Telangana I పార్లమెంటు ఎన్నికలవేళ బ్యాండ్ బాజా.. అదేనండి.. ఎన్నికల బాండ్.. పార్టీల చిత్తశుద్ధికి పరీక్షా కాలం..
ఎక్కడికక్కడ నిలదీయండి!? ప్రశ్నించండి!?
జయభేరి, హైదరాబాద్ :
మార్చి 15 నా సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ కి ఒక నోటీసు పంపింది రాజకీయ పార్టీలకు ప్రైవేటు వ్యక్తులు ఇచ్చిన బాండ్స్ ను పబ్లిక్ లో పెట్టాలని చెబుతూ ఆదేశాలు జారీ చేసింది. ఇక ఈ విషయాన్ని పక్కదో పాటించడానికి పార్లమెంటు ఎన్నికల్లో రాద్ధాంతాన్ని ముందర వేస్తూ ఆయా రాజకీయ పార్టీలు బాగానే హడావిడి కార్యక్రమాన్ని మొదలుపెట్టుకున్నాయి. ఇంతవరకు బాగానే ఉన్నా అసలు బాగోతం మళ్ళీ బయటపడింది. తాజాగా ఎస్బిఐ ని సుప్రీంకోర్టు తీవ్రంగా మందలిస్తూ మొట్టికాయలు కొట్టింది. గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారంగా ఎన్నికల బాండ్లు కచ్చితంగా ప్రజలకు తెలిసే విధంగా పబ్లిక్ డొమైన్లు ఎందుకు పెట్టలేదు ఎందుకు దానిని విస్మరించారు అంటూ ఎస్బిఐ ని ఆదేశించింది. ఇక్కడే అసలు కథ మొదలవుతుంది.
మొట్టమొదలు ప్రజలని మభ్యపరిచి కొన్ని వందల కోట్ల బాండ్లను తీసుకున్న బిజెపి పార్టీ ఆ విషయాన్ని దాటవేస్తూ పార్లమెంటులో ఎలాగైనా తెలంగాణ నుంచి 17 సీట్లలో కనీసం 10 సీట్లు అయినా గెలుచుకోవాలని ఉద్దేశంతో అమిత్ షా తెలంగాణ పర్యటన చేసి బాగానే ఉపన్యాసం దండుకున్న గురిగింజ కింద ఉన్న దానిని అది చూసుకోలేదు అన్నట్టుగా బిజెపి దాని కింద ఉన్న తప్పును మాత్రం బయటికి పెట్టడం లేదు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా బిజెపి పార్టీ ఎన్నికలవేళ ఎవరెవరి దగ్గర నుంచి ఎవరెవరి వ్యక్తుల దగ్గర నుంచి ఎంతెంత నగదును బాండ్ల రూపంలో తీసుకుంది అన్న విషయాన్ని బయట పెట్టాలని చెప్పడంతో కొన్ని రోజులపాటు దీన్ని పక్కన పెట్టిన మళ్లీ ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాలు మరొక మారు బిజెపి పార్టీకి చెంపపెట్టుకానున్నాయి...
నిజానికి బిజెపి పార్టీ దేశ సమగ్రత వందేమాతరం జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై జైశ్రీరామ్ అనే నినాదాలతో దేశంలోని యువతను ఆధ్యాత్మిక విప్లవానికి మునిపెడుతూ మతోన్మాదులుగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్న తమ దగ్గర ఉన్న బాండ్ల విషయాన్ని మాత్రం బయట పెట్టడానికి సుముఖంగా లేనట్టు కనిపిస్తోంది. అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎవరెవరు ఆ పార్టీకి ఎన్నికలవేళ బాండ్లను ఇచ్చారు అవి పబ్లిక్ కు తెలిసేలా పెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ కేసీఆర్ కూడా ఈ విషయాన్ని పక్కదోవ పట్టించే ప్రయత్నం చేశాడు. కానీ ఇప్పుడు ఆ పప్పులేవి ఉడకవు అన్నట్టుగా ఎస్బిఐ కి మొట్టికాయలు కొట్టడంతో కచ్చితంగా పార్లమెంటు ఎన్నికలు మొదలు కాకమునుపే బాధ్యతమైన రాజకీయ పార్టీలు పబ్లిక్ డొమైన్లో ఆయా పార్టీలు గతంలో ఇప్పుడు ఆయా ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి ఎంత నగదు తో కూడిన బాండ్లను తీసుకున్నారు కచ్చితంగా చెప్పాలన్న రూలును పాటించాల్సిందే.
అయితే ఇదే ఇప్పుడు మింగుడు పడని కరక్కాయ మాదిరిగా మారింది. వాస్తవానికి బిజెపి పార్టీ జాతీయ వాదంతోనే పబ్బం గడుపుకుంటున్న మూడోసారి ముచ్చటగా అధికారంలోకి రావాలని మళ్లీ జైశ్రీరామ్ అంటూ వందేమాతరం అంటూ వేదాలు వల్లిస్తున్న కార్పొరేట్ శక్తులను భుజాల మీద ఎత్తుకొని తిరిగింది మోడీ కాదా!? వందల కోట్ల రూపాయలతో ఆయా రాష్ట్రాలలో కట్టిన బ్రిడ్జిలు కూలిపోలేదా!? భారతదేశం అన్ని విధాల ప్రగతి పదంలో ముందుకు దూసుకుపోతుంది అని చెప్పే ఈ పెద్ద మనుషులు కార్పొరేట్ శక్తులను భుజాల వేసుకొని ఎక్కి ప్రభుత్వ ధనాన్ని వృధా చేస్తున్న ఎవరు నోరు మెదపరు ఎందుకని!?
వికసిత భారత్ పేరుతో ప్రజలకు అది చేసాం ఇది చేసాం అని గొప్పగా చెప్పుకుంటూ ఆయా సోషల్ మీడియాలలో ప్రసారమాధ్యమాల్లో ప్రకటనలు గుప్పిస్తున్న మరి గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాన్ని ఎందుకు పాటించడం లేదు!? బిజెపి పార్టీ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడం కోసం గతంలో లిక్కర్ కేసులో కల్వకుంట్ల కవితకు నోటీసులు అందజేసి పదేపదే ఎంక్వయిరీ ల పేరుతో విచారణకు పిలిపించిన కవితను అరెస్టు చేయకపోవడం పై రాష్ట్రంలో బిజెపి నేతల్లో కొంత నమ్మకాన్ని పోగొట్టుకుంటుంది. ఇక అలాగే దేశంలో ఉన్న నల్లధనాన్ని మొత్తం బయటికి తీసి ప్రజలందరికీ పంచుతానన్న భారత ప్రధాని మోడీ మాటలను నెరవేర్చకపోవడంతో ప్రజల్లో కొంత అసహనం నెలకొంటుంది. అది చాలదన్నట్టు కార్పోరేట్ శక్తులు బ్యాంకులను ముంచి ఎగ్గొట్టిన డబ్బును తిరిగి రాబట్టుకునేందుకు సాధారణ జనాల మీద పన్నుల పేరుతో ఫైన్ ల పేరుతో ప్రజలను పీడించి తీసుకోవడం లేదా? రాజకీయాల పేరుతో మతోన్మాద రాజకీయాలను ముందుకు నెట్టుతూ యువతను ఆకర్షించుకునే విధంగా ఆయా వాక్యాలను వల్లిస్తూ ఎవరిని మభ్యపెడుతున్నారు? దేశాన్ని ఎటువైపు తీసుకెళుతున్నారు? బిజెపి పార్టీ మొట్టమొదట పార్లమెంటు ఎలక్షన్లో పాల్గొనకుండా చేయాలి అంటే కచ్చితంగా ప్రజలు తిరగబడి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ముందర పెడుతూ వాటికి ఏఏ ప్రైవేటు వ్యక్తుల దగ్గర నుంచి ఎంతెంత బాండ్స్ వచ్చాయో ఖచ్చితంగా ప్రజలకు తెలిసేలా పబ్లిక్ డిమాండ్ లో పెట్టాలి అనే సోయి కూడా బిజెపి ప్రభుత్వానికి లేకపోతే ఆ పార్టీని ఏమనాలి?
ఇక టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎంతో మంది దగ్గర నుంచి విరాళాలు సేకరించి ప్రజలకు చెప్పకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యక్తులు దగ్గర నుంచి తిరిగి 2019 ఎలక్షన్లో ఎవరెవరి దగ్గర నుంచి ఎంతెంత తీసుకున్నారు ఆ విషయాన్ని బయట పెట్టాలని గౌరవ సుప్రీంకోర్టు చెప్పిన తాజాగా ఎస్బిఐ ని మొట్టికాయలు కొట్టిన ఇంకా రాజకీయ నాయకుల్లో మార్పు రాలేదు అంటే ఇది వాళ్ళ అవకాశవాద రాజకీయాలకు ప్రతీకాష్ట కాదా!?
తెలంగాణ బాగుండాలి జై తెలంగాణ అంటూనే తెలంగాణ సంపదను దోచుకుంటున్న ఇలాంటి రాక్షసులను తెలంగాణ ప్రజలు ఏం చేయాలి? మత గ్రంథాలలో పురాణాలలో ఇతిహాసాలలో చెడు చేసే వాళ్లను రాక్షసులుగా చిత్రీకరించిన ఈ సమాజం ప్రజల సొమ్మును ప్రజల ఆస్తిని ప్రజా ధనాన్ని కొల్లగొడుతున్న ఇలాంటి నీచ నికృష్టమైన దౌర్భాగ్యమైన నిరంకుశ నియంత మతోన్మాద శక్తుల రాజకీయ నాయకులను ఏం చేయాలి?
ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల కొరకు ప్రజలే ఎన్నుకొనబడ్డా ఇలాంటి దేశంలో ప్రజలకు నాయకుల తీరు తెన్నులు వివరించే సోయి ఎక్కడ పోయింది? గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినప్పటికీ పట్టించుకోని ఇలాంటి నాయకులను పార్లమెంటులో కూర్చోబెడదామా?
అందుకే కాబోలు బిజెపి పార్టీ హడావుడి చేస్తూ రాష్ట్రంలో దేశంలోని ప్రతి రాష్ట్రాలలో అలసడిని సృష్టిస్తూ ఎలాగైనా మళ్లీ అత్యధిక పార్లమెంటు స్థానాలను దక్కించుకోవాలని తహతహలాడుతోంది. ఎందుకంటే ముచ్చటగా మూడవ సారి కూడా మోడీని ప్రధానమంత్రిగా చేస్తూ చరిత్రపుటల్లోకి ఎక్కి అదేదో ఘన కీర్తిని సాధించినట్టుగా చెప్పుకోవాలని చూస్తున్నా గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు ఎందుకు కట్టుబడి బిజెపి ప్రభుత్వం పని చేయట్లేదు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్వతంత్ర ప్రతిపత్తి గల సిబిఐ ఐటి ఇన్కమ్ టాక్స్ ఇలాంటి సీక్రెట్ ఏజెన్సీల అధికారాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వం తన గుప్పిట్లో పెట్టుకుని నచ్చని పార్టీల వ్యక్తులపై విసరడం భయపెట్టడం లోబర్చుకోవడం చేయడం చాలా సిగ్గుచేటు. భారతీయ ప్రజలు దీన్ని పరిగణలోకి తీసుకోవడం లేదని భావిస్తుంది బిజెపి... పిల్లి పాలు తాగుతూ నన్నెవరూ చూడట్లేదు అనుకున్న రీతిలో బిజెపి ప్రభుత్వం ఎన్ని దొంగ వేషాలు వేస్తున్నప్పటికీ దేశ సంపదను కొల్లగొడుతున్న కార్పొరేట్ శక్తులపై పంజా విసరడం మానేసి బడుగు బలహీన వర్గాలకు పన్నుల భారంతో మౌలిక వసతుల విషయంలో అధిక ధరలను పెంచి ప్రజల నుంచి పీడించి పీడించి పన్నుల రూపంలో ఎక్కువ సొమ్మును తీసుకొని బ్యాంకుల అప్పులు కట్టడం లేదా?
ఈ దేశం ఎటు పోతుంది అని నాటి మహనీయులు ఎంతోమంది త్యాగదనులు స్వతంత్ర పోరాటంలో ప్రాణాలకు తెగించి దేశానికి స్వాతంత్రం అందిస్తే మతాల పేరుతో కులాల పేరుతో ఆయా వ్యక్తుల దగ్గర నుంచి రాజకీయ లబ్ధి కోసం వందల కోట్ల నిధులను సేకరించి ప్రజలకు చెప్పకుండా రాజకీయ పార్టీలు అధికారాన్ని స్థిరంగా చెలాయించుకోవాలని దుర్బుద్ధిని పరిగణలోకి తీసుకొని గౌరవ సుప్రీంకోర్టు న్యాయస్థానం తీర్పు వెలువరించిన ఇంతవరకు ఆయా రాజకీయ నాయకులకు వినబడడం లేదా!? అందుకే భారత ప్రజలారా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలారా బిజెపిని బీఆర్ఎస్ నేతలని ఎక్కడికక్కడ నిలదీయండి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఎందుకు మీరు పాటించడం లేదు గతంలో మీకు ఆయా ప్రైవేటు వ్యక్తుల నుంచి ఎన్ని ఎన్నికల కోసం బాండ్లు వచ్చాయి అనే విషయాన్ని బయట పెట్టమని ప్రశ్నించండి? నిజాయితీగా బయటపెట్టి ఇన్ని కోట్ల నిధులు వచ్చాయి దీనికి ఖర్చు చేశాం అని చెప్పే ఏ పార్టీ అయినా ఉంది అంటే ఆ పార్టీకి మన ఓటును వినియోగించు కుందాం. నిజాయితీకి చోటు లేని ఈ సమాజంలో నమ్మకాన్ని అమ్ముకునే మనుషుల మధ్య కోర్టులు అన్నిటికీ దూరంగా ఎప్పటికప్పుడు పరిణతి చెందుతూ తీర్పును అందిస్తున్న రాజకీయ నాయకుల్లో పరిణతి పరిపూర్ణ వ్యక్తిత్వం రాజకీయ నాయకులకు రావట్లేదు.
అందుకనే వాళ్ల పార్టీలో ఎదుగుదలకి ఇస్తున్న విరాళాలను ఎక్కడ నుంచి ఎవరు ఎంతెంత ఇచ్చారు బయట పెట్టాలని సుప్రీంకోర్టు మొట్టికాయలు ఎస్బిఐ ని కొట్టిన బుద్ధి జ్ఞానం లేని రాజకీయ నాయకుల చేతిలో మన ప్రజాస్వామ్యాన్ని పెట్టడం అంతకన్నా అవివేకం మరొకటి లేదు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు త్వరలో రాష్ట్రాలలో పార్లమెంటు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ ప్రజలు పార్లమెంటు అభ్యర్థులుగా నిలబడ్డ వారిని ప్రశ్నిస్తూ మీ విరాళాలను ఎందుకు ప్రజల మధ్య పెట్టలేదని నిలదీయండి. ప్రజలకు పార్టీలపై విశ్వాసం లేనన్ని రోజులు ఏ పార్టీ వచ్చినా ప్రజల జీవితాలు మారవు. ప్రజలకు అనుగుణంగా ప్రజలు తిరగబడి ప్రశ్నించడం నేర్చుకుంటేనే ప్రజల బతుకులు మారుతాయి ప్రజాస్వామ్యం నిలబడుతోంది
...కడారి శ్రీనివాస్
కాలమిస్ట్, సీనియర్ జర్నలిస్ట్, కవి, రచయిత
Post Comment