PMC : అవిశ్వాసంలో నిరూపించుకోవాలి.. కానీ ఈ నంగనాచి వేశాలు ఎందుకు.?

కాంగ్రెస్ నాయకుల ట్రాప్ లో పడి కలెక్టర్ కూడా చట్టవిరుద్దమైన ఆర్డర్ జారీ చేయడం ఎందుకు..?

సంతకాలపై మున్సిపల్ అధికారుల పరిశీలన ప్రక్రియను పూర్తి చేసి 2024 జూన్ 5వ తేదీన అవిశ్వాసం పెట్టాలని నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలోనే 2024 జూన్ 5వ తేదీన ఉదయం 11.00 గంటలకు పీర్జాదిగూడ మున్సిపల్ అధికారులు అవిశ్వాసం కోసం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు. కానీ జిల్లా కలెక్టర్ అవిశ్వాస జరుగుతుందనగా... జూన్ 5వ తేదీనాడు ఉదయం 11.50 గంటలకు అవిశ్వాసం నిలుపుదల చేస్తూ ఆర్డర్ జారీ చేశారు. 

PMC : అవిశ్వాసంలో నిరూపించుకోవాలి.. కానీ ఈ నంగనాచి వేశాలు ఎందుకు.?

- జయభేరి, మేడిపల్లి :
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలని గత ఐదు నెలలుగా కాంగ్రెస్ నాయకులు చేయని కుట్రలు, డ్రామాలు, అనైతిక చర్యలు మీ అందిరికి తెలుసు. దీంతో కార్పోరేషన్ పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కారం, డవలప్మెంట్ పై చేసే క్రమంలోనే తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వచ్చింది. 

క్రమంలో అవిశ్వాస ప్రక్రియను ముగించుకొని ప్రజలకు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉండి ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ డవలప్మెంట్ పనులు చేయాలని నా మీద, నేనే బల నిరూపణకు వెళ్లినం. బలనిరూపణకు వెళ్లే సమయంలో నాపై కలెక్టర్ కు, ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసిన కార్పోరేటర్లు నాకు మద్దుతుగా ఉన్నారు. తదనంతరం ప్రలోభాలకు లొంగి నాపై తప్పుడు ఫిర్యాదులు చేశారు. ఇందులో భాగంగా 2024 మే 6వ తేదీన నా సహచర మెజార్టీ కార్పోరేటర్ల మద్దతుతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం మేడ్చల్ జిల్లా కలెక్టర్ కి అవిశ్వాసం దరఖాస్తు పెట్టుకున్నాను. 

Read More మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేత

218a764e-cb6b-4782-8c60-6e0dddf419b7

Read More ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం PRTUTS తోనే సాధ్యం 

2024 మే 7వ తేదీన కాంగ్రెస్ గూటికి చేరిన కార్పోరేటర్లు కలెక్టర్ కి మమ్మల్ని తప్పుదోవపట్టిస్తూ సంతకాలు పెట్టించుకున్నారు, కాబట్టి మా సంతకాలను పరిగణలోకి తీసుకోవద్దు అని ఓ ఫిర్యదు చేశారు. ఈ రెండు దరఖాస్తును స్వీకరించిన జిల్లా కలెక్టర్ ఈ రెండు దరఖాస్తులను కూడా పరిశీలించి సమగ్ర విచారణ, సంతకాలపై మున్సిపల్ అధికారుల పరిశీలన ప్రక్రియను పూర్తి చేసి 2024 జూన్ 5వ తేదీన అవిశ్వాసం పెట్టాలని నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలోనే 2024 జూన్ 5వ తేదీన ఉదయం 11.00 గంటలకు పీర్జాదిగూడ మున్సిపల్ అధికారులు అవిశ్వాసం కోసం మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాట్లు చేశారు. కానీ జిల్లా కలెక్టర్ అవిశ్వాస జరుగుతుందనగా... జూన్ 5వ తేదీనాడు ఉదయం 11.50 గంటలకు అవిశ్వాసం నిలుపుదల చేస్తూ ఆర్డర్ జారీ చేశారు. 

Read More మేడ్చల్ లో కీచక పోలీస్

మేడిపల్లి పోలీసు స్టేషన్ లో మేయర్ పై నమోదైన కేసు నేపథ్యంలో అవిశ్వాసం నిలుపుదల చేస్తున్నట్లు కలెక్టర్ తన ఆర్డర్ లో పేర్కొన్నారు. ఓ ముగ్గురు కార్పోరేటర్లు ఇచ్చిన తప్పుడు ఫీర్యాదుపై జూన్ 1వ తేదీన కేసు నమోదు అయితే.. కలెక్టర్ జూన్ 5వ తేదీన ఉదయం 11.50 గంటల వరకు ఆర్డర్ జారీ చేశారు. మరి ఈ కేసే కారణం అయితే కలెక్టర్ ఐదు రోజులు గడువు ఎందుకు తీసుకున్నారు ప్రజలు గమనించాలి. అసలు ఈ కేసుకు, రాజ్యాంగ బద్దంగా ప్రకటించిన అవిశ్వానికి సంబంధం ఏమిటి..? వాళ్లు అవిశ్వాసం ఎదుర్కోలేకనే, వాయిదా వేయించాలనే కుట్రలో భాగంగా ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసు పెట్టారు. అది మీడియా మిత్రులతో పాటు పోలీసులకు, కలెక్టర్ కూడా తెలుసు. 

Read More కురుమల పోరాటానికి ఎమ్మార్పీఎస్ మద్దతు కావాలి...

WhatsApp Image 2024-06-06 at 8.42.28 PM (1)

Read More మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ను పరామర్శించిన చల్లా ధర్మా రెడ్డి 

అలాగే ఈ కేసుపై మేడిపల్లి పోలీసులు ప్రాథమిక విచారణ కూడా జరపలేదు. కానీ ఆ కేసు నిరూపణ, నిర్ధారణ కానప్పుడు కలెక్టర్ గారు ఏ విదంగా ఈ కేసును పరిగణలోకి తీసుకొని అవిశ్వాసంను రద్దు చేశారు. ఇదొక్కటే కాదు.. కాంగ్రెస్ నాయకులకు బలం లేక అవిశ్వాసంను ఆపేందుకు 2024 మే 19వ తేదీన ఔటర్ రింగు రోడ్డుపై నన్ను హత్యా చేసేందుకు ప్రయత్నం చేశారు. నాతో పాటు నాకు మద్దతుగా ఉన్న కార్పోరేటర్లను కిడ్నప్ చేసేందుకు యత్నించారు. ఈ ఘటనపై ఘట్కేసర్ పోలీసు స్టేషన్ లో నమోదైన కేసు పెండింగ్ లో ఉంది. అలాగే అవిశ్వాసం ఆపాలని హైకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేశారు. కానీ వాళ్లకు కోర్టులోను భంగపాటు తప్పలేదు. 

Read More నవ వధువుకు పుస్తెమెట్టెలు అందజేతా..

అవిశ్వాసం సభ్యుల ప్రాథమిక హక్కు కాబట్టి ఆ ప్రక్రియను ఆపలేమని హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అవిశ్వాసం నిర్వహించే జూన్ 5వ తేదీలోపు కాంగ్రెస్ కార్పోరేటర్లు చేసిన ఫిర్యాదును కూడా డిస్పోజ్ చేయాలని కలెక్టర్ కు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో పాటు వాళ్లు దాఖలు చేసిన రిట్ పిటీషన్ ను కూడా కోర్టు డిస్పోజ్ చేసింది. కిడ్నప్ విషయంలోను, హైకోర్టులోను కాంగ్రెస్ నాయకులకు చుక్కెదురైంది. కానీ ఎలాగైన అవిశ్వాసంను అడ్డుకోవాలని చివరి ప్రయత్నంగా పోలీసు స్టేషన్ లో తప్పుడు ఫిర్యాదు చేయించి అవిశ్వాసంను అడ్డుకున్నారు. కానీ కలెక్టర్ పై అధికార కాంగ్రెస్ నాయకులు ఒత్తిడి తేవడంతో కలెక్టర్ చట్ట విరుద్దంగా అవిశ్వాసం ఆపాలని ఆర్డర్ జారీ చేశారు. 

Read More హరీష్ రావు పై అక్రమ కేసులు తగవు

WhatsApp Image 2024-06-06 at 5.55.37 PM

Read More సెల్లార్ లో కూలిన మట్టిదిబ్బలు

అవిశ్వాసం ప్రక్రియను పూర్తి చేసేందుకు కోర్టు అభ్యంతరం లేకున్నా, సభ్యుల ప్రాథమిక హక్కుకు భంగం కలిగిస్తూ, మున్సిపల్ యాక్టు క్లాజ్ 10(1) పేజీ నంబర్ 416కి విరుద్దంగా మేడ్చల్ జిల్లా కలెక్టర్ తనకు లేని అధికారాలను కల్పించుకొని అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి ఆర్డర్ జారీ చేశారు. ఒక రాజ్యాంగబద్దమైన పదవిలో ఉన్న కలెక్టర్, చట్టాన్ని సక్రమంగా అమలు చేయాల్సిన కలెక్టర్ ఇలా చేయడం సమంజసం కాదు. బలం ఉంటే కాంగ్రెస్ నాయకులు తమతమ బలాన్ని అవిశ్వాసంలో నిరూపించుకోవాలని కానీ ఈ నంగనాచి వేశాలు ఎందుకు.? కాంగ్రెస్ నాయకుల ట్రాప్ లో పడి కలెక్టర్ కూడా చట్టవిరుద్దమైన ఆర్డర్ జారీ చేయడం ఎందుకు..? ప్రజాస్వామ్యంలో ఇది మంచి పరిణామం కాదు.

Read More అంతర్రాష్ట్ర గంజాయి విక్రెతల ముఠా అరెస్ట్... భారీగా గంజాయి స్వాధీనం