Lok Sabha : నేడే తుది తీర్పు...
ఎప్పుడు ఎప్పుడు అని ఎదురు చూసినా పార్లమెంటు ఎన్నికల సమరానికి సర్వం సిద్ధమై సమయం వచ్చేసింది. ఈ సందర్భంగా 'జయభేరి' అందిస్తున్న రాజకీయ సమగ్ర విశ్లేషనే కౌంటర్ విత్ కడారి శ్రీనివాస్.....
తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడెప్పుడు అని ఎదురుచూసిన పార్లమెంటు ఎన్నికలకు రంగం సిద్ధం అయిపోయి ఓటర్లు నేడు ఓటు వేయడానికి వెళుతున్నారు... ఒక్కసారి ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని ఈ కథనం మీకోసం అందిస్తుంది 'జయభేరి'....
మాట తప్పిన నేతలకు వాత పెట్టండి...
మీరు ఓటు వేయండి మీ పక్కవారితో ఓటు వేయించండి...
ఎన్నికల అనగానే ఒక పండగల భావించే ప్రజలు ఒక్కసారి ఆలోచించి ఓటు వేయడానికి అడుగులు ముందుకు వేయాలి. ఎందుకంటే ఈ దేశ భవిష్యత్తు మనం వేసే ఒక్క ఓటులోనే నెమడికృతమై ఉంటుందనే నిజాన్ని మరిచిపోవద్దు.. ఇక హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చూసుకుంటే భాగ్యనగరంలోని రంగారెడ్డి హైదరాబాద్ పార్లమెంటు నియోజక వర్గాలలో నేతల మాటలు హద్దులు మీరిపోయి ఆశ చూపుతూ జర్నలిస్టుల నుండి సామాన్య ప్రజల వరకు మొండి చేయి చూపించారు... మేం పొడుగు పత్రికలం అని చెప్పుకొచ్చిన పెద్దపెద్ద పత్రికల యజమానులు కాసులకు కక్కుర్తి పడి సంచులు నింపుకొని పలాయనం చిత్తగించారు. అంటే జనాలు ఎక్కడన్నా పోనీ నేతలు ఏమైనా కానీ మాకు ముట్ట చెప్పందే మీ తలరాతలు రాస్తే జనాలను దారి మళ్ళి బెదురుతో కాసులు బాగానే దండుకున్న పొడుగు పత్రికలు లబ్ధి పొందాయి... కానీ సామాన్య ప్రజలకు ఒరిగింది ఏంటి!?
నిజానికి మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం లో నాయకుల కంటే నాయకుల కింది కార్యకర్తలే నాయకులను ఆకాశానికి ఎత్తుతూ మాట్లాడే మాటలు చేసిన ప్రచారానికి సంబంధం లేకుండా ఉంటుంది. ఎందుకంటే ఆ నాయకుడు జెండాలు మార్చిన నేతకదా... మాట మార్చడని గ్యారెంటీ ఏంటి అనే ఆలోచన ప్రజలు తప్పకుండా చేయాలి. క మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం లో కాంగ్రెస్ అభ్యర్థి పట్నం మహేందర్ రెడ్డి స్థానికురాలు కాకపోయినా తాండూరులో చల్లని రూపాయి మల్కాజిగిరిలో ఎలా చెల్లుతుంది అనే వారు మల్కాజ్గిరి పార్లమెంటులో ఎక్కువగానే ఉన్నారు... ఇక గత పదేళ్ల పాలనలో ఏ మొరగబెట్టారు అంతా అవినీతి అని మాజీ సీఎం కేసీఆర్ని చీదరించి మళ్లీ పార్లమెంటు ఎన్నికల్లో అదే పార్టీకి ఓట్లు ఎలా వేస్తారు అనే వాదన లేకపోలేదు... ఇక బిజెపి పార్టీ మతతత్వ పార్టీ అన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అయినా ఈటెల రాజేందర్ స్థానికుడు కాకపోవడం గతంలో రెండు సార్లు పరాజ్యం పొందడం ప్రశ్నార్థకంగానే మారింది... మరి ఓటు ఎవరికి వేయాలి అని మల్కాజిగిరి ప్రజలు సందేహించవచ్చు.... మా సర్వేలో బయటపడిన కొన్ని నిజాలను మీ ముందు ఉంచుతాను...
మల్కాజ్గిరి నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం. ఇక్కడ నుంచి గెలిచి రికార్డును కొట్టాలని మూడు పార్టీల అభ్యర్థులకు ఉచ్చు కథ ఎక్కువగానే ఉంది... కానీ పార్లమెంట్ అభ్యర్థుల నేతల కింద పనిచేసిన లేబర్ కు కొంతమంది పైసలు ఇవ్వలేదని ఆరోపణలు కాదు ఇవి పచ్చి నిజాలు మా కళ్ళ ముందే కనిపించాయి... ప్రజా ప్రతినిధులుగా చలమనయ్యే వారు మాటమీద నిలబడ లేకపోవడం దేనికి సంకేతం... నిన్న ఒక మాట నేడు ఒక మాట రేపు మరొక మాట మాట్లాడే ప్రజా నేతలుగా చలామణి అవుతున్న వారిని గట్టిగా కరువు కాల్చి వాత పెట్టాల్సిన సమయం ఇదే....
అలాగే చిన్న పత్రికలను చులకన చేసి మాట్లాడుతూ మిమ్మల్ని ఎవరు రాయమన్నారు మమ్మల్ని బ్లాక్ మెయిల్ చేస్తున్నారా అంటూ ఎదురుదాడి చేసిన ఆ పార్టీ నేతలకు అధికార పార్టీ టికెట్ ఎలా ఇచ్చిందో అర్థం కాదు.... మనకి సాక్షాత్తు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గం అభ్యర్థిగా 2018లో ఎన్నికైన విధానం సీఎం రేవంత్ రెడ్డి మరిచిపోయాడా.!? ఏ ఉద్దేశంతో పట్నం మహేందర్ రెడ్డిని ఇక్కడ తన భార్యను పట్నం సునీత మహేందర్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా నియమించడం ఓటమిని అంగీకరించినట్లే అని మల్కాజ్గిరి ఓటర్లు దుమ్మెత్తి పోస్తున్నారు..
ఏమవుతుంది అందుకే మల్కాజ్గిరి నియోజకవర్గ పార్లమెంటు అభ్యర్థులను గెలిపించే ముందు అక్కడి ప్రజలు ఒకసారి ఆలోచించేసుకోవాలి...
అలాగే తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ అభ్యర్థులుగా వచ్చిన వారిని ప్రతి ఒక్కరిని పార్టీల కతీతంగా వ్యక్తిగతంగా వారి వారి గుణగణాలను పరీక్షించి గతంలో వారు ఏ పార్టీలలో ఎలాంటి పదవులు అనుభవించారు వారు చేసిన విధివిధానాలు పనితీరును పరిశీలించిన తరువాతనే పార్టీలకు అతీతంగా కులమతాలకతీతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి... నా ఒక్క ఓటు వేయకపోతే ఏం కాదులే అనుకునే మూర్ఖులకు ఇది ఒక హెచ్చరిక కావాలి... నిజానికి గ్రామీణ ప్రాంతంలోనే ఓటింగ్ శాతం ఎక్కువగా ఉంటుంది. పట్టణ ప్రాంతంలో ఉండే ప్రజలు సెలవు ప్రకటించిన కనీసం ఓటు వేయడానికి సుముఖత చూపించకపోవడం చాలా సిగ్గుచేటు..
ఒక్క ఓటుతో దేశ భవిష్యత్తును నిర్ణయించే అధికారాన్ని రాజ్యాంగం మనకు అందించిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఓటు వేసే ముందు ఒక్క క్షణం ఆలోచించి ఈవీఎం లో తమకిష్టమైన పటం నొక్కి మద్దతును తెలియజేయాలి.. అంతేకానీ ఆశ నిరాశల మధ్య రాజకీయ నేతలను గుడ్డిగా నమ్మొద్దు... నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారం దక్కించుకుంది గాని ఆ దిశగా ప్రజలకు నమ్మకంగా పనిచేయట్లేదని ఆరోపణలు గుప్పుమంటున్నాయి.... అంటే అలివి కాని సంక్షేమ పథకాలకు తెరలేపి మళ్లీ కేంద్రంలో మమ్మల్ని గెలిపియండి అనే వాదనను తీసుకొస్తున్న తరుణంలో అన్ని నియోజకవర్గాల్లో ముఖ్యంగా మేడ్చల్ మల్కాజ్గిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ను కచ్చితంగా ఓడించి తీరుతామంటున్నారు...
ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ప్రచారం చేసిన వారికి కనీసం డబ్బులు కూడా ఇవ్వని పరిస్థితి మాట మార్చిన విధానం చూస్తే అసలు పట్నం మహేందర్ రెడ్డి ఎవరు ఇక్కడ ఆయన ఎందుకు పోటీ చేస్తున్నట్టు అనే అనుమానం ప్రజల్లో బలంగా వచ్చింది... ఇక బిజెపి పార్టీ రెండుసార్లు ఓడిపోయిన ఈటెల రాజేందర్ ఎలాగైనా ఇక్కడి నుంచి గెలిపించాలని దృఢ నిశ్చయంతో ముందుకు వస్తున్న ఈటెల రాజేందర్ గెలుపు ఆశ నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతోంది...ఇక టిఆర్ఎస్ పార్టీ గత ఎన్నికల్లో ఓటమిన్ ఛాయి చూసి ఎలాగైనా ఎంపీ అభ్యర్థులుగా గెలిచి కేసీఆర్ గౌరవాన్ని పెంచాలి అని అనుకుంటున్నా వారికి ప్రజలు ఎలాంటి గౌరవాన్ని అందిస్తారో చూడాలి...
తెలంగాణ రాష్ట్రంలో ఏ నాయకుడైతే సరిగ్గా పనిచేయలేదు ప్రజలు గుర్తించి వారికి కర్రు కాల్చి వాత పెట్టాలి... మనదేశంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం ఇంకా పేరు ప్రఖ్యాతులు మన దేశానికి ఉన్నాయి... నిజానికి దానికి ప్రధాన కారణం ఓటు వేసే ఓటర్లే... ఓటరు తన ఒక్క ఓటే అని ఆలోచించకుండా ప్రతి ఒక్క ఓటును సద్వినియోగం చేసుకుంటే ప్రజాస్వామ్యానికి ప్రాణం పోసినట్లు అవుతుంది.. పార్లమెంటు ఎన్నికలు నేడు పోటీకి ఎలక్షన్ జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు కచ్చితంగా ఆలోచించి తమ ఓటును సద్వినియోగం చేసుకోవాలి.... ప్రజా ప్రతినిధులుగా వచ్చిన వాళ్ల విద్య తీరును వ్యక్తి విధానాన్ని ఆయన మాటతీరును ప్రవర్తన నియమాలని పార్టీలకు అతీతంగా వ్యక్తిగతంగా చూసి నచ్చితే ఓటు వేయాలి.. అలాగే మీకు ఏ ప్రజా ప్రతినిధి నచ్చకపోతే నోటాకు ఓటు వేయండి...
- కడారి శ్రీనివాస్
కాలమిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, కవి, రచయిత
గాయకులు, సామాజిక ఉద్యమకారులు
Post Comment