డిఈవోను కలిసిన ఎస్ఎఫ్ఐ నాయకులు

విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం అందజేత

డిఈవోను కలిసిన ఎస్ఎఫ్ఐ నాయకులు

జయభేరి, పరకాల, ఫిబ్రవరి 07: 
విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని హనుమకొండ  డిఈవో వాసంతిని పరకాల ఎంఈఓ ఆఫీసులో కలవడం జరిగింది. ఈ సందర్బంగా పరకాల పట్టణంలో ప్రభుత్వ స్కూల్లల్లో కనీసం మౌలిక సదుపయాలు లేక విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని, హనుమకొండ జిల్లాలో ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిఈవోను కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు బొచ్చు కళ్యాణ్, పరకాల మండల అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్ పాల్గొన్నారు.