Eatala : ఏ ఇంటికి పోయినా మళ్లీ మోదీయే ప్రధాని కావాలని అంటున్నారు

ఐదేళ్ల అనంతరం నా పనితనం చూసి ఓట్లు వేయండి, మీ రిపోర్టు ఇవ్వండి అని అడిగితే 2014లో  275 సీట్లు గెలుచుకున్న బీజేపీకి 303 సీట్లు ఇచ్చి తమ అభిమానం చాటుకున్నారు ప్రజలు. ఇప్పుడు పదేళ్ల తర్వాత మరింత ఉత్సాహంతో 370 సీట్ల పైన బీజేపీని గెలిపిస్తామని ప్రకటిస్తున్నారు. రాష్ట్రఎన్నికలు వేరు, కేంద్ర ఎన్నికలు వేరు. 

Eatala : ఏ ఇంటికి పోయినా మళ్లీ మోదీయే ప్రధాని కావాలని అంటున్నారు

జయభేరి, యాప్రాల్‌ :
యాప్రాల్‌లోని పద్మశాలి సమ్మేళనంలో పాల్గొన్న ఈటల రాజేందర్. నా 24 సంవత్సరాల రాజకీయ జీవితంలో మొదటిసారి గా ఇలాంటి ఎన్నికలు చూస్తున్నాను. ఏ ఇంటికి పోయినా మళ్లీ ప్రధాని మోదీయే ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. నన్ను కూడా తప్పకుండా ఎంపీగా గెలిపిస్తామని మాట ఇస్తున్నారు. ఏ పార్టీకి చెందిన వారైనా అసెంబ్లీ ఎన్నికలలో ఎవ్వరికి ఓటు వేసినా పార్లమెంటు ఎన్నికలలో మాత్రం బీజేపీ పార్టీకే మా ఓటు అంటున్నారు. సాధారణంగా ఐదేళ్లు పదవిలో ఉన్న నాయకునిపై కొందరు ప్రజలలో అయినా ఏదో ఒక వ్యతిరేకత వస్తుంది. ఐదేళ్ల అనంతరం నా పనితనం చూసి ఓట్లు వేయండి, మీ రిపోర్టు ఇవ్వండి అని అడిగితే 2014లో  275 సీట్లు గెలుచుకున్న బీజేపీకి 303 సీట్లు ఇచ్చి తమ అభిమానం చాటుకున్నారు ప్రజలు. ఇప్పుడు పదేళ్ల తర్వాత మరింత ఉత్సాహంతో 370 సీట్ల పైన బీజేపీని గెలిపిస్తామని ప్రకటిస్తున్నారు. రాష్ట్రఎన్నికలు వేరు, కేంద్ర ఎన్నికలు వేరు. 

38a5c4de-2173-487a-99c6-067a023baaab

Read More Telangana I మును గో.. డౌట్..

అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన కాంగ్రెస్ పార్టీ ఎన్నో అమలు చేయలేని హామీలు ఇచ్చింది. ప్రమాణ స్వీకారం చేయగానే పెన్షన్లు ప్రతీనెలా 1వ తేదీన పడతాయని మహిళలకు హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. అవి ప్రభుత్వం ఏర్పాటయ్యి 4 నెలలైనా రాలేదు. ప్రతీ మహిళకు నెలకు  2,500 రూపాయలు ఇస్తామని చెప్పారు. అది ఇప్పటి వరకూ జరగలేదు. చదువుకునే ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామని చెప్పారు. వృద్ధులకు రూ. 4000 పెన్షన్ ఇస్తామని చెప్పారు. వికలాంగులకు రూ. 6000 ఇస్తామన్నారు. మహిళా సంఘాలకు రూ. 10 లక్షలు రుణం ఇస్తామన్నారు. కూలీలకు, ఆటో కార్మికులకు పెన్షన్లు ఇస్తామన్నారు. వీటిలో ఏదీ నెరవేర్చలేదు. మరి అలాంటి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు మళ్లీ ఎలా వేస్తారు. 

Read More Election Bonds I సుప్రీం ఆదేశం.. ఎన్నికల బాండ్లు బయట పెట్టాల్సిందే..

fff5341d-a6ec-4334-9cc4-ff6312a7521e

Read More Health I ప్రజా ఆరోగ్యం మెరుగుపడేదెలా!?

రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఈ హామీలు నెరవేర్చగలమని ఇప్పుడు చెప్తున్నారు రేవంత్ రెడ్డి. ఇక బీఆర్‌ఎస్ పార్టీకి ఓట్లు వేసినా అవి వ్యర్థమే. ఇక్కడ ఈ నియోజక వర్గంలో ఏసమస్య వచ్చినా దానిని నేరుగా ప్రధాని దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించగలిగే సత్తా ఉన్న వ్యక్తిని నేనే. గతంలో ఆర్థిక మంత్రిగా, వైద్యారోగ్య మంత్రిగా తెలంగాణ ప్రజలకు ఎలా సేవ చేశానో మీకు తెలుసు. హాస్టళ్లలో పిల్లలకు సన్నబియ్యం పెట్టేలా జీవో ఇచ్చింది నేనే. ఇక్కడ ఉన్న 78 కులాలలకు ఎకరం, రెండెకరాల జాగా ఇచ్చి, హైదరాబాద్‌లో కమ్యూనిటీ హాల్స్ కట్టించడానికి కృషి చేశాను. 

Read More Telangana I ఇది గౌడలను అవమానించడమే..!

3c7ee0f2-40cc-4a6e-84a7-c7d7437f75c4

Read More Auto I షౌకత్ గ్యారేజ్

కరోనా కాలంలో అయిన వారే చూడలేనప్పుడు నేను స్వయంగా పేషంట్లను పరామర్శించి వారికి సరైన ట్రీట్‌మెంట్లు ఇప్పించిన సంగతి మీకు తెలుసు. రాబోయే కాలంలో మల్కాజ్ గిరికి రోడ్లు కావాలన్నా, త్రాగునీరు, డ్రైనేజ్ సిస్టం, ఇండస్ట్రియల్ కారిడార్, రప్పించడానికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. దేశంలో మోదీ వలన ప్రజలందరూ సురక్షితంగా బాంబుల మోతల భయం లేకుండా జీవిస్తున్నారు. అనేక దశాబ్దాలుగా ఉన్న అయోధ్యరామమందిర సమస్యను సులువుగా పరిష్కరించారు ప్రధాని మోదీ. అయోధ్యలో 9 రోజుల పాటు దీక్ష చేసి, వైభవంగా ప్రారంభోత్సవం చేసి, దేశప్రజలందరికీ అక్షింతలు పంపిన గొప్ప నాయకుడిగా పేరుతెచ్చుకున్నారు. ఈ ఎన్నికలలో ఈ విషయాలన్నీ గమనించి, మీరందరూ కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి, నన్ను, ప్రధాని మోదీని గెలిపించవలసిందిగా కోరుతున్నాను.

Read More Telangana journalist | అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి హామీ

Views: 0

Related Posts