మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను పరామర్శించిన చల్లా ధర్మా రెడ్డి 

మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను పరామర్శించిన చల్లా ధర్మా రెడ్డి 

జయభేరి, పరకాల, ఫిబ్రవరి 07: 
వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తల్లి వెంకటమ్మ కొద్దిరోజుల క్రితం మృతిచెందడం జరిగింది. శుక్రవారం  వారి స్వగ్రామమైన జాఫర్ గడ్ మండలం ఉప్పుగల్ గ్రామంలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి  ఆరూరి రమేష్ ని పరామర్శించి వెంకటమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నిమ్మగడ్డ వేంకటేశ్వర రావు, మాజీ జెడ్పీటీసీ గూడ సుదర్శన్ రెడ్డి, నాయకులు జక్క మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.