డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్

డిండి MRPS గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్

జయభేరి, డిండి : మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(MRPS)కామదేను గౌరారం గ్రామ శాఖ అధ్యక్షులుగా ముదిగొండ వెంకట్ ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు మాదిగ జర్నలిస్ట్ ఫోరం(MJF)నల్లగొండ జిల్లా అధ్యక్షులు జీడిమెట్ల రవీందర్  నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్బంగా నూతన గ్రామ శాఖ అధ్యక్షులుగా ఎన్నికైన ముదిగొండ వెంకట్ మాట్లాడుతూ ఎస్సి వర్గీకరణ కోసం మాన్యశ్రీ మంద కృష్ణ మాదిగ నేత్రుత్వంలో నిర్వహించే పోరాటాల్లో భాగస్వామ్యమై, మాదిగ జాతి హక్కులకై పోరడుతూ,త్వరలోనే  మంద కృష్ణ మాదిగ నిర్వహించే వేల గొంతులు లక్ష డప్పులు కార్యక్రమ విజయవంతానికి కృషిచేయనున్నట్లు తెలిపారు. నా నియామకానికి సహకరించిన MRPS వ్యవస్థపాక అధ్యక్షులు మాన్యశ్రీ మంద కృష్ణ మాదిగ, మాదిగ జర్నలిస్ట్ ఫోరం(MJF)జిల్లా జిల్లా అధ్యక్షులు జీడిమెట్ల రవీందర్, MJF జిల్లా నాయకులు దర్శనం విష్ణు, MRPS డిండి మండల అధ్యక్షులు జంతుక రేణయ్య లకు ధన్యవాదములు తెలిపారు.

Read More ఎమ్మెల్సీ రామచంద్రారావును సన్మానించిన మేడ్చల్ జిల్లా బిజెపి అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్