రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి జెండాను ఎగురవేయాలి
జయభేరి, తుర్కపల్లి, మే 12 :
రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి జెండా ఎగురవేయాలని ఆలేరు అసెంబ్లీ కన్వీనర్ చిరిగే శ్రీనివాస్ అన్నారు. సోమవారం బిజెపి మండల పార్టీ అధ్యక్షుడు మేకల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మండల కమిటీ సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇటీవల మరణించిన భారత జవాన్ మురళి నాయక్ కు నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత్, పాకిస్తాన్ యుద్ధంలో దేశ ప్రధానిగా మోడీ ఉన్నారు కాబట్టి దేశ ప్రజలు గుండెల మీద చేతులు పెట్టుకొని నిద్ర పోతున్నారని అన్నారు .భారత సైనికులకు పూర్తి స్వేచ్ఛని ఇచ్చి మన భారత సైన్యం యొక్క శక్తిని ప్రపంచానికి చాటి చెప్పారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు యాటపెంటయ్య, మాజీ మండల అధ్యక్షులు శత్రు నాయక్, లక్ష్మీనారాయణ, కందుకూరి చలమయ్య, నరేంద్ర నాయక్, ఆకుల రమేష్, ఆకుల సైదులు, చాంద్ పాషా, జక్కుల వెంకటేష్, ఆంజనేయులు, బొల్లు నరసింహ, మోత్కుపల్లి బిక్షపతి, రమేష్ నాయక్, రాము నాయక్, ఆకుల భాస్కర్, చిలుకూరి రమేష్, గోనే కృష్ణ, రాగుల శేఖర్, పాముల రవి, రామచంద్రన్, ఆకుల శ్రీనివాస్, కందుకూరి వేణు, భాను, పాముల ప్రవీణ్ కుమార్, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు
Post Comment