క్షయ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి.
MLHPడాక్టర్ సృజన
జయభేరి, కోదాడ : మండలంలోని గోల్ తండాలో క్షయ వ్యాధి శిబిరాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యురాలు సృజన ప్రజలకు క్షయ వ్యాధి పరీక్షలు నిర్వహించారు అనంతరం మాట్లాడుతూ
వ్యాధిని నిర్లక్ష్యం చేస్తే సంవత్సరంలో 15 నుండి 20 మందికి టిబి వ్యాధి అంటుకునే అవకాశం ఉందన్నారు. వ్యాధులతో బాధపడుతున్న వారు, 60 సంవత్సరాల పైబడిన వారు, స్ట్రీట్ వెండర్స్, గతంలో టిబి మందులు వాడిన వారు, ఫ్యాక్టరీలో పనిచేవారిని గుర్తించి పరీక్షలు నిర్వహించాలని ఆరోగ్య సిబ్బందికి సూచించారు. ప్రారంభ దశలో క్షయ వ్యాధిని గుర్తించి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉచితంగా మందులు అందిస్తారని, ఆరు నెలలు పాటు మందులు వాడితే టిబి జబ్బు పూర్తిగా నయం అవుతుందన్నారు.
శిబిరంలో 118 మందికి X ray, తెమడ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది సుభాషిణి, సైదులు, ఉపేందర్, సూపర్ వైజర్ ఉమా మహేశ్వరి, స్వాతి, పరమేశ్వరి, DRTB కో ఆర్డినేటర్ ప్రసాద్ STS కిరణ్ కుమార్, మాధవ రెడ్డి, LT రవి, ఆరోగ్య కార్యకర్తలు కళ్యాణి, పద్మావతి, కరుణ కుమారి, మీనా కుమారి, నాగేంద్రమ్మ ఆశా కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Post Comment