TS TET 2024 Updates : తెలంగాణ టెట్ అభ్యర్థులకు అలర్ట్... వెబ్‌సైట్‌లో ఆ ‘ఆప్షన్’ వచ్చేసింది..!
దరఖాస్తుల్లో తప్పులుంటే సరిదిద్దుకునేందుకు అవకాశం కల్పించారు.
తెలంగాణ టెట్ అప్లికేషన్స్ (TS TET Applications)కి సంబంధించిన ముఖ్యమైన అప్‌డేట్. ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు... ఎడిట్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ మేరకు వెబ్‌సైట్‌లో ఆప్షన్‌ను అందుబాటులోకి తెచ్చింది.
TS TET 2024 Application Edit option : ఇలా ఎడిట్ చేసుకోండి…
తెలంగాణ టెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లాలి.
హోమ్ పేజీలో ఎడిట్ అప్లికేషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయండి.
ఇక్కడ Journal Number/Payment Reference ID, (Date of Birth) పుట్టిన తేదీని నమోదు చేసి సమర్పించాలి.
మీ అప్లికేషన్ తెరవబడుతుంది. మీరు మీ వివరాలను సవరించవచ్చు.
చివరగా మీ దరఖాస్తును సమర్పించి, సవరించండి.
ప్రింట్ అప్లికేషన్‌పై క్లిక్ చేసి, మీ దరఖాస్తు ఫారమ్‌ను పొందండి.
How to Apply TS TET 2024 : టెట్ కు ఇలా దరఖాస్తు చేసుకోండి
టెట్ రాయడానికి అర్హత ఉన్న అభ్యర్థులు ముందుగా https://schooledu.telangana.gov.in వెబ్‌సైట్‌కి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.
ముందుగా ‘Fee Payment’ ఆప్షన్‌పై క్లిక్ చేసి, నిర్ణీత రుసుమును చెల్లించండి.
చెల్లింపు స్థితి కాలమ్‌పై క్లిక్ చేసి దరఖాస్తు రుసుము చెల్లింపు ప్రక్రియ పూర్తయిందా..? లేదా తనిఖీ చేయాలి.
ఆ తర్వాత ‘Application Submission’ లింక్‌పై క్లిక్ చేయండి.
మీ వివరాలను నమోదు చేయండి. ఫొటో, సంతకం తప్పనిసరిగా అప్‌లోడ్ చేయాలి.
అన్ని వివరాలను నమోదు చేసిన తర్వాత, దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడానికి చివరిలో సమర్పించు బటన్‌పై క్లిక్ చేయండి.
'Print Application' ఎంపికపై క్లిక్ చేయడం ద్వారా మీరు మీ అప్లికేషన్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు లేదా ప్రింట్ చేయవచ్చు.
రిజిస్ట్రేషన్ నంబర్‌ను జాగ్రత్తగా ఉంచండి. హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి ఈ నంబర్ ఉపయోగపడుతుంది.
TS TET Dates 2024 : తెలంగాణ టెట్ ముఖ్య తేదీలు:
తెలంగాణ టెట్ దరఖాస్తులకు చివరి తేదీ – ఏప్రిల్ 20, 2024.
హాల్ టిక్కెట్లు - మే 15, 2024.
పరీక్షల ప్రారంభం - మే 20, 2024.
పరీక్షల ముగింపు – జూన్ 06,2024.
టెట్ ఫలితాలు – జూన్ 12, 2024.
అధికారిక వెబ్‌సైట్ - https://schooledu.telangana.gov.in/ISMS/
Post Comment