 
  • అందరి హృదయాల్లో మర్చిపోని ముద్రవేసిన మహిళా అధికారిణి.. 

బదిలీపై వెళ్తున్న మహిళ ఎస్.ఐ ను సన్మానించిన పోలీసులు..

జయభేరి, శామీర్ పేట్, జూన్ 28 : 
విధి నిర్వహణలో భాగంగా ఏ మాత్రం వెనకడుగు వేయకుండా నిత్యం రాత్రి పగలు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలందించిన ఎస్.ఐ. హారికను షామీర్ పేట్ సిఐ  శ్రీనాథ్, ఎస్.ఐ సోమిరెడ్డి, ఎ.ఎస్.ఐ  రమేష్, సిబ్బంది కలిసి శాలువాతో సన్మానం చేసి ఘనంగా వీడ్కోలు పలికారు. అనంతరం శామీర్ పేట్ సీఐ శ్రీనాథ్ మాట్లాడుతూ..  హారిక శామీర్ పేట్ పోలీస్ స్టేషస్ సిబ్బందితో పాటు, ప్రజలతో సానుకూలంగా మాట్లాడి సమస్యలు పరిష్కారం చేస్తూ అందరి హృదయాలలో మంచి స్థానం దక్కించుకుంది అన్నారు.. 

అనంతరం ఎస్ఐ హారిక మాట్లాడుతూ.. నాకు మొదట పోస్టింగ్ మాదాపూర్ లో వచ్చింది.. ఆ తర్వాత షామీర్ పేట్ కు బదిలీ అయ్యాను..  మొదట నగర శివారు ప్రాంతం కదా ఎలా ఉంటుందొ అన్ని కొంచెం కంగారు పడ్డాను..  కానీ ఇక్కడ ఉన్న స్టాప్, స్థానిక ప్రజలు వారి మంచితనాన్ని ఎప్పటికీ మరువలేను.. నిజానికి ఈ పోలీస్ స్టేషన్ వదిలి వెళ్లాలంటే  చాలా బాధగా ఉంది..  అయినా సరే ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించవలసిన బాధ్యతగా శంషాబాద్ కు వెళ్తున్నానని తెలిపారు.. కాగా బదిలీపై వెళ్తున్న ఎస్.ఐ హారిక అతి తొందరలో సీఐగా బాధ్యతలు తీసుకొని మళ్లీ ఇదే పోలీస్ స్టేషన్ కు  రావాలని షామీర్ పేట్ మండల ప్రజల తోపాటు పోలీస్ సిబ్బంది కోరుకున్నారు..

Read More Election Bonds I సుప్రీం ఆదేశం.. ఎన్నికల బాండ్లు బయట పెట్టాల్సిందే..

Untitledrr

Read More Telangana I పేట ఎవరి సొంతం..!?

Views: 3