మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి 

 ఏ.ఎస్.పి పి. మౌనిక 

మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి 

జయభేరి, దేవరకొండ : మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని తాత్కాలిక ఆనందం పొందవచ్చేమో కానీ జీవితంలో విలువైన భవిష్యత్తును కోల్పోవడం జరుగుతుందని ఏ ఎస్ పిపి. మౌనిక అన్నారు. అంతర్జాతీయ యాంటీ డ్రగ్స్ వారోత్సవాల్లో భాగంగా బుధవారం దేవరకొండ పట్టణంలోని మోడల్ స్కూల్లో విద్యార్థులకు మత్తుపదార్థాల అనర్ధాల గురించి అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... అందమైన చక్కటి జీవితాన్ని విద్యార్థులు కొనసాగించాలని తెలిపారు. 13 నుంచి 19 వయసులో తెలియకుండా స్నేహితుల ద్వారా అలవాటు పడిన మత్తుపదార్థాలు ప్రాణాలను హరించి వేస్తాయని ఆమె తెలిపారు. గంజాయి డ్రగ్స్ గుట్కా లాంటి వాటిని పాఠశాల ఆవరణలో పూర్తిగా నిషేధించి ప్రశాంతమైనటువంటి విద్యా లయలుగా తీర్చిదిద్దడానికి ఉపాధ్యాయ కృషి చేయాలని తెలిపారు.

Read More Auto I షౌకత్ గ్యారేజ్

IMG-20250625-WA1298

Read More Telangana I తుంగతుర్తి గడ్డపై ఎగరబోయే జెండా..!?

ఈ కార్యక్రమంలో దేవరకొండ సిఐ నరసింహులు, ఎస్సై నారాయణరెడ్డి , ఇన్చార్జి ప్రిన్సిపాల్ మల్లేష్, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు  అంజయ్య, నాగరాజు, ప్రవీణ్, కరుణాకర్, శాంసన్, సుజాత, కాలిక్,పాఠశాల విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Read More Telangana I గౌడ్ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ (గోపా) 42వ వన భోజన కార్యక్రమం

Views: 3