Vemula Veeresham I నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తా.. రాష్ట్రంలోనే డెవలప్‌ లో ఆదర్శ నియోజికవర్గంగా తీర్చిదిద్దుతా…

కంటికి రెప్పలా ప్రజలను కాపాడుకుంట… నాటి గడీల పాలనను అంతం చేసి.నేడు ప్రజాపాలనకు పట్టం కట్టిన ప్రజల అభివృద్ధే నా లక్ష్యం… మేము నాయకులం కాదు.. సేవకులం… పీపుల్స్ క్వశ్చన్ అవర్ లో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం

Vemula Veeresham I నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తా.. రాష్ట్రంలోనే డెవలప్‌ లో ఆదర్శ నియోజికవర్గంగా తీర్చిదిద్దుతా…

జయభేరి, నల్లగొండ జిల్లా. నకిరేకల్ :

నకిరేకల్ నియోజికవర్గ కేంద్రాల్లో బుధవారం నాడు ప్రజాపాలనకు వంద రోజుల ప్రజానాయకునికి 100 ప్రశ్నలు కార్యక్రమం మరియు నకిరేకల్ ఎమ్మెల్యే  వేముల వీరేశం పరిపాలనపై అభివృద్ధిపై ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే కార్యక్రమంలో  నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు అడిగిన ప్రశ్నలకు  నకిరేకల్ ఎమ్మెల్యే  వేముల వీరేశం సమాధానం చెప్పారు..

Read More నిత్యవసర వస్తువులుకు ధరలకు రెక్కలు

వెంకటేష్ (నకిరేకల్ పట్టణం)... మీకు 68 వేల మైజారిటి రావడం కారణం ఏమిటి? 68 వేల మైజారిటి వచ్చిన మీకు ప్రజలకు ఏమి పరిపాలన ఇస్తున్నారు నకిరేకల్ పట్టణంలో ఉర్దూవిధ్యను ఏర్పాటు చేయాలి మరియు పాలిటెక్నిక్ కళాశాలలో, ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేయాలి, మీరు శాశ్వత నిరుద్యోగ యువతకు కోచింగ్ సెంటర్ ను ఎప్పుడు ఏర్పాటు చేస్తారు.

Read More పరిశుద్ధ కార్మికులకు దసరా పండుగ సందర్భంగా కొత్త బట్టలు

నల్లగొండ జిల్లాలో నకిరేకల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి బలం, కరోన విపత్తు సమయాల్లో నేను చేసిన సహయం, ఈ రాష్టంలో ప్రజా పాలన రావాలని ప్రజలు భావించారు,కాబట్టే ఈ నియెజకవర్గ ప్రజలు భారీ మైజారిటితో గెలిపించారు రామన్నపేట, చిట్యాల ప్రాంత ప్రజలకి పిల్లాయిపల్లి, ధర్మరెడ్డి కాలువను ప్రారంభిస్తాం, నార్కెట్‌పల్లి, కట్టంగూర్ మండల ప్రజలకు బ్రహ్మాణవెల్లంల ప్రాజెక్టును కూడా త్వరలో పూర్తి చేసీ మా మార్పు చూపిస్తాం, నకిరేకల్ మండల ప్రజలకు అయిటిపాముల లిఫ్ట్ ఇరిగేషన్ ను ప్రారంభిస్తాం, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ఉద్దీపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంగ్లీషు మీడియంను మళ్ళీ అందిస్తాం, నకిరేకల్ పట్టణంలో IT కాలేజిని తీసుకువస్తాం, ఏప్రిల్ 1నుండి  పూర్తి స్థాయిలో కొచింగ్ సెంటర్ ను ప్రారంభిస్తాం.

Read More మోటార్ సైకిల్ దొంగలించిన నిందితుడు అరెస్టు 

గట్టు శ్యాంసుందర్(నకిరేకల్ పట్టణం)... నకిరేకల్ పట్టణాని ఈ ఐదు సంవత్సరాలో ఏట్ల అబివృద్ధి చేస్తారు..

Read More ఎస్సీ వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలి....

సెంటర్ లో రింగ్ ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు చాల ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి, ప్రజల అభిప్రాయం మేరకు రింగ్ ను తొలగించండం జరిగింది . ముందుగా ఒక demo ను పరిశీలిస్తాం.. తర్వాత నిర్మాణం చేస్తాం, ఇందిరమ్మ మధ్యలో ఏర్పాటు చేస్తాం.. నకిరేకల్ మున్సిపాలిటీలో గతంలో  పనులు నత్తనడకన జరిగాయి ఇప్పుడు వేగంగా జరుగుతున్నయ్.

Read More మైనంపల్లి హన్మంతరావు ను విమర్శించే స్థాయి ప్రతాప్ రెడ్డి కి లేదు

శ్రావణ్ కుమార్ (నకిరేకల్ పట్టణం)... నకిరేకల్ పట్టణంలో యువత చెడ్డ మార్గంలో పెతుంది..

Read More శ్రీ గౌరీ అవతారంలో అమ్మవారు 

మన దగ్గర త్రీవమైన గంజాయి సమస్య ఉంది అప్పుడు మనం 80 సిసి కెమెరాలు ఏర్పాటు చేసి పూర్తి నిఘా ఏర్పాటు చేయటంతో  కొంచం కంట్రోల్ చేయగలిగినం . నకిరేకల్ నియోజకవర్గాన్ని మత్తుపదార్థల రహిత ప్రాంతంగా నిర్మూలన చేసి, యువతను కాపాడుకుంటాం.

Read More మేడిపల్లి బాపూజీ నగర నూతన అధ్యక్షుడిగా బాల్ద వెంకటేష్ 

సైదులు(నకిరేకల్ పట్టణం)... నకిరేకల్ బస్టాండ్ ను అభివృద్ధిని R&B ఆఫీసును ఎప్పుడు ఏర్పాటు చేస్తారు, కుమ్మరి కులస్థులకు మట్టి ఉచితంగా దొరికేలా చర్యలు తీసుకోవాలి.

Read More  ఆ మహిళా మంత్రి నా కుటుంబానికి క్షమాపణలు చెప్పలి

బస్టాండ్ ను కచ్చితంగా పునప్రారంభం చేస్తాం, R&B ఆఫీసును ఏర్పాటు చేస్తాం, కుమ్మరి కులస్థులకు మట్టి దొరికేలా అక్కడ ఉన్న చెరువులో హక్కు కల్పిసాం..

Read More దుద్దెనపల్లి గ్రామంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

రామన్నపేట మండలం కక్కిరేణి గ్రామానికి బస్సు రావడం లేదు దీనీ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారు..

Read More వ్యవసాయ సహకార సంఘం 43 వ సాధారణ సమావేశం

బస్సు ను మీ గ్రామానికి కచ్చితంగా పునప్రారంభం చేస్తాం

వెంకటేషం (ప్రభుత్వ ఉద్యోగి)... నకిరేకల్ మండలం కేంద్రంలో జూనియర్ కళాశాల లోనే డ్రీగి కళాశాల ఉంది, డ్రీగి కళాశాల కు సోంత భవనాం ఏర్పాటు చేయాలి, ఎలక్షన్ ముందు అనేక సంక్షేమ పథకాలకు శిలాఫలకాలు వేశారు అవ్విటికి నిధుల ఉన్నాయా ట్యాంక్ బాండ్ నిర్మాణం ఏక్కడ ఏర్పాటు చేస్తారు?

డ్రీగి కళాశాల భవనం నిర్మాణం చేసుకుందాం, ఎలక్షన్ సమయంలో వేసిన శిలాఫలకాలకు ఎలాంటి టెండర్లు, ప్రోసిడింగ్ లేవు, గత పాలకులు ప్రతిధీవిధ్వంసం చేశారు, ట్యాంకుబండ్ ను ఒక్క విజన్ తో అభివృద్ధి చేస్తాం ఒకస్మృతి వనం ఏర్పాటు చేసుకుద్దాం.

ఐలయ్య (లక్ష్మాపురం).. ప్రతి మండలంలో ఇలాంటి సమావేశం నిర్వహించాలి, ఎర్ర కాలువను త్వరగా పూర్తి చేయాలి...

ఎర్ర కాలువను, ధర్మరెడ్డి, పిల్లాయిపల్లి కాలువను గత నెల క్రితం రామన్నపేట మండల కేంద్రాలో సమీక్ష నిర్వహించనం వీటిని కచ్చితంగా పూర్తి చేసుకుందాం, ఇలాంటి సమావేశాలు ప్రతి మండలంలో ఏర్పాటు చేసుకుద్దాం.

శేఖర్ (కట్టంగూర్ మండలం)... కట్టంగూర్ మండలం కేంద్రంలో ఉండాల్సిన ఎస్సి హాస్టల్ నార్కెట్‌పల్లి లో ఉంది, కావున అది కట్టంగూర్ లోనే ఉండేలా చర్యలు తీసుకోవాలి, కట్టంగూర్ పట్టణ కేంద్రంలో నల్గొండ నుండి వచ్చే రోడ్డు వద్ద అండర్ పాస్ ను ఏర్పాటు చేయాలి.

ఎస్సి గురుకుల పాఠశాల  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఏర్పాటు చేస్తాం, అక్కడ అండర్ పాస్ ను నిర్మాణం చేసుకుందాం.,

కట్టంగూర్ మండల పామనగుండ్ల నుండీ నల్గొండ వెళ్లే రోడ్డును వెడల్పు చేయాలి.

09 కోట్ల రూపాయలతో పామనగుండ్ల నుండి నల్లగొండ వరకు రోడ్డు వెడల్పుకు నిధులు మంజూరు చేశాం..

కడియం కృపాకార్ (నకిరేకల్ పట్టణం)... నకిరేకల్ పట్టణంలోని క్రెసవులకు సశ్మనా వాటిక ఏర్పాటు చేయాలి.

నా సోంత డబ్బులు 20 లక్షలతో మీకు స్మశాన వాటిక నిర్మాణం చేపడతా

జహంగీర్... యసంగి కాలం వచ్చింది, రైతులకు  IKP సెంటర్ లను ఎన్ని ఏర్పాటు చేసున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులకు న్యాయం చేస్తుంది?

IKP సెంటర్ ల తో వరిపంట వేగంగా కోనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటాం, ఉద్యమకారులకు ప్రభుత్వ తీసుకోన్న నిర్ణయాలను అమలు చేస్తాం...

వంశీకృష్ణ (విలేకరి)... నకిరేకల్ నియోజకవర్గంలో ఉన్న విలేకరులకు ఇండ్ల నిర్మాణం చేపట్టాలి, మా పిల్లలకు ప్రేవేట్ పాటశాలల్లో ఫీజు రాయితీ ఇవ్వాలి, విలేకరులకు ప్రతేక్య కార్యాలయంనికి ఏర్పాటు చేయాలి, ఎన్ని రోజులకు ఒకసారి మీరు ఈ కార్యక్రమం చేప్పడుతారు, నకిరేకల్ లో కోతుల బెడతాలు ఏక్కవ ఉంది దీనికి పరిష్కారం ఇవ్వాలి.

ప్రభుత్వ స్థలాంలో విలేకరులకు ఇండ్లు నిర్మాణం చేప్పడుద్దాం, 90% శాతం మేరకు కోతులను పట్టించాం

శ్రీనివాస్ (విలేకరి)... ఇట్టుక బట్టిలలో బాల కార్మికులు పనిచేయడం జరుగుతుంది, దుమ్ము ధూళి తో వాయు  కాలుష్యం కూడా చెందుతుంది దీన్ని అరికట్టాలి.

ఇట్టుక బట్టి విషయంలో ప్రభుత్వ  లెబర్ చట్టం ప్రకారం బాల కార్మిక ల పట్ల చర్యలు తీసుకుంటం..

ప్రవీణ్ (కొర్లపాహడ్)... మూసి ప్రాజెక్టు ద్వారా కేతేపల్లి మండలం లోని చాల గ్రామాలకు నీరు రావడం లేదు, యాదవ సంఘం కులస్థులు గొర్రెలకు డిడిలను కట్టారు, ఇంక లభ్దిదారులకు చెందలేదు.

మూసి నుండి ఒక్క లిఫ్ట్ ను పరిశీలించి, కచ్చితంగా ఏర్పాటు చేస్తాం, యాదవ సోదరులు కట్టిన డిడిలను వారికి తిరిగి డబ్బులు అందిస్తాం..

బచ్చుపల్లి గంగాధర్ (మంగళపల్లి)... నకిరేకల్ పట్టణంలో పల్లె పకృతివనం లో జరిగిన అవినీతి, ప్రభుత్వ కార్యాలయాలను కూలగొట్టడం జరిగింది, వాటి స్థానంలో ప్రభుత్వ కార్యాలయాలను త్వరగా నిర్మాణం చేపట్టాలి నకిరేకల్ పట్టణంలో బిసి బాయ్స్ హాస్టల్ ను నకిరేకల్ లో ఏర్పాటు చేయాలి...

పల్లె పకృతి వనం పై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటం, కూలగొట్టిన ప్రభుత్వ కార్యాలయాలను త్వరగా నిర్మాణం చేసుకుందాం, ఫర్నీచర్ విషయంలో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. పై సమస్యలు అన్నింటిని త్వరగా పరిష్కరిస్తాని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు బిసి ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పూజర్ల శంభయ్య, TPCC మెనీఫెస్టో కమిటీ మెంబర్ చామల శ్రీనివాస్ నకిరేకల్ యం.పి.పి బచ్చుపల్లి శ్రీదేవి-గంగాధర్, స్థానిక కౌన్సిలర్లు, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.