Kadiyam Kavya : బీఆర్ఎస్ పార్టీకి షాక్ మీద షాక్ లు

కడియం కావ్యను తప్పించడానికి కారణమేంటి? టికెట్ ఇచ్చినా ఫిరాయింపు బాటలోనే...

Kadiyam Kavya : బీఆర్ఎస్ పార్టీకి షాక్ మీద షాక్ లు

పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతున్న బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీల్లోకి కీలక నేతలుగా చెప్పుకుంటున్న నేతలు జంప్ అవుతుండగా.. వరంగల్ అభ్యర్థిని ఖరారు చేసిన 15 రోజుల్లోనే ఆ పార్టీకి మరో షాక్ తగిలింది. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అభ్యర్థిగా ప్రకటించిన డాక్టర్ కడియం కావ్య గురువారం సాయంత్రం కేసీఆర్ కు షాకిచ్చింది. వరంగల్ బీఆర్ ఎస్ ఎంపీ అభ్యర్థిగా తనకు అవకాశం ఇచ్చినా పోటీ చేయలేనని లేఖ రాసి సంచలనం సృష్టించారు.

గత కొద్దిరోజులుగా అవినీతి, భూకబ్జాలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్‌లు, భూకబ్జాలు, మద్యం కుంభకోణాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయని లేఖలో కడియం కావ్య లేఖలో పేర్కొన్నారు. జిల్లాకు చెందిన నేతల మధ్య సమన్వయం, సహకారం కొరవడడం, ఎవరికి వారే యమునాతీతంగా వ్యవహరించడం పార్టీకి మరింత నష్టం కలిగిస్తోందని లేఖలో రాశారు. ఈ పరిస్థితుల్లో పోటీ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్న తనను క్షమించాలని కడియం కావ్య బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌, పార్టీ అధిష్టానం, పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. కడియం కావ్య విడుదల చేసిన లేఖ నిమిషాల వ్యవధిలోనే వైరల్ కావడంతో.. బీఆర్ఎస్ నేతలు ఒక్కసారిగా షాకయ్యారు.

Read More విద్యాధరి ఆలయంలో మాజీ మంత్రి 

రాష్ట్రంలో అన్ని పార్టీల కంటే ముందే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తోంది. మార్చి 13న వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్యను ప్రకటించారు. ఆ తర్వాత పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న డాక్టర్ కడియం కవిత కూడా నాలుగు రోజుల క్రితం బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ను కలిశారు. ఇంతలో రాజకీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. తనను అభ్యర్థిగా ప్రకటించిన సరిగ్గా 15 రోజుల తర్వాత 28వ తేదీ సాయంత్రం.. పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు లేఖ విడుదల చేశారు. ఈ హఠాత్పరిణామంతో ఓరుగల్లు జిల్లా బీఆర్ఎస్ పార్టీలో గందరగోళం నెలకొంది.

Read More కెసీఆర్, హరీష్ రావు ,కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం

500x300_1433954-kcr

Read More బోడుప్పల్ 5వ డివిజన్లో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

బీఆర్ఎస్ అభ్యర్థిగా కేసీఆర్ ప్రకటించినా కవిత పోటీ నుంచి కడియం తప్పుకోవడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కడియం శ్రీహరి, ఆయన కూతురు కడియం కావ్య ఇద్దరూ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఇది వరకే కొందరు నేతలు కడియం శ్రీహరిని కాంగ్రెస్‌లో చేరాల్సిందిగా ఆహ్వానించగా.. ఆ సమయంలో నిరాకరించారు. అయితే ఆ తర్వాత రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ కేసులు, మద్యం కుంభకోణం తదితరాల నేపథ్యంలో కడియం మనసు మార్చుకున్నట్లు తెలుస్తోంది. గురువారం ఉదయం ఢిల్లీ వెళ్లిన కడియం శ్రీహరి, కడియం కావ్య ఇద్దరూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలను కలిసి బీఆర్ఎస్ అభ్యర్థిత్వం నుంచి వైదొలగుతున్నట్లు లేఖ విడుదల చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉంటే తండ్రీకూతుళ్లిద్దరూ కాంగ్రెస్‌లో చేరిన తర్వాత వరంగల్ ఎంపీ అభ్యర్థులుగా ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. కడియం శ్రీహరిని కాంగ్రెస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటిస్తే ఆయన స్టేషన్ ఘన్ పూర్ శాసనసభ ఉప ఎన్నికల్లో కడియం కావ్య మళ్లీ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో నిలిచే అవకాశం ఉంది. గురువారం ఉదయం నుంచి ఢిల్లీలోనే ఉన్న కడియం శ్రీహరి, కడియం కావ్య సోనియాగాంధీ హామీతో హస్తం పార్టీలో చేరబోతున్నారని ఆ పార్టీ నేతలు కూడా చర్చించుకుంటున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన బీఆర్ఎస్.. ఎంపీ అభ్యర్థుల ఎంపికలో పెద్దఎత్తున కసరత్తు చేసింది.

Read More మైనంపల్లి హన్మంతరావు ను విమర్శించే స్థాయి ప్రతాప్ రెడ్డి కి లేదు

500x300_1430201-kadiyam-kavya

Read More విశాల సహకార సంఘం అధ్యక్షులు కొత్త తిరుపతి రెడ్డిచే వడ్లు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు...

కడియం శ్రీహరి తన కుమార్తెకు రాజకీయ వేదిక ఇవ్వాలని ఎప్పటి నుంచో పట్టుబట్టి మరీ కావ్యకు టికెట్ ఇచ్చి తన హామీని ఖరారు చేశారు. ఇప్పటికే టికెట్‌పై ఆశలు పెట్టుకున్న కొందరు కార్యకర్తలు ఆమె అభ్యర్థిత్వాన్ని మార్చాలని పార్టీ నేతలకు విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి వాదనలు కూడా వినిపించారు. దీంతో పాటు ఫోన్ ట్యాపింగ్, మద్యం కుంభకోణం, భూకబ్జాలు, ఇతర అరాచకాలు, పార్టీలో సీనియర్లు, కార్యకర్తలు తనను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో కడియం కావ్య పార్టీ మారే ఆలోచన చేసినట్లు తెలుస్తోంది. అభ్యర్థిత్వం.

Read More ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి 

ఈ మేరకు కడియం శ్రీహరి అంతర్గతంగా కదిలి నేరుగా ఢిల్లీ పెద్దలతో టచ్‌లో పడినట్లు తెలిసింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో భేటీ అనంతరం కడియం శ్రీహరి, కావ్య ఇద్దరూ పార్టీ కండువా కప్పుకునే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. ఎన్నికలకు దాదాపు రెండు నెలల ముందు రాజకీయాల్లో పెను మార్పులు చోటుచేసుకుంటున్నా.. భవిష్యత్తులో ఎలాంటి షాక్‌లు తగులుతుందో చూడాలి.

Read More మోటార్ సైకిల్ దొంగలించిన నిందితుడు అరెస్టు 

Latest News

నేడు మహాకవి దాశరథి కృష్ణమాచార్య వర్ధంతి నేడు మహాకవి దాశరథి కృష్ణమాచార్య వర్ధంతి
మహాకవి దాశరథి కృష్ణమాచార్య దాశరథిగా ఆయన సుప్రసిద్ధుడు. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి ప్రాతఃస్మరణీయుడు. నా తెలంగాణ కోటి రతనాల...
Reba Monica John
Rashmika Mandanna
Rashi Singh
గోదావరి పుష్కర ఏర్పాట్లు షురూ...
స్మార్ట్ కార్డుల్లో ఆర్సీలు, డ్రైవింగ్ లైసెన్సులు