వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది

  • ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనే దిక్కులేక రైతులు అవేదన చెందుతున్నారు
  • అప్పులు తెచ్చి పంట పండిస్తే కొనే దిక్కులేక పోయారు
  • అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ ప్రభుత్వానికి రైతుల ధాన్యం కొనగోలుపై లేదు
  • గన్ని బ్యాగులు ఇచ్చే పరిస్తితిలో ప్రభుత్వం లేదు
  • కేసీఆర్ ఉన్నపుడు ఎప్పుడూ వడ్ల కొనుగోలులో ఇంత ఆలస్యం కాలేదు
  • ప్రభుత్వం రైతుల నుండి తరుగు పేరిట 3 కేజిల వడ్లు కట్ చేస్తున్నారు
  • అధికారులు ఏం చేస్తున్నారు కొనుగోలు కేంద్రాల్లో తిరగాలి
  • ఈ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుంది
  • పాలన చేతకాకుంటే రేవంత్ రెడ్డి దిగిపోవాలి
  • రేవంత్ రెడ్డి  44 సార్లు డిల్లీ వెళ్ళి ఏం సాధించారు
  • మంత్రులు గాలిమోటర్ల ప్రయాణాలు తప్ప ఏం లేదు
  • అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణమే ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని కోరారు 
  • పిఏ పల్లి ఘణపురం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన నల్లగొండ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు,దేవరకొండ మాజీ శాసన సభ్యులు రమావత్ రవీంద్ర కుమార్

వడ్ల కొనుగోలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది

జయభేరి, పి ఏ పల్లి :
పీ ఏ పల్లి మండలం ఘణపురం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాజీ శాసనసభ్యులు రవీంద్ర కుమార్ పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..... ఆరుగాలం కష్టపడి పండించిన పంట కొనే దిక్కులేక రైతులు అవేదన చెందుతున్నారు అని ఆయన తెలిపారు.ములుగే నక్కపై తాటి పండు పడ్డట్టు రైతు పరిస్తితి ఉంది  అని ఆయన అన్నారు.అప్పులు తెచ్చి పంట పండిస్తే కొనే దిక్కులేక పోయారు అని అన్నారు.అందాల పోటీలపై ఉన్న శ్రద్ధ ప్రభుత్వానికి రైతుల ధాన్యం కొనగోలుపై లేదు అని ఆయన అన్నారు. గన్ని బ్యాగులు ఇచ్చే పరిస్తితిలో ప్రభుత్వం లేదు అని అన్నారు. కేసీఆర్ ఉన్నపుడు ఎప్పుడూ వడ్ల కొనుగోలులో ఇంత ఆలస్యం కాలేదు అని ఆయన గుర్తు చేశారు. 

ప్రభుత్వం రైతుల నుండి తరుగు పేరిట 3 కేజిల వడ్లు కట్ చేస్తున్నారు అని వెంటనే ఆపాలని కోరారు.అధికారులు ఏం చేస్తున్నారు కొనుగోలు కేంద్రాల్లో తిరగాలి అని సూచించారు ఈ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటుంది అని అన్నారు. పాలన చేతకాకుంటే రేవంత్ రెడ్డి దిగిపోవాలి అని కోరారు రేవంత్ రెడ్డి  44 సార్లు డిల్లీ వెళ్ళి ఏం సాధించారు అని ఆయన ప్రశ్నించారు. మంత్రులు గాలిమోటర్ల ప్రయాణాలు తప్ప ఏం లేదు అని ఆయన అన్నారు.ఎన్నికల ముందు ఇచ్చిన 7గ్యారంటీలు,420హామీలు అమలు చేయాలి అని ఆయన డిమాండ్ చేశారు. 

Read More ధరణితో పరిష్కారం కానీ సమస్యలు భూ భారతి తో చెక్...

WhatsApp Image 2025-05-12 at 19.02.30

Read More శివం హిల్స్ కాలనీ లో R.R చికెన్ సెంటర్ ను ప్రారంభించిన

అధికారులతో ఫోన్లో మాట్లాడి తక్షణమే ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వేలుగురి వల్లపు రెడ్డి, మాజీ సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు మునగాల అంజి రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ముఖ్య సలహాదారులు అర్వపల్లి నర్సింహ, యువ నాయకులు మద సుధాకర్ గౌడ్, మాజీ మార్కెట్ డైరెక్టర్ ఎర్ర యాదగిరి, రయినబోయిన శ్రీను, బొడ్డుపల్లి మహేందర్, వంగాల కృష్ణా రెడ్డి, గోలి గిరి, యువ నాయకులు కళాచారి, నిమ్మల విష్ణువర్థన్ రెడ్డి, కర్నాటి రవి, ప్రదీప్, శివ, తదితరులు పాల్గొన్నారు.

Read More కుంట్లూర్ గ్రామంలో విషాదం

Latest News

జనంసాక్షి ఎడిటర్ పై కేసు ఎత్తివేయాలి జనంసాక్షి ఎడిటర్ పై కేసు ఎత్తివేయాలి
జయభేరి, హైదరాబాద్ : జోగులాంబ గద్వాల జిల్లా, పెద్దధన్వాడ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్న ఇథనాల్‌ ఫ్యాక్టరీ దుష్ప్రభావాలపై వరస కథనాలను ప్రచురించిన జనంసాక్షి పత్రిక ఎడిటర్ ఎం.ఎం.రహమాన్...
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జెండా ఆవిష్కరణ
ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి ముగ్గు
శివం హిల్స్ కాలనీ లో R.R చికెన్ సెంటర్ ను ప్రారంభించిన
బ్లాస్టింగ్ చేస్తేనే ఆ టన్నెల్ తవ్వగలం!
కుంట్లూర్ గ్రామంలో విషాదం